
will karthik do operation to mounitha uncle
Karthika Deepam : కార్తీక దీపం సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ ఈరోజు ప్రసారం కాదు. తిరిగి సోమవారం ప్రసారం అవుతుంది. 21 ఫిబ్రవరి 2022, సోమవారం ఎపిసోడ్ 1281 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. మోనిత అసలు నీకు ఎందుకు హెల్ప్ చేసింది. ఏదైనా దుర్మార్గపు ఆలోచన చేస్తుందేమోనని తన భయం అని సౌందర్య.. కార్తీక్ తో చెబుతుంది. అప్పుడే మోనిత ఫోన్ చేస్తుంది. బాబాయి ఆపరేషన్ చేస్తావా అని మరోసారి అడుగుతుంది. దీంతో మీ బాబాయికి ఆపరేషన్ చేస్తా. కానీ.. నీ విషయం ఏంటి.. నువ్వు నీ మాట మీద నిలబడతావా అని అడుగుతాడు కార్తీక్. ఫోన్ లౌడ్ స్పీకర్ పెడతాడు. దీంతో అదేంటి కార్తీక్ అంత స్ట్రాంగ్ గా చెప్పాను కదా. అన్నీ మానేస్తాను. హాస్పిటల్ కూడా తీసేస్తానని చెప్పాను కదా అంటుంది మోనిత. దీంతో థాంక్స్ అని చెప్పి ఫోన్ కట్ చేస్తాడు.
will karthik do operation to mounitha uncle
విన్నారు కదా.. నేను చేయలేని పనిని.. అసాధ్యమైన పనిని అడగలేదు మోనిత. నాకు సాధ్యమైన పనినే అడిగింది. ఒక డాక్టర్ గా నా పని నేను చేస్తాను. ఈ సర్జరీ చేస్తున్నాను అని చెప్పి అక్కడి నుంచి వెళ్లబోతాడు కార్తీక్. ఇంతలో పిల్లలు వచ్చి నాన్న.. అమ్మ తాడికొండ వెళ్లింది. మా స్కూల్ టీసీలు, ఇంకా ఏవో పనులు ఉన్నాయట. రేపు వస్తానంది అంటారు పిల్లలు. దీంతో రేపు కాకుంటే ఎల్లుండి రమ్మనండి అని చెప్పి కోపంగా కార్తీక్ అక్కడి నుంచి వెళ్లిపోతాడు. మరోవైపు తన బాబాయిని బుట్టలో వేసుకోవడానికి తెగ ప్రయత్నాలు చేస్తుంటుంది మోనిత. నీలో ఇంత మార్పు నేను ఊహించలేదమ్మా అంటాడు. మనసులో మాత్రం నీ చావుకే ముహూర్తం పెట్టా అని అనుకుంటుంది మోనిత.
మరోవైపు కార్తీక్ ను పిలిచి అసలు నువ్వు ఏం చేస్తున్నావు అంటుంది సౌందర్య. దీప చేసింది మంచి పనే అంటుంది. కానీ.. కార్తీక్ ఒప్పుకోడు. ఇది మంచి చాన్స్ మమ్మి. ఒక డాక్టర్ గా నేను చేయగలిగిందే కదా అంటాడు కార్తీక్. కానీ.. సౌందర్య మాత్రం.. మోనితను అస్సలు నమ్మకు అంటుంది.
మరోవైపు ఆనంద్ తో చాలా అటాచ్ మెంట్ పెంచుకుంటారు శౌర్య, హిమ. ఎప్పటికైనా ఆనంద్ ను మన తమ్ముడిగానే చూడాలని.. ఆనంద్ వేరే ఫ్యామిలీ నుంచి వచ్చాడని ఎవ్వరికీ తెలియకూడదని అనుకుంటారు. ఈ విషయం సౌందర్య వింటుంది. ఆనంద్ తో వీళ్లు బంధం బాగా పెంచుకున్నారని అనుకుంటుంది.
కట్ చేస్తే ఆసుపత్రికి వెళ్లి ఓ నర్సుతో తన ప్లాన్ గురించి చెబుతుంది. తను చెప్పినట్టు చేస్తే డబ్బులు ఇస్తానని ఆశ చూపిస్తుంది. కానీ.. ఆ నర్సు మాత్రం నేను ఈ పని చేయను అని చెబుతుంది. అప్పుడే కార్తీక్ వస్తాడు. మోనిత నీతో మాట్లాడాలి. నా క్యాబిన్ కు రా అంటాడు.
దీంతో మోనిత టెన్షన్ పడుతుంది. ఆపరేషన్ పేరుతో నువ్వేమీ కుట్ర పన్నడం లేదు కదా అని అడుగుతాడు. దీంతో కార్తకీ కాళ్లు పట్టుకొని కన్నీళ్లు కారుస్తున్నట్టు ప్రవర్తిస్తుంది. అదంతా నాటకం అని తెలియక తన కన్నీళ్లు చూసి కార్తీక్ పడిపోతాడు.
మరోవైపు మోనిత బాబాయితో మాట్లాడేందుకు సౌందర్య బస్తీకి వెళ్తుంది. లక్ష్మణ్, వారణాసితో కాసేపు మాట్లాడి ఆ తర్వాత మోనిత బాబాయిని పిలవమని చెబుతుంది. దీంతో వారణాసి కబురు చేస్తాడు. అప్పుడే వస్తాడు మోనిత బాబాయి.
నేను కార్తీక్ అమ్మను అని చెబుతుంది సౌందర్య. మా అబ్బాయి మీకు ఆపరేషన్ చేస్తాడు కానీ.. మీరు ఆపరేషన్ తర్వాత మోనితను కూడా తీసుకొని అమెరికా వెళ్లిపోవాలని చెబుతుంది సౌందర్య. అప్పుడే మోనిత వచ్చి సౌందర్య మాటలు వింటుంది. సౌందర్య మాటలు విని షాక్ అవుతుంది. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.
Montha Cyclone Effect | ఏపీలో ‘మొంథా’ తుఫాన్ ప్రభావం తీవ్రంగా కనిపిస్తోంది. వాతావరణ శాఖ హెచ్చరికలతో రాష్ట్రవ్యాప్తంగా టెన్షన్…
Dry Eyes | ఈ రోజుల్లో “కళ్ళు పొడిబారడం” (Dry Eyes) సమస్య ఎంతో సాధారణమైపోయింది. మొబైల్, ల్యాప్టాప్ లేదా…
Lemon Seeds | నిమ్మరసం తీసిన తర్వాత గింజలు చేదుగా ఉంటాయని చాలా మంది వాటిని పారేస్తారు. కానీ ఆరోగ్య…
Lemons | మూడు బాటల దగ్గర నడవకూడదు, రోడ్డుపై వేసిన నిమ్మకాయలు, మిరపకాయలు తొక్కకూడదు, పసుపు–కుంకుమ కలిపిన వస్తువులపై దాటకూడదు—ఇలాంటి…
Dog | నిజామాబాద్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. బాల్కొండ మండలానికి చెందిన గడ్డం లక్ష్మణ (10) అనే బాలిక కుక్క…
Brinjal | వంకాయ... మన వంటింట్లో తరచూ కనిపించే రుచికరమైన కూరగాయ. సాంబార్, కూరలు, వేపుడు ఏ వంటకంలో వేసినా…
Health Tips | చిన్న పిల్లల నుంచి పెద్దవారికి సీతాఫలం అనేది ప్రత్యేకమైనది. ఎండాకాలంలో మామిడి పళ్ల కోసం ప్రజలు…
Peanuts Vs Almonds | బరువు తగ్గాలనే లక్ష్యంతో ఉన్నవారు సాధారణంగా తక్కువ క్యాలరీల ఆహారాన్ని ఎంచుకుంటారు. అయితే, ఆరోగ్యకరమైన…
This website uses cookies.