
will mallika plan workout on janaki
Janaki Kalaganaledu : జానకి కలగనలేదు సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ ఈరోజు ప్రసారం కాదు. తిరిగి సోమవారం ప్రసారం అవుతుంది. 17 అక్టోబర్ 2022, సోమవారం ఎపిసోడ్ 411 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. అఖిల్ గురించి రామా, జానకి.. జ్ఞానాంబతో మాట్లాడుతారు. నువ్వు ఇంకా దూరం చేస్తున్న కొద్దీ అఖిల్ తట్టుకోలేక ఎటువంటి తప్పులు చేస్తాడో అని అంటాడు రామా. దీంతో అఖిల్ ను దగ్గర తీసుకోవడానికి నాకు కొంచెం సమయం కావాలి అంటుంది జ్ఞానాంబ. ఆ తర్వాత జానకి గదిలో చదువుకుంటూ ఉంటుంది. రాత్రి పూట 4 గంటల దాకా చదువుకుంటుంది. అలాగే కూర్చొని నిద్రపోతుంది. ఇంతలో రామా లేచి తనను చూస్తాడు.
will mallika plan workout on janaki
పరీక్షలు పూర్తయ్యే వరకు జానకి గారు ఇంటి పనులేవీ చేయకుండా నేనే సహాయంగా ఉండాలి అని అనుకుంటాడు రామా. వెళ్లి ఇంటి పనులన్నీ చేసి జానకి కోసం కాఫీ పెడతాడు. కాఫీ పెట్టి జానకికి తీసుకెళ్తుండగా మల్లిక చూస్తుంది. వామ్మో.. ఈయన ఏంటి ఇంత ఉదయమే కాఫీ తీసుకొని వెళ్తున్నాడు అని చూస్తుంది. జానకిని లేపి కాఫీ తాగమంటాడు. దాంతో అదేంటండి.. మీరు ఎందుకు ఇలా నాకోసం కాఫీ పెట్టారు.. అని అడుగుతుంది. దీంతో కాఫీ మాత్రమే కాదు.. అన్ని పనులు నేనే చేసేశాను అంటాడు రామా. దీంతో అయ్యో రామా మీరెందుకు ఆ పనులన్నీ చేశారు అని అంటుంది జానకి. ఇవన్నీ విన్న మల్లిక.. నిన్ను ఎలా ప్రశాంతంగా చదువకోనిస్తాను జానకి. చెప్తా నా ప్లాన్స్ నాకు ఉంటాయి కదా అని అనుకుంటుంది మల్లిక.
జానకి చదవడానికి వీలు లేదు. ఐపీఎస్ అవడానికి అస్సలు వీలు లేదు. కానీ.. ఎలా అని అనుకుంటుండగా తనకు తులసి కోట కనిపిస్తుంది. నేను ఈ తులసి కోటను పగుల గొట్టి ఆ నెపంతో పోలేరమ్మ తోటి జానకిని తిట్టిచ్చి తన చదువును చెడగొడతాను అని అనుకుంటుంది మల్లిక.
పక్కన ఎవరైనా ఉన్నారా అని చూసి వెంటనే తులసి కోటను కూలగొట్టేస్తుంది మల్లిక. అయితే.. జాగింగ్ కు వెళ్లే సమయంలో మల్లిక చేసే పనిని చూస్తారు రామా, జానకి. ఇంతలో చికితను పిలిచి తులసి కోట పూజకు హారతి తీసుకురా అని అడుగుతుంది జ్ఞానాంబ.
ఇంతలో తులసి కోటను మొత్తం కూలగొట్టేసి లోపలికి వెళ్తుంది మల్లిక. చికిత హారతి ఇవ్వగానే దాన్ని తీసుకొని బయటికి వచ్చి తులసి కోట కింద పడిపోయి ఉండటాన్ని చూస్తుంది జ్ఞానాంబ. షాక్ అవుతుంది. తులసి కోట ఏంటి ఇలా పడిపోయి ఉంది అని చికితను పిలుస్తుంది.
దీంతో అందరూ బయటికి వస్తారు. తులసి కోట పడి ఉండటం చూసి అందరూ షాక్ అవుతారు. ఈ తులసి కోట ఎలా పడిపోయింది అని జ్ఞానాంబ అందరినీ అడుగుతుంది. ఇంకెవరు ఆ జానకే పడేసి ఉంటుంది అని అంటుంది మల్లిక. దీంతో ఎప్పుడూ నీకు జానకి మీదే డౌటా అని అంటాడు గోవిందరాజు.
