
will janaki take back the police compliant against akhil
Janaki Kalaganaledu : జానకి కలగనలేదు సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ ఈరోజు ప్రసారం కాదు. తిరిగి సోమవారం ప్రసారం అవుతుంది. జానకి కలగనలేదు సీరియల్ ఎపిసోడ్ 431, 14 నవంబర్ 2022 సోమవారం ఎపిసోడ్ హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. మేము ఎలాగైనా బతికేస్తాం. విష్ణు, మల్లికలకు షాపు ఉంది. మరి నీకు ఏముంది. సంపాదించి చూపించు అంటూ నా మీద విపరీతమైన ఒత్తిడి తీసుకొచ్చింది అంటూ అఖిల్.. రామాతో చెప్పడం గురించే ఆలోచిస్తూ ఉంటాడు రామా. ఇంతలో జ్ఞానాంబ కళ్లు తిరిగి కింద పడిపోతుంది. దీంతో నిన్నటి ఏం తినలేదని చెబుతాడు రామా. ఇలా తిండి తినకుండా ఉంటే నీ ఆరోగ్యం పాడవుతుంది.. అంటాడు గోవిందరాజు. దీంతో నేను ఇప్పుడు నీళ్లు తాగి, తిండి తిని ఏం ఉద్దరించాలి. నా కొడుకు విషయంలో నా కన్నీళ్లు నన్నే ప్రశ్నిస్తున్నాయి. నా కొడుకు పోలీస్ స్టేషన్ లో ఉంటే నాకు ముద్ద ఎలా దిగుతుంది అంటుంది జ్ఞానాంబ.
will janaki take back the police compliant against akhil
దీంతో వెంటనే జానకి దగ్గరికి వెళ్లి తనతో మాట్లాడుతాడు రమా. ఎలాగైనా అఖిల్ ను విడిపించండి. పదండి.. కేసు వాపసు తీసుకుందాం అని అంటాడు రామా. కానీ.. జానకి అస్సలు వినదు. అఖిల్ విషయంలో నేను న్యాయంగా ఉంటే కోడలుగా ఆ ధర్మాన్ని వదులుకోవాల్సి వస్తుంది అనుకుంటుంది. కోడలుగా ధర్మాన్ని పాటిస్తే.. న్యాయాన్ని వదిలేయాల్సి వస్తుంది అని అనుకుంటుంది. చివరకు జానకి చేయి పట్టుకొని బయటికి తీసుకెళ్లబోతాడు రామా. కానీ.. జానకి మాత్రం చేయి వదలండి. నేను కేసు మాత్రం అస్సలు వావస్ తీసుకోను అంటంది. అలా చేస్తే అఖిల్ ఇంకా తప్పుల మీద తప్పులు చేస్తాడు అంటుంది.
ఇంతలో అందరూ వస్తాడు అక్కడికి. నా నిర్ణయాన్ని నేను మార్చుకోలేను అంటుంది జానకి. ఇంతలో జానకి గురించి చెడుగా మాట్లాడుతుంది మల్లిక. పెద్ద కోడలుగా బాధ్యత ఇచ్చి నెత్తిన పెట్టుకున్నారు. తనను వెంటపడి మరీ చదివిస్తున్నారు అంటుంది.
తనేమో కాబోయే పోలీస్ ఆఫీసర్ గా ప్రవర్తించి అఖిల్ మీద కేసు పెట్టి అరెస్ట్ చేయించింది అంటుంది మల్లిక. ఆవిడ గారు ఏ తప్పు చేసినా వెనకేసుకొచ్చి గుండెల మీద పెట్టుకున్నారు కదా అంటుంది మల్లిక.
జానకితో కాదు కానీ.. ఎలాగైనా మనం వెళ్లి అఖిల్ ను విడిపించుకుందాం పదరా విష్ణు స్టేషన్ కు వెళ్దాం అంటాడు రామా. దీంతో అందరూ వస్తాం అంటారు. దీంతో జ్ఞానాంబ, గోవిందరాజుతో సహా అందరూ స్టేషన్ కు వెళ్తారు.
