Intinti Gruhalakshmi : తులసిని పెళ్లి చేసుకోవడానికి సామ్రాట్ రెడీ కానీ.. తులసి నిర్ణయం ఏంటి? తన అత్తామామ ఒప్పుకుంటారా?

Intinti Gruhalakshmi : ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ ఈరోజు ప్రసారం కాదు. తిరిగి సోమవారం ప్రసారం అవుతుంది. 29 ఆగస్టు 2022, సోమవారం ఎపిసోడ్ 723 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. అభి, తులసి విషయం గురించి శృతి, ప్రేమ్ మాట్లాడుకుంటారు. అభికి అమ్మ మీద అంత కోపం ఎందుకో అర్థం కావడం లేదు అంటాడు ప్రేమ్. దీంతో ఈ ఇంట్లో మగవాళ్లకు ఆడవాళ్ల మీద అరవడం మామూలే కదా అంటుంది. దీంతో వాళ్ల గొడవ కాస్త వీళ్ల మీదికి మళ్లుతుంది. ఇద్దరూ గొడవ పెట్టుకుంటారు. ఈ ఇంట్లో నీవల్ల నేను ఉండటం లేదు. తులసి ఆంటి వల్ల ఉంటున్నాను. వద్దంటే చెప్పు.. ఇప్పుడే వెళ్లిపోతాను అంటుంది శృతి. దీంతో వద్దులేమ్మా నీతో గొడవెందుకు అని ఏం మాట్లాడుకుండా కింద పడుకుంటాడు ప్రేమ్. మరోవైపు సామ్రాట్.. తులసి గురించి హనీ గురించే ఆలోచిస్తూ ఉంటాడు. బాబాయి కూడా తులసి లాంటి అమ్మాయి దొరికితే పెళ్లి చేసుకుంటావా అంటే ఆలోచనలో పడిపోతాడు సామ్రాట్.

will bhoomi pooja conducted for tulasi music school in intinti gruhalakshmi

తర్వాత హనీని నిద్రలేపుతాడు. ఈరోజు పూజ ఉంది అని అంటాడు. దీంతో తులసి ఆంటి చెప్పింది. నేను ఏ డ్రెస్ వేసుకోవాలో కూడా ఆంటీనే సెలెక్ట్ చేసి చెప్పింది అంటుంది. దీంతో సరే పదా రెడీ అవుదాం అని చెప్పి హనీని రెడీ చేస్తాడు సామ్రాట్. తర్వాత తను ఏ డ్రెస్ వేసుకోవాలి అని ఆలోచిస్తుండగా ఏం ఆలోచిస్తున్నావు.. ఈ డ్రెస్ వేసుకో అంటుంది హనీ. ఆ తర్వాత అందరూ టిఫిన్ చేసి బిల్డింగ్ ప్లాన్ తీసుకురమ్మని నందుకు చెప్పండి అని చెబుతాడు సామ్రాట్. మరోవైపు భూమి పూజలో ఎటువంటి విఘ్నాలు కలగకూడదని తులసి.. తులసికోటను మొక్కుకుంటుంది. ఇవన్నీ పైనుంచి అభి చూస్తుంటాడు. ఇంతలో తనకు లాస్య ఫోన్ చేస్తుంది. తులసి ఏం చేస్తోంది అని అడుగుతుంది. ఈరోజు ఎలాగైనా భూమి పూజ ఆగిపోవాలి అని చెబుతుంది. నువ్వు ఈ పని చేయి అని ఒక ప్లాన్ చెబుతుంది లాస్య.

దీంతో సరే అంటాడు అభి. కానీ.. సామ్రాట్ కు.. అమ్మ, నాన్న రిలేషన్ గురించి తెలియకూడదు కదా అంటాడు అభి. ఏం కాదు.. ఆ రిలేషన్ షిప్ గురించి సామ్రాట్ కు తెలియదు. నువ్వేం టెన్షన్ పడకు అని చెప్పి అభికి ధైర్యం చెబుతుంది లాస్య. దీంతో సరే అంటాడు అభి.

Intinti Gruhalakshmi : పూజకు బయలుదేరిన సామ్రాట్, హనీ

మరోవైపు పూజ కోసం హనీతో పాటు సామ్రాట్, బాబాయి ఇద్దరూ వెళ్తారు. అక్కడ తులసి కోసం సామ్రాట్ ఎదురు చూస్తాడు. ఇంతలో తులసి, ప్రేమ్, పరందామయ్య, అనసూయ, దివ్య, శృతి అందరూ పూజ కోసం వస్తారు. అక్కడ తులసిని చూసిన హనీ తన దగ్గరికి వెళ్తుంది.

దీంతో తనను ఎత్తుకుంటుంది తులసి. నీ డ్రెస్ చాలా బాగుంది అని చెబుతుంది తులసి. థాంక్యూ ఆంటి అంటుంది హనీ. నాన్నకు పింక్, బ్లూ అంటే చాలా ఇష్టం. నేను పింక్ వేసుకున్నాను. మీరు బ్లూ వేసుకున్నారు. నాన్న చాలా హ్యాపీ.. అంటుంది హనీ.

ఇంతలో నందు, లాస్య వస్తారు. సారీ అండి కొంచెం లేట్ అయింది అంటుంది తులసి. దీంతో పర్వాలేదు అంటాడు సామ్రాట్. దీంతో అదే కదా ఎదురు చూపుల్లో ఉన్న మజా అంటుంది లాస్య. దీంతో అందరూ విచిత్రంగా తనవైపు చూస్తారు. ఈరోజు ఫంక్షన్ కు మీరు గెస్ట్ కాదు.. హోస్ట్. మీరు ఆలస్యంగా వస్తే సామ్రాట్ గారు టెన్షన్ పడతారు అంటుంది లాస్య.

ఇంతలో టాపిక్ మార్చి.. భూమి పూజ ఏర్పాట్లు అదిరిపోయాయి. తులసి మేడమ్, మీరు పార్టనర్ గా చేస్తున్న ఈ పూజకు ఈ లేవల్ లో ఏర్పాట్లు చేస్తున్నారంటే ఇక మీ పెళ్లికి ఏ రేంజ్ లో అరేంజ్ మెంట్స్ ఉంటాయో అంటుంది లాస్య. దీంతో అందరూ షాక్ అవుతారు.

అదేంటి అందరూ అంత షాక్ గా చూస్తున్నారు. నేనేమన్నా తప్పుగా మాట్లాడానా? సామ్రాట్ గారికి సంబంధాలు చేస్తున్నారు కదా. ఏదైనా మంచి సంబంధం కుదిరితే పెళ్లి చేస్తారు కదా అంటున్నాను అంటుంది లాస్య. మరోవైపు తులసి తమ్ముడు భూమి పూజకు వస్తాడు.

తన బావను ఇష్టం ఉన్నట్టు తిడతాడు. మా అక్క నా కళ్ల ముందే నరకయాతన పడుతుంటే ఏం చేయలేక చేతులు ముడుచుకు కూర్చొన్నాను అంటాడు. ఈ సమయంలో చేదు మెమోరీస్ అవసరమా అంటుంది తులసి. దీంతో వాటిని నువ్వు మరిచిపోయావేమో కానీ.. నేను మరిచిపోలేదు అక్క అంటాడు. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.

Recent Posts

Monsoon Season : వర్షాకాలంలో ఆకుకూరలు తినకూడదా..? అపోహలు, వాస్తవాలు ఇవే..!

Monsoon Season : వర్షాకాలం రాగానే మన పెద్దలు తరచూ ఒక హెచ్చరిక ఇస్తుంటారు – "ఇప్పుడు ఆకుకూరలు తినొద్దు!"…

2 minutes ago

Shoes : ఈ విష‌యం మీకు తెలుసా.. చెప్పులు లేదా షూస్ పోతే పోలీసుల‌కి ఫిర్యాదు చేయాలా?

Shoes : ఈ రోజుల్లో చాలా మంది తమ వస్తువులు పోయినా పెద్దగా పట్టించుకోరు. ముఖ్యంగా చెప్పులు, బూట్లు వంటి…

1 hour ago

Vitamin B12 : చేతులు, కాళ్లలో తిమ్మిరిగా అనిపిస్తుందా? జాగ్రత్త! ఇది విటమిన్ B12 లోపానికి సంకేతం కావచ్చు

Vitamin B12 : మీ చేతులు లేదా కాళ్లు అకస్మాత్తుగా తిమ్మిరిగా మారినట్లు అనిపిస్తోందా? నిదానంగా జలదరింపుగా ఉండి, ఆ…

2 hours ago

OTT : ఇండిపెండెన్స్ డే స్పెష‌ల్‌ OTT లో ‘J.S.K – జానకి V v/s స్టేట్ ఆఫ్ కేరళ’ స్ట్రీమింగ్..!

OTT : J.S.K - Janaki V v/s State of Kerala : భారతదేశంలోని అతిపెద్ద స్వదేశీ OTT…

10 hours ago

Bakasura Restaurant Movie : యమలీల, ఘటోత్కచుడులా తరహాలొ మా మూవీ బకాసుర రెస్టారెంట్ ఉంటుంది : ఎస్‌జే శివ

Bakasura Restaurant Movie  : ''బకాసుర రెస్టారెంట్‌' అనేది ఇదొక కొత్తజానర్‌తో పాటు కమర్షియల్‌ ఎక్స్‌పర్‌మెంట్‌. ఇంతకు ముందు వచ్చిన…

11 hours ago

V Prakash : జగదీష్ రెడ్డి కేసీఆర్ గారితో ఉద్యమంలో ఉన్న‌ప్పుడు క‌విత నువ్వు ఎక్క‌డ ఉన్నావ్‌.. వి ప్రకాష్

V Prakash  : బీఆర్ఎస్ పార్టీలో అంతర్గత విభేదాలు బయటపడ్డాయి. ఆ పార్టీ నేత, మాజీ ఎంపీ వి.ప్రకాష్, జగదీష్…

12 hours ago

Tribanadhari Barbarik Movie : చిరంజీవి గారి పుట్టిన రోజు సందర్భంగా త్రిబాణధారి బార్బరిక్ మూవీ విడుద‌ల‌

Tribanadhari Barbarik Movie : స్టార్ డైరెక్టర్ మారుతి సమర్పణలో వానర సెల్యూలాయిడ్ బ్యానర్ మీద విజయ్ పాల్ రెడ్డి అడిదెల…

12 hours ago

Ys Jagan : చంద్రబాబు పాలనలో కలియుగ రాజకీయాలు చూస్తున్నాం : వైఎస్‌ జగన్

Ys Jagan : రాష్ట్రంలో ప్రస్తుత రాజకీయ పరిస్థితులు ఆందోళన కలిగిస్తున్నాయని, అధికార దుర్వినియోగం తీవ్రంగా జరుగుతోందని వైఎస్‌ఆర్ కాంగ్రెస్…

13 hours ago