Sudigali Sudheer : మల్లెమాల వారితో సుడిగాలి సుధీర్ అగ్రిమెంట్‌ లేదా.. మాటీవీలో కనిపించడం వెనుక కారణం ఏంటో?

Advertisement

Sudigali Sudheer : జబర్దస్త్ కామెడీ షో లో చేసే కమెడియన్స్ మరే ఇతర ఛానల్ లో కూడా కనిపించచడానికి వీలు లేదు అంటూ మల్లెమాల మరియు ఈటీవీ వారు చాలా కఠినమైన అగ్రిమెంటు పెట్టుకుంటారు. అగ్రిమెంట్ బ్రేక్ చేసిన వారు 10 నుండి 25 లక్షల రూపాయల వరకు జరిమానాగా మల్లెమాల వారికి చెల్లించి వెళ్లాల్సి ఉంటుంది. ఆ మధ్య ముక్కు అవినాష్ బిగ్ బాస్ లో పాల్గొనేందుకు ఏకంగా 15 లక్షల రూపాయలను వారికి సమర్పించాడు అనే వార్తలు వచ్చాయి. మల్లెమాల వారు ఈ విషయంలో చాలా కఠినంగా ఉంటారని టాక్‌ ఉంది.పెద్ద ఎత్తున షో నుండి వలసలు ఉండకూడదు అనే ఉద్దేశంతో వారు ఈ నిర్ణయం తీసుకున్నారు. కమెడియన్స్‌ కాస్త ఫేమ్ రాగానే బయటకు వెళ్ళి పోకుండా మల్లెమాల వారు తీసుకున్న నిర్ణయం మంచిదే.

Advertisement

కానీ ప్రతిభను తొక్కేసే విధంగా ఈ విధానం ఉంటుంది అనేది కొందరి అభిప్రాయం. తాజాగా సుడిగాలి సుదీర్ స్టార్ మా హోలీ కార్యక్రమంలో కనిపించాడు. కేవలం సుదీర్ మాత్రమే కాకుండా యాంకర్ రష్మి కూడా ఈ షో లో సందడి చేసింది. ఎక్కువగా ఈటీవీ లో మాత్రమే కనిపించే సుదీర్ స్టార్ మా లో కనిపించడంతో అంతా కూడా షాక్ అయ్యారు.ఇటీవలే ఢీ డాన్స్ షో నుండి బయటకు వచ్చేసిన సుధీర్ త్వరలో జబర్దస్త్ నుండి కూడా బయటకు వస్తాడు అనే టాక్ వినిపిస్తోంది. ఈ సమయంలో స్టార్ మా లో సుదీర్ కనిపించడంతో ప్రతి ఒక్కరు కూడా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. మల్లెమాల వారితో సుదీర్ అగ్రిమెంట్ లో ఉన్నా కూడా ఎలా స్టార్ మా లోని ఆ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం దక్కింది అనేది కొందరి అభిప్రాయం.

Advertisement
why sudigali sudheer in star maa tv show
why sudigali sudheer in star maa tv show

అసలు మల్లెమాల వారితో సుదీర్ అగ్రిమెంట్ కొనసాగుతుందా అనేది మరి కొందరి అనుమానం.ఇక్కడ చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే జబర్దస్త్ కామెడీ షో చేస్తున్న వారు ఇతర చానల్స్ నిర్వహించిన అదే తరహా కామెడీ షో చెయ్యడానికి వీలు లేదు. కానీ వేరే ఛానల్ లో వేరే కార్యక్రమాల్లో కనిపించిన పర్వాలేదు. అది అగ్రిమెంట్లు క్లియర్ గా ఉంటుంది. కనుక మల్లెమాల వారితో సుధీర్‌ కి బాగానే ఉంది.. అలాగే స్టార్ మా లో జబర్దస్త్ కామెడీ తరహా షో కాదు కనుక హోలీ స్పెషల్ ఎపిసోడ్ లో సుదీర్ సందడి చేశాడు. ఈటీవీని వదిలేది లేదు అంటూ సుధీర్ పలు సందర్బాల్లో చెప్పుకొచ్చాడు.

Advertisement
Advertisement