ఎవరో పని గట్టుకొని ధైర్యంగా అమ్మవారి రూపమైన తులసి కోటను ఎవరు పడగొట్టారు అని అందరూ టెన్షన్ పడతారు. జానకి కాకపోతే జెస్సీ కావచ్చు అని జెస్సీ మీదికి నెట్టేసేందుకు ప్రయత్నిస్తుంది మల్లిక. దీంతో నేను కాదు అని జ్ఞానాంబతో అంటుంది జెస్సీ.
ఇంతలో రామా కల్పించుకొని అసలు ఈ తులసి కోట కూలిపోవడానికి కారణం ఎవరంటే అంటూ చెప్పబోతుండగా ఆపుతుంది జానకి. దానికి కారణం నేనే అంటుంది జానకి. దీంతో అందరూ షాక్ అవుతారు. వదిన నువ్వా.. నిజంగా ఆ పని చేసి ఉంటే ఇంతసేపు సైలెంట్ గా ఉండవు అంటుంది వెన్నెల.
నేనే అత్తయ్య గారికి చెప్పాలనుకునే లోపే ఈ పని జరిగింది. క్షమించండి అత్తయ్య గారు.. నా పొరపాటు వల్లే తులసి కోట పడిపోయింది అంటుంది జానకి. దీంతో మల్లిక షాక్ అవుతుంది. కాస్త చూసుకోవచ్చు కదా జానకి. జాగ్రత్తగా ఉండకపోతే ఎలా అంటుంది జ్ఞానాంబ.
ఇంతలో వెళ్లి మట్టిని తీసి తులసి కోటను సెట్ చేయబోతుంది జానకి. ఇంతలో ఆ మట్టిలో ఉన్న ఓ ఉంగరం జానకికి కనిపిస్తుంది. ఆ ఉంగరాన్ని తీసి దానికి ఉన్న మట్టిని మొత్తాన్ని తీసేస్తుంది. అత్తయ్య ఇందులో ఏదో ఉంగరం దొరికింది అని చెబుతుంది.
ఆ ఉంగరాన్ని చూసి గోవిందరాజు సంతోషిస్తాడు. ఎందుకంటే అది జ్ఞానాంబ పెళ్లి నాటి ప్రధమ ఉంగరం. దాన్ని చూసి జ్ఞానాంబ కూడా సంతోషిస్తుంది. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.
Onion Black Streaks : ఏ కూర వండినా ఉల్లిగడ్డ అనేది కీలకం. ఉల్లిగడ్డ లేకుండా ఏ కూర వండలేం.…
Jaggery Vs Sugar : మనిషి నాలుకకు టేస్ట్ దొరికితే చాలు.. అది ఆరోగ్యానికి మంచిదా? చెడ్డదా? అనే ఆలోచనే…
Benefits of Eating Fish : చాలామందికి ఫిష్ అంటే పడదు. చికెన్, మటన్ అంటే లొట్టలేసుకుంటూ లాగించేస్తారు కానీ..…
Egg vs Paneer : ఎగ్ అంటే ఇష్టం లేని వాళ్లు ఉండరు. కానీ నాన్ వెజిటేరియన్లు మాత్రమే ఎగ్…
Snoring Health Issues : చాలామంది నిద్రపోయేటప్పుడు గురక పెడుతూ ఉంటారు. గురక పెట్టేవాళ్లకు వాళ్లు గురక పెడుతున్నట్టు తెలియదు.…
Ghee Coffee or Bullet Coffee : కాఫీ అంటే అందరికీ తెలుసు కానీ ఈ బుల్లెట్ కాఫీ ఏంటి…
Swallow Bubble Gum : టైమ్ పాస్ కోసం చాలామంది నోట్లో ఎప్పుడూ బబుల్ గమ్ ను నములుతూ ఉంటారు.…
Garlic Health Benefits : వెల్లుల్లి అనగానే చాలామందికి నచ్చదు. ఎందుకంటే అది చాలా ఘాటుగా ఉంటుంది. కూరల్లో వేసినా…
This website uses cookies.