Home » Entertainment » Will Jwala Find Out Who Is Hime In Karthika Deepam
Entertainment

Karthika Deepam : డైరెక్ట్ గా నిరుపమ్ ఇంటికి వెళ్లిన జ్వాల.. హిమ ఎవరో తెలుసుకొని నిరుపమ్ తో పెళ్లి చేస్తుందా?

Authored By
Varun G
The Telugu News | Published on: June 26, 2022, 10:30 am
Advertisement

Karthika Deepam : కార్తీక దీపం సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ ఈరోజు ప్రసారం కాదు. తిరిగి సోమవారం ప్రసారం అవుతుంది. 27 జూన్ 2022, సోమవారం ఎపిసోడ్ 1389 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. వంట వండి జ్వాలకు తినిపిస్తుంది సౌందర్య. దీంతో జ్వాల చాలా సంతోషిస్తుంది. తన నానమ్మ చేతి వంట తినక ఎన్ని రోజులు అవుతోంది అని బాధపడుతుంది జ్వాల. తర్వాత మా ఇంటికి వచ్చి కొన్నిరోజులు ఉండొచ్చు కదా అని జ్వాలను అడుగుతుంది సౌందర్య. దీంతో ఇప్పుడు రాను అంటుంది జ్వాల. అక్కడికి వస్తే నా శత్రువు కనిపిస్తుంది. నా శత్రువును చూస్తే నేను ఆగలేను. ఇప్పుడు నాకు ఒక్కరు కాదు.. ఇద్దరు శత్రవులు అని ఒకరు హిమ, మరొకరు ఆ తింగరి అని అనుకుంటుంది జ్వాల.

Advertisement

will janaki know who steals her money from bank account

మరోవైపు శోభ.. సౌందర్యకు ఫోన్ చేసి.. తను చెప్పిన విషయం ఏమైంది అని అడుగుతుంది. దీంతో నేనే మీ ఇంటికి వచ్చి మాట్లాడుతా.. అంటుంది సౌందర్య. దీంతో శోభ తన ఇంటి లొకేషన్ పెడుతుంది. అక్కడికి వెళ్లిన తర్వాత శోభ చెంప చెళ్లుమనిపిస్తుంది సౌందర్య. ఇంకోసారి నా ఫ్యామిలీ జోలికి వస్తే బాగోదు అంటుంది. దీంతో శోభకు ఏం చేయాలో అర్థం కాదు. అసలు.. సౌందర్య ఎందుకు కొట్టిందో కూడా అర్థం కాదు. తన ప్లాన్ మొత్తం రివర్స్ అయిందని బాధపడుతుంది.

Advertisement

Karthika Deepam : హిమను అడ్డంగా ఇరికించిన శోభ

మరోవైపు కారులో శోభ వెళ్తుండగా తనకు హిమ ఒకచోట రోడ్డు మీద కనిపిస్తుంది. దీంతో భలే దొరికావే అని అనుకొని వెంటనే జ్వాలకు ఫోన్ చేసి.. నేను హిమను మాట్లాడుతున్నా అంటుంది. నువ్వు నన్ను చూడాలనుకుంటే వెంటనే నేను చెప్పిన అడ్రస్ కు వచ్చేయ్ అంటుంది.

దీంతో వెంటనే ఆటోలో బయలుదేరుతుంది జ్వాల. అక్కడికి వచ్చి చూస్తే అక్కడ హిమ ఉంటుంది. తనను చూసి ఏయ్ తింగరి నువ్వేంటి ఇక్కడ. అసలు ఎవరు నువ్వు.. నీ పేరేంటి చెప్పు అని అడుగుతుంది. కట్ చేస్తే.. ఆనంద రావు, సౌందర్య ఇద్దరూ శౌర్య గురించి మాట్లాడుకుంటారు.

Advertisement

మరోవైపు జ్వాల..నిరుపమ్ ఇంటికి వెళ్తుంది. తను కొనిచ్చిన ఆటోను తనకే ఇచ్చేస్తుంది. అక్కడే స్వప్న కూడా ఉంటుంది. ఇంకా నీ ఆటోను నేను నడపడం కరెక్ట్ కాదు అని అంటుంది. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.

Varun G

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి