Bigg Boss Telugu 7 : తేజను కాదని రతికను ఎలిమినేట్ చేయడానికి కారణాలు ఇవేనా? రతిక చేసిన తప్పులు ఇవే | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Bigg Boss Telugu 7 : తేజను కాదని రతికను ఎలిమినేట్ చేయడానికి కారణాలు ఇవేనా? రతిక చేసిన తప్పులు ఇవే

 Authored By kranthi | The Telugu News | Updated on :2 October 2023,11:00 am

Bigg Boss Telugu 7 : నిజానికి నాలుగో వారం తేజ ఎలిమినేట్ కావాలి. కానీ.. అలా జరగలేదు. తేజ ఎలిమినేట్ అవుతాడని అంతా ఊహించిందే. కానీ.. రతిక ఎలిమినేట్ అవుతుందని మాత్రం ఎవ్వరూ ఊహించలేకపోయారు. రతిక మూడో వారం వరకు బాగానే ఆడింది. కానీ.. నాలుగో వారంలో మరీ దిగజారిపోయిందనే చెప్పుకోవాలి. నిజానికి రతిక ఆట చూసి ప్రేక్షకులకు కూడా చిరాకు వచ్చేసింది. రతిక హౌస్ లో ఉండి కొందరినే టార్గెట్ చేస్తూ మాట్లాడటం చూసి జనాలకు కూడా నచ్చలేదు. మొదట్నుంచి శివాజీ బ్యాచ్ తో ఉన్న రతిక.. ఒక్కసారిగా స్టార్ మా బ్యాచ్ లో కలిసిపోవడం, రెండు చేతులు కలిస్తేనే చప్పట్లు అని శివాజీ అన్నాడని తెగ బాధపడిపోవడం.. ప్రశాంత్ ను సిగ్గుందా.. అంటూ ఛీప్ గా మాట్లాడటం ఇవన్నీ చూసి జనాలకు చిరాకు వేసింది. అందుకే.. తేజను ఎలిమినేట్ చేయాల్సిన జనాలు.. తేజకు ఓట్లేసి మరీ గెలిపించి చివరకు రతికను ఇంటికి పంపించేశారు.

నిజానికి రతిక విషయంలో బిగ్ బాస్ కి కూడా చిరాకు వచ్చేసింది. ఏ గేమ్ లోనూ తన వంద శాతం పెట్టింది లేదు. కావాలని అందరితో గొడవలు పెట్టుకోవడం, టాస్కులను ముందు వెళ్లకుండా ఆపడం, తనకు నచ్చిందే చేస్తా అనడం, ప్రశాంత్ విషయంలోనూ  అదే జరిగింది. ప్రశాంత్ ను ఛీప్ గా తీసిపారేయడం.. ముందేమో ప్రశాంత్ కు ఆశలు కల్పించి ఇప్పుడు ప్రశాంత్ నే తిరిగి బ్లాక్ మెయిల్ చేయడం.. ఇవన్నీ చూసి జనాలకే కాదు.. బిగ్ బాస్ కే చిరాకు వచ్చేసింది. ఏంటి మరీ ఇంత దారుణంగా రతిక ఇలా మాటలు మారుస్తుంది అని అనుకున్నారు. అంతే కాదు.. ప్రశాంత్ ను వదిలేసి రతిక.. యావర్ వెంట పడటం.. కొన్ని రోజులు ఆ ఇద్దరూ కలిసి తిరగడం, ఒకే ప్లేట్ లో తినడం ఇవన్నీ జరిగాయి. ఏది ఏమైనా రతిక విషయంలో బిగ్ బాస్, హోస్ట్ నాగార్జున, ప్రేక్షకులు బాగా డిసప్పాయింట్ అయ్యారనే చెప్పుకోవాలి.

why rathika eliminated from bigg boss telugu 7

#image_title

Bigg Boss Telugu 7 : సీక్రెట్ రూమ్ కి పంపిస్తారేమో అనుకున్న రతిక

తను ఎలిమనేట్ అయింది అని నాగార్జున చెప్పినప్పుడు రతిక నమ్మలేకపోయింది. తనను ఎలిమినేట్ చేయడం ఏంటి అనుకుంది. ఒకవేళ తనను సీక్రెట్ రూమ్ కు పంపిస్తారేమో అనుకుంది. కానీ.. ఈ సీజన్ ఉల్టా పుల్టా.. ఎప్పుడు ఏం జరిగేది ఎవ్వరికీ తెలియదు కదా. తను అనుకున్నట్టు జరగదు కదా. తనను సీక్రెట్ రూమ్ కు పంపించలేదు.. మరే రూమ్ కి పంపించలేదు. తనను నేరుగా ఎలిమినేట్ చేసి ఇంటికి పంపించేశాడు బిగ్ బాస్. దీంతో తనకు ఏం చేయాలో అర్థం కాలేదు. నాలుగో వారమే రతిక ఎలిమినేట్ అవుతుందని ఎవ్వరూ ఊహించలేకపోయింది. తేజ ఎలిమినేట్ కావాల్సి ఉన్నా.. తేజకు ఓట్లేసి గెలిపించి చివరకు రతికను ఓడించారు. ఇంటికి పంపించేశారు. బిగ్ బాస్ జర్నీ నీకు పెద్ద లెస్సన్ అని నాగార్జున కూడా రతికకు చెప్పారంటే తను బిగ్ బాస్ హౌస్ లో ఎలా ప్రవర్తించిందో అర్థం చేసుకోవచ్చు.

kranthi

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది