
will jnanamba trust janaki in janaki kalaganaledu serial
Janaki Kalaganaledu : జానకి కలగనలేదు సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ ఈరోజు ప్రసారం కాదు. తిరిగి సోమవారం ప్రసారం అవుతుంది. జానకి కలగనలేదు 25 సెప్టెంబర్ 2022, సోమవారం ఎపిసోడ్ 396 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఐయామ్ సారీ జెస్సీ అని తన కాళ్లు పట్టుకుంటాడు అఖిల్. దీంతో జెస్సీ అతడిని క్షమిస్తుంది. దీంతో హమ్మయ్య ఈ పూటకు ఎలాగోల తప్పించుకున్నాను అని అనుకుంటాడు అఖిల్. మరోవైపు జ్ఞానాంబ.. జానకి గురించే ఆలోచిస్తూ ఉంటుంది. జానకిని అనవసరంగా తప్పుగా అర్థం చేసుకున్నాను అని అనుకొని తను కొట్టేసిన ఒక తప్పును చెరిపేసే ప్రయత్నం చేస్తుంది జ్ఞానాంబ. అది చెరిగిపోదు జ్ఞానం అంటాడు గోవిందరాజు. పొరపాట్లు అయితే మాసిపోతాయి కానీ.. తప్పులు చెరిగిపోవు జ్ఞానం. ఒక్కోసారి ఆవేశం వివేకాన్ని చంపేస్తుంది. వ్యక్తిత్వం ఎలాంటిదే తెలిసిన వాళ్లను కూడా తప్పుపట్టేలా చేస్తుంది అంటాడు గోవిందరాజు.
will jnanamba trust janaki in janaki kalaganaledu serial
జానకి ఎటువంటి వ్యక్తో తెలిసి కూడా నువ్వు జానకిని అపార్థం చేసుకున్నావు.. అంటాడు గోవిందరాజు. నేను ఎన్ని మాటలు అన్నా జానకి నన్ను ఏం అనకుండా తన కోపాన్ని తన మనసులోనే దాచుకుంది అని అంటుంది జ్ఞానాంబ. మీరు చెప్పినట్టు జానకి సమస్యను గట్టెక్కించింది. నిజాన్ని నిలబెట్టింది కానీ. తన బాధ్యత నాకు సంతృప్తిని ఇవ్వలేదు అంటుంది జ్ఞానాంబ. అదేంటి అంటాడు. బాధ్యతలంటే ఒకటి పట్టించుకొని రెండోది వదిలేయడం కాదు. ఇటు ఇంటి సమస్యను, అటు తన ఆశయాన్ని సమానంగా ఎవరూ నష్టపోకుండా నెరవేర్చాలి. ఒక ఆడపిల్ల జీవితం నాశనం కాకుండా కాపాడింది కానీ.. తన ఆశయానికి సంబంధించిన చాలా ముఖ్యమైన పరీక్షను రాయకుండా వదిలేసింది. జీవితం అన్నాక కుటుంబ బాధ్యతలు తీసుకున్నాక భవిష్యత్తులో ఇలాంటి సమస్యలు ఎన్నో వస్తూనే ఉంటాయి. పోలీసు ఆఫీసర్ గా తను ఎలా తన బాధ్యతను నిర్వర్తిస్తుంది. ఇదే నా బాధంతా అని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతుంది జ్ఞానాంబ.
మరోవైపు రామా.. జ్ఞానాంబ అన్నమాటలు విని బాధపడతాడు. ఇంతలో జానకి వస్తుంది. నేను కూడా అత్తయ్య గారు అన్నమాటలు విన్నా అంటుంది జానకి. ఇక నుంచి నేను మరింత బాధ్యతగా ఉంటా అని చెబుతుంది జానకి.
కట్ చేస్తే తెల్లవారుతుంది. జెస్సీ టీషర్ట్, పాంట్ వేసుకోవడంతో వెంటనే జ్ఞానాంబ దగ్గరికి వెళ్లి జెస్సీ డ్రెస్సు గురించి చెబుతుంది మల్లిక. దీంతో జ్ఞానాంబ వచ్చి జానకిని పిలిచి కోపంగా మాట్లాడుతుంది. ఇక్కడి పద్ధతులు నేర్చుకోవడం చాలా ముఖ్యం అని అంటుంది జ్ఞానాంబ.
దీంతో జానకి.. జెస్సీని లోపలికి తీసుకెళ్లి ఇలాంటి డ్రెస్ ఎందుకు వేసుకున్నావు అని అడుగుతుంది జానకి. దీంతో కట్టుబట్టలతో నేను ఇక్కడికి వచ్చా కాబట్టి నా బట్టలన్నీ ఇంట్లో ఉన్నాయి. ఆప్షన్ లేక నేను అఖిల్ బట్టలు వేసుకున్నా అని అంటుంది జెస్సీ.
కట్ చేస్తే వ్రతం కోసం జానకి ఉండ్రాళ్లు తయారు చేస్తు ఉంటుంది. జెస్సీ వెళ్లి నేను కూడా చేస్తా అంటుంది. ముత్తయిదువులకు వాయనంతో పాటు ఉండ్రాళ్లు కూడా ఇస్తే వ్రతం పరిపూర్ణం అవుతుంది అని అంటాడు పంతులు. కానీ.. దీపం మంటకు అక్కడున్న వాయినాలు కాలిపోతాయి.
దీంతో వ్రతానికి వచ్చిన నీలావతి.. మనం వాయినం తీసుకుంటే మన పసుపు కుంకుమలు కూడా అమ్మవారి కోపానికి బలైపోతాయని అంటారనా మీ ఉద్దేశం అంటుంది నీలావతి. దీంతో ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.
Phone | కొత్త స్మార్ట్ఫోన్ కొనాలనుకునే వారికి మోటరోలా నుంచి మరో గుడ్ న్యూస్ వచ్చింది. రూ.15,000 బడ్జెట్లో పవర్ఫుల్…
Cancer Tips | నేటి వేగవంతమైన జీవనశైలి, ఆహారపు అలవాట్లు, ఒత్తిడి వంటి కారణాల వల్ల క్యాన్సర్, గుండెపోటు, స్ట్రోక్…
Montha Cyclone Effect | ఏపీలో ‘మొంథా’ తుఫాన్ ప్రభావం తీవ్రంగా కనిపిస్తోంది. వాతావరణ శాఖ హెచ్చరికలతో రాష్ట్రవ్యాప్తంగా టెన్షన్…
Dry Eyes | ఈ రోజుల్లో “కళ్ళు పొడిబారడం” (Dry Eyes) సమస్య ఎంతో సాధారణమైపోయింది. మొబైల్, ల్యాప్టాప్ లేదా…
Lemon Seeds | నిమ్మరసం తీసిన తర్వాత గింజలు చేదుగా ఉంటాయని చాలా మంది వాటిని పారేస్తారు. కానీ ఆరోగ్య…
Lemons | మూడు బాటల దగ్గర నడవకూడదు, రోడ్డుపై వేసిన నిమ్మకాయలు, మిరపకాయలు తొక్కకూడదు, పసుపు–కుంకుమ కలిపిన వస్తువులపై దాటకూడదు—ఇలాంటి…
Dog | నిజామాబాద్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. బాల్కొండ మండలానికి చెందిన గడ్డం లక్ష్మణ (10) అనే బాలిక కుక్క…
Brinjal | వంకాయ... మన వంటింట్లో తరచూ కనిపించే రుచికరమైన కూరగాయ. సాంబార్, కూరలు, వేపుడు ఏ వంటకంలో వేసినా…
This website uses cookies.