#image_title
Bigg Boss Telugu 7 : నిజానికి నాలుగో వారం తేజ ఎలిమినేట్ కావాలి. కానీ.. అలా జరగలేదు. తేజ ఎలిమినేట్ అవుతాడని అంతా ఊహించిందే. కానీ.. రతిక ఎలిమినేట్ అవుతుందని మాత్రం ఎవ్వరూ ఊహించలేకపోయారు. రతిక మూడో వారం వరకు బాగానే ఆడింది. కానీ.. నాలుగో వారంలో మరీ దిగజారిపోయిందనే చెప్పుకోవాలి. నిజానికి రతిక ఆట చూసి ప్రేక్షకులకు కూడా చిరాకు వచ్చేసింది. రతిక హౌస్ లో ఉండి కొందరినే టార్గెట్ చేస్తూ మాట్లాడటం చూసి జనాలకు కూడా నచ్చలేదు. మొదట్నుంచి శివాజీ బ్యాచ్ తో ఉన్న రతిక.. ఒక్కసారిగా స్టార్ మా బ్యాచ్ లో కలిసిపోవడం, రెండు చేతులు కలిస్తేనే చప్పట్లు అని శివాజీ అన్నాడని తెగ బాధపడిపోవడం.. ప్రశాంత్ ను సిగ్గుందా.. అంటూ ఛీప్ గా మాట్లాడటం ఇవన్నీ చూసి జనాలకు చిరాకు వేసింది. అందుకే.. తేజను ఎలిమినేట్ చేయాల్సిన జనాలు.. తేజకు ఓట్లేసి మరీ గెలిపించి చివరకు రతికను ఇంటికి పంపించేశారు.
నిజానికి రతిక విషయంలో బిగ్ బాస్ కి కూడా చిరాకు వచ్చేసింది. ఏ గేమ్ లోనూ తన వంద శాతం పెట్టింది లేదు. కావాలని అందరితో గొడవలు పెట్టుకోవడం, టాస్కులను ముందు వెళ్లకుండా ఆపడం, తనకు నచ్చిందే చేస్తా అనడం, ప్రశాంత్ విషయంలోనూ అదే జరిగింది. ప్రశాంత్ ను ఛీప్ గా తీసిపారేయడం.. ముందేమో ప్రశాంత్ కు ఆశలు కల్పించి ఇప్పుడు ప్రశాంత్ నే తిరిగి బ్లాక్ మెయిల్ చేయడం.. ఇవన్నీ చూసి జనాలకే కాదు.. బిగ్ బాస్ కే చిరాకు వచ్చేసింది. ఏంటి మరీ ఇంత దారుణంగా రతిక ఇలా మాటలు మారుస్తుంది అని అనుకున్నారు. అంతే కాదు.. ప్రశాంత్ ను వదిలేసి రతిక.. యావర్ వెంట పడటం.. కొన్ని రోజులు ఆ ఇద్దరూ కలిసి తిరగడం, ఒకే ప్లేట్ లో తినడం ఇవన్నీ జరిగాయి. ఏది ఏమైనా రతిక విషయంలో బిగ్ బాస్, హోస్ట్ నాగార్జున, ప్రేక్షకులు బాగా డిసప్పాయింట్ అయ్యారనే చెప్పుకోవాలి.
#image_title
తను ఎలిమనేట్ అయింది అని నాగార్జున చెప్పినప్పుడు రతిక నమ్మలేకపోయింది. తనను ఎలిమినేట్ చేయడం ఏంటి అనుకుంది. ఒకవేళ తనను సీక్రెట్ రూమ్ కు పంపిస్తారేమో అనుకుంది. కానీ.. ఈ సీజన్ ఉల్టా పుల్టా.. ఎప్పుడు ఏం జరిగేది ఎవ్వరికీ తెలియదు కదా. తను అనుకున్నట్టు జరగదు కదా. తనను సీక్రెట్ రూమ్ కు పంపించలేదు.. మరే రూమ్ కి పంపించలేదు. తనను నేరుగా ఎలిమినేట్ చేసి ఇంటికి పంపించేశాడు బిగ్ బాస్. దీంతో తనకు ఏం చేయాలో అర్థం కాలేదు. నాలుగో వారమే రతిక ఎలిమినేట్ అవుతుందని ఎవ్వరూ ఊహించలేకపోయింది. తేజ ఎలిమినేట్ కావాల్సి ఉన్నా.. తేజకు ఓట్లేసి గెలిపించి చివరకు రతికను ఓడించారు. ఇంటికి పంపించేశారు. బిగ్ బాస్ జర్నీ నీకు పెద్ద లెస్సన్ అని నాగార్జున కూడా రతికకు చెప్పారంటే తను బిగ్ బాస్ హౌస్ లో ఎలా ప్రవర్తించిందో అర్థం చేసుకోవచ్చు.
Thammudu Movie Review : తెలుగులో ప్రముఖ సినీ నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై ప్రముఖ నిర్మాత…
Dil Raju : ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మించన తమ్ముడు జూలై 4న విడుదల కానుంది. ఈ మూవీ…
Jio Recharge : జియో వినియోగదారుల కోసం అద్భుతమైన ఐడియల్ రీఛార్జ్ ప్లాన్ల ను ప్రకటించింది. ప్రస్తుతం, చాలా మంది…
Komatireddy Venkat Reddy : హరీష్ రావు ఎవరో తెలియదంటూ మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు…
Chandrababu : తెలుగు రాష్ట్రాల్లో నది నీటి ప్రాజెక్టులపై తాజాగా జరుగుతున్న చర్చలో బనకచర్ల ప్రాజెక్ట్ కీలకంగా మారింది. తెలంగాణ…
Prices : కేంద్ర ప్రభుత్వం గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ (జీఎస్టీ) స్లాబ్‌లలో పెద్ద ఎత్తున మార్పులు చేయాలని యోచిస్తోంది.…
Fish Venkat : తెలుగు చిత్ర పరిశ్రమలో తనదైన హాస్య విలన్ పాత్రలతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటుడు ఫిష్…
Ys Jagan : అసెంబ్లీ ఎన్నికల్లో చిత్తూ చిత్తుగా ఓటమి చవిచూసిన జగన్..ఇప్పుడు పూర్తిస్థాయిలో ప్రజల్లోకి వెళ్లాలని డిసైడ్ అయ్యాడు. ఐదేళ్లలో…
This website uses cookies.