Rashmika Mandanna : రష్మిగా మందన్నా.. అనేది కేవలం పేరు మాత్రమే కాదు. ఒక బ్రాండ్. ఒక నేషనల్ క్రష్. అవును.. రష్మిక మందన్నా ఇప్పుడు నేషనల్ క్రష్ బ్యూటీ అయిపోయింది. ఎందుకంటే.. పుష్ప సినిమాతోనే తనకు ఒక రేంజ్ లో ఫాలోయింగ్ పెరిగింది. దీంతో తను పాన్ ఇండియా స్టార్ అయిపోయింది. టాలీవుడ్ లో పట్టుమని పది సినిమాల్లో కూడా నటించలేదు కానీ.. తను ఇప్పుడు నేషనల్ స్టార్ హీరోయిన్. బాలీవుడ్ లో తనకు ఉన్న రేంజ్, క్రేజ్ చూస్తే మతిపోవాల్సిందే. ప్రస్తుతం టాలీవుడ్, బాలీవుడ్ అనే తేడా లేకుండా తనకు నచ్చితే ఏ సినిమాలో అయినా నటించేందుకు రెడీ అంటోంది ఈ సుందరి.
పుష్ప సినిమా తర్వాత తనకు వచ్చిన క్రేజ్ ను క్యాష్ చేసుకుంటోంది రష్మిక. కాకపోతే తను ఈ స్థాయికి చేరుకోవడానికి చాలా కష్టపడిందనే చెప్పాలి. కెరీర్ మొదట్లో తాను చాలా ఒడిదుడుకులను ఎదుర్కొంది. ముఖ్యంగా తన పర్సనల్ లైఫ్ లో చాలా ఇబ్బందులు పడింది. కన్నడ ఇండస్ట్రీలో హీరోయిన్ గా నటిస్తున్న రోజుల్లోనే రష్మిగా మందన్నా.. కన్నడ హీరో రక్షిత్ శెట్టితో ప్రేమలో పడింది. ఇద్దరూ పెళ్లి పీటలు ఎక్కేందుకు రెడీ అయ్యారు. నిశ్చితార్థం కూడా అయింది. కానీ.. పెళ్లి కాకముందే వాళ్ల పెళ్లికి బ్రేక్ పడింది. అప్పుడే తనకు తెలుగులోనూ మంచి అవకాశాలు వచ్చాయి. గీత గోవిందం సినిమాతో తెలుగులో ఒక్కసారిగా టాప్ హీరోయిన్ రేంజ్ కు వెళ్లిపోయింది ఈ ముద్దుగుమ్మ. కానీ..
కొన్ని సినిమాల్లో ముద్దు సీన్లలో నటించడంతో తనపై చాలా విమర్శలు వచ్చాయి. తెలుగులో అవకాశాలు రావడంతో తన ప్రియుడు రక్షిత్ తో బ్రేకప్ చెప్పి తెలుగు ఇండస్ట్రీలోకి వచ్చేసిందని కూడా అప్పట్లో వార్తలు వచ్చాయి. తనను వ్యక్తిగతంగానూ టార్గెట్ చేసి సోషల్ మీడియాలో విమర్శలు మొదలు పెట్టారు. రక్షిత్ తో బ్రేకప్ విషయంపై తను అంతగా బాధపడలేదు కానీ.. సినిమాల్లో తను నటించిన లిప్ లాక్ సీన్లపై వచ్చిన విమర్శలకు మాత్రం తాను చాలా బాధపడిందట. ఈ విషయాన్ని తాజాగా చెప్పుకొచ్చింది రష్మిక. ఆ ట్రోలింగ్ ను తట్టుకోలేక డిప్రెషన్ లోకి వెళ్లిపోయినట్టు చెప్పింది. చివరకు ఎలాగోలా ఆ నెగెటివిటీ నుంచి బయటికి వచ్చానని ఇటీవల చెప్పుకొచ్చింది ఈ ముద్దుగుమ్మ.
Passports : పాస్పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్రాజ్లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.