కానీ.. అప్పటికే ఎస్ఐ ఎఫ్ఐఆర్ ఫైల్ చేశాం అంటాడు. ఇప్పుడు ఏదైనా కోర్టులో తేల్చుకోవాల్సిందే అంటాడు ఇన్ స్పెక్టర్. అలా అనకండి సార్.. నా తమ్ముడు కోర్టుకు వెళ్లకూడదు. నేరస్థుడిలా బోనులో నిలబడకూడదు.. అంటాడు రామా.
కానీ.. ఎస్ఐ మాత్రం నేను ఏం చేయలేను అంటాడు. తర్వాత అఖిల్ తో మాట్లాడేందుకు వెళ్తారు. నేను ఎవ్వరికీ హాని తలపెట్టలేదు. ఒక ఆడపిల్లకు హాని తలపెట్టేంత మూర్ఖుడిని కాదమ్మా నేను అంటాడు అఖిల్.
మరోవైపు జానకితో మాట్లాడిన మల్లిక.. ఈ ఇంటి పెద్ద కోడలు స్థానాన్ని అడ్డు పెట్టుకొని అత్తయ్య గారి మెప్పు పొంది నా బతుకును మున్సిపాలిటీ కుప్పదొడ్డి చేశావు కదా ఇన్నాళ్లు. బావ గారికి నీ మీద ఉన్న ఇష్టాన్ని నువ్వే ఔట్ చేసుకున్నావు అంటుంది మల్లిక.
దీంతో నీ ఫేక్ ప్రెగ్నెన్సీ ముందు పెట్టేలోపు అఖిల్ సమస్య ముందుకొచ్చిందని అంటుంది జానకి. అది అయిపోగానే నెక్స్ట్ నువ్వే. సిక్స్.. కొడితే స్టేడియం అవతల పడతావు అని మల్లికకు వార్నింగ్ ఇస్తుంది జానకి. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.
Cancer Tips | నేటి వేగవంతమైన జీవనశైలి, ఆహారపు అలవాట్లు, ఒత్తిడి వంటి కారణాల వల్ల క్యాన్సర్, గుండెపోటు, స్ట్రోక్…
Montha Cyclone Effect | ఏపీలో ‘మొంథా’ తుఫాన్ ప్రభావం తీవ్రంగా కనిపిస్తోంది. వాతావరణ శాఖ హెచ్చరికలతో రాష్ట్రవ్యాప్తంగా టెన్షన్…
Dry Eyes | ఈ రోజుల్లో “కళ్ళు పొడిబారడం” (Dry Eyes) సమస్య ఎంతో సాధారణమైపోయింది. మొబైల్, ల్యాప్‌టాప్ లేదా…
Lemon Seeds | నిమ్మరసం తీసిన తర్వాత గింజలు చేదుగా ఉంటాయని చాలా మంది వాటిని పారేస్తారు. కానీ ఆరోగ్య…
Lemons | మూడు బాటల దగ్గర నడవకూడదు, రోడ్డుపై వేసిన నిమ్మకాయలు, మిరపకాయలు తొక్కకూడదు, పసుపు–కుంకుమ కలిపిన వస్తువులపై దాటకూడదు—ఇలాంటి…
Dog | నిజామాబాద్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. బాల్కొండ మండలానికి చెందిన గడ్డం లక్ష్మణ (10) అనే బాలిక కుక్క…
Brinjal | వంకాయ... మన వంటింట్లో తరచూ కనిపించే రుచికరమైన కూరగాయ. సాంబార్, కూరలు, వేపుడు ఏ వంటకంలో వేసినా…
Health Tips | చిన్న పిల్లల నుంచి పెద్దవారికి సీతాఫలం అనేది ప్రత్యేకమైనది. ఎండాకాలంలో మామిడి పళ్ల కోసం ప్రజలు…
This website uses cookies.