Home » Entertainment » Will Jnanamba Know About Janaki Ips Coaching In Janaki Kalaganaledu
Entertainment

Janaki Kalaganaledu : జానకి ఐపీఎస్ కోచింగ్ తీసుకుంటోందని అఖిల్ కు తెలిసి షాక్.. ఈ విషయం జ్ఞానాంబకు చెబుతాడా?

Authored By
Varun G
The Telugu News | Published on: July 3, 2022, 11:30 am
Advertisement

Janaki Kalaganaledu : జానకి కలగనలేదు సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ ఈరోజు ప్రసారం కాదు. తిరిగి సోమవారం ప్రసారం అవుతుంది. 4 జులై 2022, సోమవారం ఎపిసోడ్ 336 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. రాత్రంతా కూర్చొని జానకి అసైన్ మెంట్ పూర్తి చేయాలని అనుకుంటుంది కానీ.. అర్ధరాత్రి కాగానే.. తనకు ఫుల్ గా నిద్ర వస్తుంది. ఇంతలో రామా.. తన కోసం టీ చేసుకొస్తాడు. మీరు రాసుకోండి.. నేను కూర్చొంటాను అంటాడు. దీంతో మీరు ఉదయం నుంచి అలసిపోయారు. మీరు వెళ్లి పడుకోండి అంటుంది జానకి. దీంతో వద్దు వద్దు…రాసుకోండి అంటాడు రామా. ఎంత చెప్పినా వినడు. తన ముందే కూర్చొని చూస్తుంటాడు. ఇంతలో ఇద్దరికీ నిద్ర వచ్చి అలాగే కూర్చొని పడుకుంటారు. దీంతో జానకి అసైన్ మెంట్ పూర్తి కాదు.

Advertisement

will jnanamba know about janaki ips coaching in janaki kalaganaledu

కట్ చేస్తే తెల్లవారుతుంది. రామా నిద్రలేస్తాడు. చూసేసరికి.. జానకి అలాగే పడుకొని ఉంటుంది. దీంతో వెంటనే పుస్తకాలను తీసి పక్కన పెట్టి.. జానకిని పడుకోబెడతాడు రామా. చాలా సేపటికి నిద్ర లేచిన తర్వాత షాక్ అవుతుంది జానకి. అయ్యో నన్ను నిద్రలేపలేదు అంటుంది. ఎందుకు అంటాడు రామా. నా అసైన్ మెంట్ ఇంకా పూర్తి కాలేదు. మీరు నన్ను నిద్రలేపలేదు ఇప్పుడు ఎలా అంటుంది. దీంతో మీరేం కంగారు పడకండి. నేను స్వీట్ల ఆర్డర్ ఇచ్చి వస్తాను. ఇంతలో మీరు కూర్చొని అసైన్ మెంట్ పూర్తి చేయండి. వచ్చాక.. ఇద్దరం కలిసి కోచింగ్ సెంటర్ కు వెళ్లి ఆ పేపర్లు ఇచ్చి వద్దాం అంటాడు రామా.

Advertisement

Janaki Kalaganaledu : జానకి రాసిన అసైన్ మెంట్స్ దొంగలించిన మల్లిక

రామా స్వీట్ల ఆర్డర్ ఇవ్వడానికి కారులో వెళ్తాడు. దీంతో తన రూమ్ లో కూర్చొని జానకి.. అసైన్ మెంట్స్ పూర్తి చేస్తుంటుంది. అసైన్ మెంట్ పూర్తయ్యాక.. ఆ పేపర్లను అక్కడే పెట్టి రెడీ అవ్వడానికి వెళ్తుంది. ఇంతలో మల్లిక.. ఇంట్లో ఉన్న పాత పేపర్లను పేపర్ల వ్యక్తికి వేస్తుంటుంది.

2 కిలోలకు కొంచెం తగ్గాయి. ఇంకొన్ని పేపర్లు ఉంటే తీసుకురండి అని అంటాడు. దీంతో ఇంట్లోకి వెళ్లి ఇంకా ఏవైనా పాత పేపర్లు ఉన్నాయేమో అని చెక్ చేస్తుంది. ఇంతలో జానకి రూమ్ లోకి వెళ్లి అక్కడ జానకి రాసి పెట్టి ఉంచిన అసైన్ మెంట్ పేపర్లను తీసుకుంటుంది. అవి ఏవో పాత పేపర్లేమో అని అనుకుంటుంది.

Advertisement

దీంతో వాటిని పట్టుకొని బయటికి రాబోతుండగా చూసిన జ్ఞానాంబ ఆగు అంటుంది. ఏంటవి అంటుంది. దీంతో పాత పేపర్లు అంటుంది. వాటిని చూసి ఇవేవో ముఖ్యమైన పేపర్లలా ఉన్నాయి అంటుంది జ్ఞానాంబ. వెంటనే అఖిల్ ను పిలిచి ఇవేంటి చూడు అంటుంది జ్ఞానాంబ.

దీంతో అఖిల్ వచ్చి.. అవి ఏ పేపర్లు అని చూస్తాడు. వాటిని చదివి షాక్ అవుతాడు. ఎందుకంటే అవి జానకి ఐపీఎస్ కు సంబంధించిన పేపర్లు. మరి.. ఆ విషయం జ్ఞానాంబకు అఖిల్ చెబుతాడా? ఆ తర్వాత ఏం జరుగుతుంది తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.

Varun G

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి