Balakrishna : వామ్మో.. అఖండ మూవీలో విగ్‌ల‌కు ఇన్ని ల‌క్ష‌లు ఖ‌ర్చా..? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Balakrishna : వామ్మో.. అఖండ మూవీలో విగ్‌ల‌కు ఇన్ని ల‌క్ష‌లు ఖ‌ర్చా..?

 Authored By mallesh | The Telugu News | Updated on :9 December 2021,6:20 pm

Balakrishna : డైరెక్టర్ బోయపాటి శ్రీను, నటసింహం నందమూరి బాలకృష్ణ కాంబినేషన్ లో వచ్చిన అఖండ మూవీ మంచి విజయాన్ని అందుకుంది. వీరిద్దరి కాంబినేషన్‌లో ఇది హైట్రిక్. గతంలో వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన సింహా, లెజెండ్ మూవీస్ ఎంతటి విజయం సాధించాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇక అఖండ కలెక్షన్స్ సునామీ సృష్టిస్తోంది. అయితే బాలకృష్ణ త‌న మూవీస్‌తో బయటి ప్రోగ్రామ్స్ లోనూ ఎక్కువగా విగ్ తోనే కనిపిస్తుంటారు. ఒక్కో మూవీలో ఆయన విగ్ ఒక్కోలా ఉంటుంది.

కొన్ని మూవీస్‌లో ఆయన హెయిర్ స్టైల్ బాగుంటుంది కానీ, కొన్నింటిలో ఆయ‌న న‌చ్చడం లేదంటూ చాలా మంత్రి ట్రోల్స్ సైతం చేసిన సందర్భాలున్నాయి. తాజాగా రిలీజ్ అయిన అఖండ మూవీలో బాల‌కృష్ణ డ్యూయల్ రోల్ చేశారు. అందులో ఒక పాత్ర అఖండ కాగా, మరొకటి మురళికృష్ణ పాత్ర. ఈ పాత్రల్లో అఖండ రోల్ కు హెయిర్ స్టైల్‌తో పనిలేదు. కానీ మురళికృష్ణ క్యారెక్టర్‌కు హెయిర్ స్టైల్ తప్పనిసరి.మురళికృష్ణ పాత్ర కోసం ఆకట్టుకునే హెయిర్ స్టైల్ ఉండాలని రూ.13 లక్షలు వ్యచ్చించి బోయపాటి ఓ విగ్గు చేయించారట. మూవీలో మొత్తంగా మూడు విగ్గులు యూజ్ చేశారు.

wigs cost more in akanda movie

wigs-cost-more-in-akanda-movie

Balakrishna : సుమారు రూ.50 లక్షలు

ఇందుకు దాదాపుగా రూ.40 లక్షల వరకు ఖర్చయిందని టాక్. అంతే కాకుండా వాటి మెయింటనెన్స్ కోసం ఇంకో రూ.10 లక్షలు ఖర్చు చేశారట. అంతే మరీ.. చిన్న చిన్న విషయాల్లో కాంప్రమైజ్ కాకపోవడంతోనే అఖండ మూవీ అంతటి హిట్ సాధించింది. ప్రస్తుతం ఎక్కడ చూసిన బాలయ్య గురించే చర్చ జరుగుతుండటం విశేషం. అందులోని స్పెషల్ గా ఆయన విగ్ గురించే మాట్లాడుకుంటున్నారు. ఇక అఖండ మరెన్ని రికార్డులు క్రియేట్ చేస్తుందో వేచి చూడాలి. ఇదిలా ఉండగా అఖండ సిక్వెల్ ను సైతం బోయపాటి ప్లాన్ చేస్తున్నట్టు టాక్.

Advertisement
WhatsApp Group Join Now

mallesh

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది