Home » Entertainment » Will Janaki Take Medicine Given By Ayurvedic Doctor
Entertainment

Janaki Kalaganaledu : డాక్టర్ జుమాంజీ ఇచ్చిన మందును జానకి వేసుకుంటుందా? జానకి ఇక జీవితంలో తల్లి కాలేదా?

Authored By
Varun G
The Telugu News | Published on: March 12, 2022, 11:30 am
Advertisement

Janaki Kalaganaledu : జానకి కలగనలేదు సీరియల్ ఈరోజు ప్రసారం కాదు. తిరిగి సోమవారం ప్రసారం అవుతుంది. సోమవారం, 14 మార్చి 2022, 256 ఎపిసోడ్ హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. అసలు నిజం తెలియడంతో జ్ఞానాంబ బాధపడుతుంది. అక్కడి నుంచి వెళ్లిపోతుంది. మల్లిక చాలా సంతోషిస్తుంది. ఇక ఎప్పటికీ జానకికి పిల్లలు పుట్టకూడదని.. తాను మాత్రం మగపిల్లాడిని కని పోలేరమ్మకు అప్పజెప్పాలని అనుకుంటంది. దీంతో లీలావతికి ఫోన్ చేసి అసలు విషయం చెబుతుంది. దీంతో ఆ జానకికి పిల్లలు పుట్టకుండా జుమాంజి డాక్టర్ మందులు ఇస్తాడని చెబుతుంది. దీంతో రేపు జానకిని కూడా తీసుకెళ్దామని చెబుతుంది మల్లిక.

Advertisement

will janaki take medicine given by ayurvedic doctor

మరోవైపు ఉదయమే రామా, జానకి.. ఇద్దరినీ జ్ఞానాంబ పిలుస్తుంది. జానకి.. మనవడు, మనవరాలి కోసం నేను ఇంత ఆరాటపడుతున్నాను. అలాంటిది పిల్లల కోసం మీరు ఎంతగా తపన పడుతున్నారో నేను అర్థం చేసుకోగలను. కానీ.. మీనుంచి నాకు ఒక నిజం తెలియాలి అని అడుగుతుంది జ్ఞానాంబ. మీరు ఏమైనా ఇప్పుడప్పుడే పిల్లలు వద్దు అనుకుంటున్నారా అని ప్రశ్నిస్తుంది. దీంతో జానకి షాక్ అవుతుంది. అమ్మ.. అలాంటిదేం లేదమ్మా అంటాడు రామా. మీకు పెళ్లయి ఇంతకాలం అయినా ఇంకా పిల్లలు కలగలేదంటే.. ఒకసారి హాస్పిటల్ కు వెళ్లి డాక్టర్ తో చెక్ చేయించుకోండి అంటుంది జ్ఞానాంబ.

Advertisement

దీంతో మన ఊరికే జుమాంజి అనే ఓ డాక్టర్ వచ్చాడు. ఇద్దరం వెళ్లి ఆ మందులు వేసుకుంటే ఖచ్చితంగా పిల్లలు పుడతారు అని చెబుతుంది మల్లిక. అప్పుడే లీలావతి కూడా వస్తుంది. తన కూతురు కూడా అదే మందు తిని పండంటి కొడుకును కన్నదని చెబుతుంది లీలావతి.

Janaki Kalaganaledu : జుమాంజి డాక్టర్ దగ్గరకు జానకిని తీసుకెళ్లిన లీలావతి, మల్లిక

దీంతో జ్ఞానాంబను ఒప్పించి జానకిని లీలావతి, మల్లిక.. ఇద్దరూ ఆ జుమాంజి డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తారు. ముందే వెళ్లి ఆ డాక్టర్ తో మాట్లాడుతుంది లీలావతి. జానకి అనే అమ్మాయికి పిల్లలు పుట్టకుండా మందులు ఇవ్వాలి అని చెబుతుంది. మల్లిక అనే అమ్మాయికి పిల్లలు కలిగేలా మందు ఇవ్వాలి అంటుంది లీలావతి.

Advertisement

అలాగే.. నా కమిషన్ కూడా పెంచు అని అడుగుతుంది. ఆ తర్వాత ఇద్దరినీ డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తుంది. దీంతో ఇద్దరినీ చూసి డాక్టర్ మందులు ఇస్తాడు. అయితే.. ఇవి వేటితో తయారు చేసిన మందులు అని అడుగుతుంది జానకి. దీంతో డాక్టర్ కాస్త తడబడతాడు.

ఆ తర్వాత లీలావతి ఏదో సర్దిచెప్పి అక్కడి నుంచి జానకి, మల్లికను బయటికి తీసుకొస్తుంది. ఆ తర్వాత మీరు ఇంటికి వెళ్లండి. నేను తర్వాత వస్తా. నాకు చిన్న పని ఉంది అంటుంది జానకి. ఏం పని అని అడిగితే.. కేకుల డబ్బులు తీసుకొని వస్తా అని అంటుంది జానకి.

జానకికి ఇక జీవితంలో పిల్లలు పుట్టరు అని తెలుసుకొని మల్లిక, లీలావతి తెగ సంతోషిస్తారు. మరోవైపు వెన్నెల నిశ్చితార్థం కోసం ముహూర్తం ఖరారు చేసుకుంటారు గోవిందరాజు, జ్ఞానాంబ. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.

Varun G

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి