Kollywood Heroes : తమిళ హీరోలు తెలుగులో నిలబడతారా..? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Kollywood Heroes : తమిళ హీరోలు తెలుగులో నిలబడతారా..?

Kollywood Heroes : గతంలో ఎప్పుడూ లేని విధంగా తమిళ స్టార్ హీరోలందరూ టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో స్ట్రైట్ సినిమాలు చేసేందుకు బాగా ఆసక్తి చూపిస్తున్నా రు. సీనియర్ హీరోలలో సూపర్ స్టార్ రజనీకాంత్, విశ్వ నటుడు కమల్ హాసన్ మాత్రమే తమ సినిమాలను తెలుగులో కూడా రిలీజ్ చేసేవారు. కమల్ – రజనీ తెలుగులో కొన్ని స్ట్రైట్ సినిమాలు చేశారు. కానీ, ఎక్కువ ఇక్కడ ఎప్పుడూ ఫోకస్ పెట్టింది లేదనే చెప్పాలి. అయితే, ఇప్పటి జనరేషన్ […]

 Authored By govind | The Telugu News | Updated on :12 April 2022,5:30 pm

Kollywood Heroes : గతంలో ఎప్పుడూ లేని విధంగా తమిళ స్టార్ హీరోలందరూ టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో స్ట్రైట్ సినిమాలు చేసేందుకు బాగా ఆసక్తి చూపిస్తున్నా రు. సీనియర్ హీరోలలో సూపర్ స్టార్ రజనీకాంత్, విశ్వ నటుడు కమల్ హాసన్ మాత్రమే తమ సినిమాలను తెలుగులో కూడా రిలీజ్ చేసేవారు. కమల్ – రజనీ తెలుగులో కొన్ని స్ట్రైట్ సినిమాలు చేశారు. కానీ, ఎక్కువ ఇక్కడ ఎప్పుడూ ఫోకస్ పెట్టింది లేదనే చెప్పాలి. అయితే, ఇప్పటి జనరేషన్ హీరోలందరు మన టాలీవుడ్ మీద గట్టిగా ఫోకస్ పెడుతున్నారు. విజయ్, ధనుష్, శివ కార్తికేయ లాంటి వారు ఇక్కడ స్ట్రైట్ సినిమాలు చేస్తున్నారు.విజయ్‌కు తమిళంలో మంచి స్టార్ డం ఉంది.

ఇప్పుడు అక్కడ తను పాన్ ఇండియన్ హీరో. ఈ నెల 13న బీస్ట్ సినిమాతో రాబోతున్నాడు. దీని తర్వాత తెలుగులో ఎంట్రీ ఇస్తూ స్ట్రైట్ సినిమా చేస్తున్నాడు. దీనికి దిల్ రాజు నిర్మాత. వంశీపైడిపల్లి దర్శకత్వం వహిస్తుండగా రష్మిక మందన్న హీరోయిన్‌గా నటిసోంది. త్వరలో రెగులర్ షూటింగ్ ప్రారంభమవబోతోంది. ఇక ఈ కథను తెలుగు స్టార్ హీరో రిజెక్ట్ చేశాడు. మరి విజయ్‌కు వర్కౌట్ అవుతుందా లేదా చూడాలి. అలాగే, కోలీవుడ్‌లో అగ్ర హీరోగా వెలుగుతున్నాడు ధనుష్.తన టాలీవుడ్ ఎంట్రీ కూడా కన్‌ఫర్మ్ అయింది. తెలుగు తమిళ భాషలలో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమాకు తెలుగులో సార్ అనే టైటిల్‌ను ఫిక్స్ చేశారు.

will kollywood heros set in telugu

will kollywood-heros- set in telugu

Kollywood Heros: టాలీవుడ్ హీరోలకు ధీటుగా క్రేజ్ సంపాదించుకుంటారా..?

వెంకీ అట్లూరి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను సితార ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్‌లో సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. ఇందులో హీరోయిన్‌గా సంయుక్త మీనన్ నటిస్తోంది. త్రివిక్రమ్ ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన కొన్ని కీలక విషయాలను చూస్తున్నారు. ఇక తమిళంలో మంచి కథలతో హిట్స్ అందుకుంటూ దూసుకుపో తున్న శివ కార్తికేయన్ కూడా తెలుగులో స్ట్రైట్ సినిమా చేస్తున్నాడు. జాతిరత్నాలు ఫేమ్ అనుదీప్ కెవి దర్శకత్వం వహిస్తున్నాడు. అయితే, వీరికి తెలుగు స్ట్రైట్ సినిమాలు ఎంతవరకు కలిసిస్తాయనేది ఇప్పుడే చెప్పలేము. స్ట్రైట్ సినిమాలతో మన టాలీవుడ్ హీరోలకు ధీటుగా క్రేజ్ సంపాదించుకుంటారా అనేది కాస్త సందేహమే అంటున్నారు. చూడాలి మరి వీరి సినిమాలు రిలీజయ్యాక రిజల్ట్ ఎలా వస్తుందో.

govind

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది