Home » Entertainment » Will Jwala And Hima Know Who Is Ravva Idli In Karthika Deepam
Entertainment

Karthika Deepam : రవ్వ ఇడ్లీనే ఆనంద్ అని తెలుసుకొని హిమ షాకింగ్ నిర్ణయం.. శౌర్య ఏం చేస్తుంది?

Authored By
Varun G
The Telugu News | Updated on: May 1, 2022, 10:35 am
Advertisement

Karthika Deepam : కార్తీక దీపం సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ ఈరోజు రిలీజ్ కాదు. తిరిగి సోమవారం ప్రసారం అవుతుంది. 2 మే 2022, సోమవారం ఎపిసోడ్ 1341 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. జ్వాల.. హిమ బొమ్మ కోసం గీతకు చెప్పడంతో హిమకు టెన్షన్ స్టార్ట్ అవుతుంది. ఏం చేయాలో అర్థం కాదు. ఒకవైపు సౌందర్య కూడా గీతకు శౌర్య చిన్ననాటి బొమ్మను ఇచ్చి గీయాలని చెబుతోంది. ఇటు జ్వాల కూడా హిమ చిన్ననాటి పోలికలు చెప్పి బొమ్మ గీయిస్తోంది. ఈ రెండింట్లో ఏ ఒక్కటి జరిగినా శౌర్య ఎవరో తెలిసిపోతుంది. అప్పుడు శౌర్య నా మీద ఎలా పగ తీర్చుకుంటుందో అని టెన్షన్ పడుతుంది హిమ.

Advertisement

will jwala and hima know who is ravva idli in karthika deepam

మరోవైపు ఆనంద రావుపై చిరాకుపడుతుంది స్వప్న. దీంతో మీ అమ్మ ఈ విషయంలో కరెక్ట్. ఎలాగైనా మేము ఈ పెళ్లి చేస్తాం. ఎలా ఆపుతావో చూడు. నీకు ఇన్నాళ్లు అమ్మ లేదు. ఇప్పుడు డాడీ కూడా లేడు. నేను వెళ్తున్నాను.. రేపటి నుంచి నన్ను కూడా ఆనంద రావు అని పిలుస్తావు కావచ్చు. నువ్వు ఎంత వరకు  కరెక్టో నువ్వే ఆలోచించుకో. నేను వెళ్తున్నాను. నాతో మాట్లాడకు. నాకు ఫోన్ చేయకు అని వార్నింగ్ ఇచ్చి ఆనంద రావు వెళ్లిపోతాడు.

Advertisement

Karthika Deepam : ప్రేమ్ ప్లాన్ ను మరోసారి పాడు చేసిన జ్వాల

కట్ చేస్తే.. హిమను పానీపూరీ బండి దగ్గరికి తీసుకెళ్తాడు ప్రేమ్. తన ప్రేమ విషయాన్ని అక్కడే చెప్పలనుకుంటాడు. కానీ.. అక్కడ అంతా రివర్స్ అవుతుంది. అక్కడికి జ్వాల వచ్చి తన ప్లాన్ అంతా చెడగొడుతుంది. దీంతో ప్రేమ్ కు కోపం వస్తుంది. తన ప్లాన్ అంతా రివర్స్ అయిపోతోందని టెన్షన్ పడతాడు ప్రేమ్.

మరోవైపు గీత.. ఒకవైపు శౌర్య.. మరోవైపు హిమ బొమ్మలను గీస్తుంది. బొమ్మలను గీశాక ఆ బొమ్మలను చూసి షాక్ అవుతుంది. ఇంతలో తనకు ఫోన్ లో ఎవరో చనిపోయారని చెబుతారు. దీంతో తను చాలా బాధపడుతుంది. మరోవైపు రవ్వ ఇడ్లీకి దెబ్బలు తాకుతాయి.

Advertisement

దుర్గన్న చూసి ఏమైంది అని అడుగుతాడు. దీంతో స్కూల్ లో తన తోటి విద్యార్థులు కొట్టారని చెబుతాడు. తన తల్లిదండ్రుల గురించి చెడుగా మాట్లాడటంతో తాను కొట్టానని.. వాళ్లు కూడా తనను కొట్టారని చెబుతాడు. దీంతో వెంటనే తనను ఇంటికి తీసుకెళ్లి.. జ్వాలకు ఫోన్ చేసి దుర్గన్న అసలు విషయం చెబుతాడు.

దీంతో జ్వాల, హిమ ఇద్దరూ రవ్వ ఇడ్లీ ఇంటికి వస్తారు. అక్కడ కార్తీక్, మోనిత ఫోటోలను చూసి షాక్ అవుతారు. రవ్వ ఇడ్లీనే ఆనంద్ అని తెలుసుకొని హిమ షాక్ అవుతుంది. శౌర్య కూడా షాక్ అవుతుంది. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.

Varun G

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి