Home » Entertainment » Will Akhil Tell The Truth About Janaki Ips In Janaki Kalaganaledu
Entertainment

Janaki Kalaganaledu : జానకి అసైన్ మెంట్ చదివి అఖిల్ షాక్.. జ్ఞానాంబకు జానకి చదవు విషయం తెలిసి ఏం చేస్తుంది? మళ్లీ ఇంట్లో ప్రకంపనలు

Authored By
Varun G
The Telugu News | Published on: July 2, 2022, 11:30 am
Advertisement

Janaki Kalaganaledu : జానకి కలగనలేదు సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ ఈరోజు ప్రసారం కాదు. తిరిగి సోమవారం ప్రసారం అవుతుంది. 4 జులై 2022, సోమవారం ఎపిసోడ్ 336 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. జానకి తన అసైన్ మెంట్ ను పూర్తి చేయడం కోసం రాత్రి మొత్తం నిద్రపోకుండా మేల్కొని ఉంటుంది. రాత్రి సగం అసైన్ మెంట్ పూర్తి చేస్తుంది. ఇంతలో రామా తనకు టీ తెచ్చి ఇస్తాడు. ఆ తర్వాత కాసేపు తను అసైన్ మెంట్ రాసి అలాగే నిద్రపోతుంది. రామా కూడా అక్కడే మంచం మీద కూర్చొని నిద్రపోతాడు. కట్ చేస్తే తెల్లవారుతుంది. రామా నిద్రలేచి.. జానకిని పడుకోబెడతాడు. ఆ తర్వాత చాలా ఆలస్యంగా నిద్ర లేస్తుంది జానకి. వెంటనే నిద్రలేచి.. నన్ను ఎందుకు లేపలేదు అని రామాతో గొడవపెట్టుకుంటుంది జానకి.

Advertisement

will akhil tell the truth about janaki ips in janaki kalaganaledu

దీంతో రాత్రంతా రాశారు కదా. ఇప్పుడు ఎందుకు టెన్షన్ పడుతున్నారు. మీరు నిన్న బాగా అలసిపోయారు. రాత్రి నిద్ర లేదు. అందుకే మీకు రెస్ట్ కావాలని నేనే లేపలేదు అంటాడు రామా. దీంతో జానకికి కోపం వస్తుంది. ఇప్పుడు ఎలా.. నా అసైన్ మెంట్ సగమే పూర్తయింది అని టెన్షన్ పడుతుంది. దీంతో మీరేం కంగారు పడకండి. నేను స్వీట్లు ఇచ్చి వస్తాను. అంతలో మీరు అసైన్ మెంట్ పూర్తి చేయండి. ఆ తర్వాత ఇద్దరం కలిసి వాటిని కోచింగ్ సెంటర్ లో ఇచ్చి వద్దాం అంటాడు రామా. ఇంతలో మల్లిక, విష్ణు కలిసి స్వీట్ల డబ్బాను కారులో పెడతారు. జానకి ఎదురు వస్తుంది. దీంతో రామా కారులో స్వీట్ల ఆర్డర్ ఇవ్వడానికి వెళ్తాడు.

Advertisement

మరోవైపు తన రూమ్ లో కూర్చొని అసైన్ మెంట్ పూర్తి చేస్తూ ఉంటుంది జానకి. అసైన్ మెంట్ పూర్తి చేసి ఆ పేపర్లను అక్కడే పెట్టి రెడీ అయ్యేందుకు బయటికి వెళ్తుంది జానకి. మరోవైపు ఇంట్లో ఉన్న పాత పేపర్లను అమ్ముతూ ఉంటుంది మల్లిక. కొన్ని తక్కువయ్యాయి. ఇంట్లో ఇంకా ఏవైనా ఉంటే తీసుకురండి అని అడుగుతాడు పేపర్లు కొనే వ్యక్తి.

Janaki Kalaganaledu : జానకి అసైన్ మెంట్ పేపర్లను పేపర్లు కొనే వ్యక్తికి ఇవ్వబోయిన మల్లిక

దీంతో ఇంట్లోకి వెళ్లి పాత పేపర్లను వెతుకుతుంటుంది. జానకి రూమ్ లో పాత పేపర్లు ఉన్నాయేమో అని వెతకడం కోసం వెళ్తుంది మల్లిక. అక్కడ తనకు జానకి అప్పుడే రాసిపెట్టిన అసైన్ మెంట్ పేపర్లు కనిపిస్తాయి. వాటిని చూసి ఏవో పాత పేపర్లు అనుకొని వాటిని తీసుకొని బయటికి వస్తుంది.

Advertisement

అప్పుడే జ్ఞానాంబ చూసి ఏంటి అవి అని మల్లికను అడుగుతుంది. దీంతో పాత పేపర్లు అంటుంది మల్లిక. దీంతో అఖిల్ ను పిలిచి.. ఆ పేపర్లు ఏవో ముఖ్యమైనవిగా కనిపిస్తున్నాయి. ఏంటి అవి చూడు అని అడుగుతుంది. దీంతో అఖిల్ వాటిని చూస్తాడు. చూసి షాక్ అవుతాడు. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.

Varun G

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి