
will akhil commit suicide in janaki kalaganaledu
Janaki Kalaganaledu : జానకి కలగనలేదు సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ ఈరోజు ప్రసారం కాదు. తిరిగి సోమవారం ప్రసారం అవుతుంది. 19 సెప్టెంబర్ 2022, సోమవారం ఎపిసోడ్ 391 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. జానకి పరీక్ష రాయడానికి వెళ్లగానే ఇంతలో జానకికి ఫోన్ వస్తుంది. జెస్సీ తల్లిదండ్రులు ఫోన్ చేసి తనను సూసైడ్ కు యత్నించినట్టు చెబుతారు. దీంతో వెంటనే పరీక్ష రాయకుండా అక్కడి నుంచి వెళ్లిపోతుంది జానకి. వెంటనే జెస్సీ ఇంటికి వెళ్తుంది. ఎందుకు ఇలా చేస్తున్నావు. నేను నీకు మాటిస్తున్నాను. అఖిల్ తో నీ పెళ్లి జరుగుతుంది. జరిగి తీరుతుంది అని భరోసా ఇచ్చి ఇంకోసారి ఇలాంటి పని చేయొద్దు అని తన నుంచి మాట తీసుకుంటుంది జానకి. తన తల్లిదండ్రులకు కూడా ధైర్యం చెబుతుంది జానకి.
will akhil commit suicide in janaki kalaganaledu
కట్ చేస్తే జ్ఞానాంబ, గోవిందరాజు జెస్సీ, అఖిల్ విషయం గురించే ఆలోచిస్తూ ఉంటారు. ఇంతలో జ్ఞానాంబకు కాలేజీ ప్రిన్సిపల్ నుంచి ఫోన్ వస్తుంది. జానకి పరీక్ష రాయలేదని చెబుతుంది. దీంతో జ్ఞానాంబ షాక్ అవుతుంది. మీకు ఏమైనా ఎమర్జెన్సీ ఉందా.. ఎందుకు జానకి పరీక్ష రాయకుండా వెళ్లింది అని అడుగుతుంది. ఒకవేళ ఏదైనా పర్సనల్ ప్రాబ్లమ్ ఉందేమో అని అడుగుతుంది ప్రిన్సిపల్. దీంతో నేను కనుక్కుంటాను అంటుంది జ్ఞానాంబ. రామాను పిలిచి జానకి పరీక్ష రాయలేదట అని నిలదీస్తుంది. దీంతో రామాకు ఏం చేయాలో అర్థం కాదు.
ఇంతలో జానకి వస్తుంది. ఏమైంది జానకి.. పరీక్ష రాశావా అని అడుగుతుంది జ్ఞానాంబ. దీంతో రాయలేదు అని చెబుతుంది. ఎందుకు అని అడగగా.. జెస్సీ ఆత్మహత్యకు యత్నించింది అని చెబుతుంది జానకి. దీంతో జ్ఞానాంబ షాక్ అవుతుంది. అఖిల్ కూడా ఈ విషయం విని షాక్ అవుతాడు.
తన పేరెంట్స్ సరిగ్గా ఎగ్జామ్ మొదలయ్యే ముందు ఫోన్ చేస్తే కాపాడుదామని వెళ్లా. కడుపుతో ఉన్న మహిళకు ఏదైనా జరగరానిది జరిగితే మన కుటుంబానికి ఎంత అవమానం. అందుకే వెళ్లాను అత్తయ్య గారు అని చెబుతుంది జానకి. ఇప్పుడు ప్రమాదం ఏం లేదు. బాగానే ఉంది అంటుంది జానకి.
నీ చదువుకు, ఈ ఇంటి బాధ్యతలకు ఆటంకాలు కలగకుండా నిన్ను నిజాలు నిరూపించే ప్రయత్నం చేయమన్నాను కానీ.. పరీక్షలు ఆపి కాదు. ఇంకోసారి ఇలా జరిగితే నేను ఊరుకోను అని జానకికి జ్ఞానాంబ సీరియస్ వార్నింగ్ ఇచ్చి అక్కడి నుంచి వెళ్లిపోతుంది.
మరోవైపు రామా.. అఖిల్ తో పర్సనల్ గా మాట్లాడుతాడు. నేను నిజమే చెబుతున్నాను అన్నయ్య అంటాడు అఖిల్. నేను అమ్మ మీద కూడా ఒట్టేశాను కదా అంటాడు అఖిల్. నువ్వు ఊరుకుంటే మాటను దాటేయగలవు కానీ.. భయపడినంత మాత్రాన నిజాన్ని సమాధి చేయలేవు అంటాడు రామా.
నువ్వు నిజంగా తప్పు చేస్తే అమ్మకు ఎంత భయపడతావో నాకు తెలుసు. నేను నిన్ను చిన్నప్పటి నుంచి చూస్తున్నా. ఆ భయంతోనే జెస్సీని కడుపు తీసుకో అని చెప్పి ఉంటావు. నన్ను నమ్ము అంటాడు రామా. కానీ.. అఖిల్ మాత్రం వినడు. ఎందుకు నువ్వ, వదిన కలిసి నన్ను నిజం ఒప్పుకోమంటున్నారు అని అడుగుతాడు అఖిల్.
రామా గుచ్చి గుచ్చి అడుగుతుండటంతో కోపం వచ్చి లోపలికి వెళ్లి విషం బాటిల్ ను తీసుకుంటాడు. దాని మూత తీసి తాగబోతాడు. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.
Onion Black Streaks : ఏ కూర వండినా ఉల్లిగడ్డ అనేది కీలకం. ఉల్లిగడ్డ లేకుండా ఏ కూర వండలేం.…
Jaggery Vs Sugar : మనిషి నాలుకకు టేస్ట్ దొరికితే చాలు.. అది ఆరోగ్యానికి మంచిదా? చెడ్డదా? అనే ఆలోచనే…
Benefits of Eating Fish : చాలామందికి ఫిష్ అంటే పడదు. చికెన్, మటన్ అంటే లొట్టలేసుకుంటూ లాగించేస్తారు కానీ..…
Egg vs Paneer : ఎగ్ అంటే ఇష్టం లేని వాళ్లు ఉండరు. కానీ నాన్ వెజిటేరియన్లు మాత్రమే ఎగ్…
Snoring Health Issues : చాలామంది నిద్రపోయేటప్పుడు గురక పెడుతూ ఉంటారు. గురక పెట్టేవాళ్లకు వాళ్లు గురక పెడుతున్నట్టు తెలియదు.…
Ghee Coffee or Bullet Coffee : కాఫీ అంటే అందరికీ తెలుసు కానీ ఈ బుల్లెట్ కాఫీ ఏంటి…
Swallow Bubble Gum : టైమ్ పాస్ కోసం చాలామంది నోట్లో ఎప్పుడూ బబుల్ గమ్ ను నములుతూ ఉంటారు.…
Garlic Health Benefits : వెల్లుల్లి అనగానే చాలామందికి నచ్చదు. ఎందుకంటే అది చాలా ఘాటుగా ఉంటుంది. కూరల్లో వేసినా…
This website uses cookies.