
will naga chaitanya and samantha patch up again
Samantha : ఇండస్ట్రీ మొత్తం గత సంవత్సరం సమంత, నాగ చైతన్య విడాకుల గురించే చర్చించింది. సరిగ్గా సంవత్సరం క్రితం తామిద్దరం విడాకులు తీసుకోబోతున్నామని చైతే సామ్ ఇన్ స్టా పోస్ట్ ద్వారా ప్రకటించారు. ఇద్దరూ కలిసి ఒకే నోట్ ను విడుదల చేశారు. ఆ నోట్ ప్రకారం.. తాము విడిపోతున్నట్టు.. విడిపోయినా కూడా ఇద్దరం ఎప్పటికీ ఫ్రెండ్స్ గా మాత్రం ఉంటామని ఆ నోట్ సారాంశం. ఇప్పుడు ఆ నోట్ ను నిజం చేస్తూ తిరిగి ప్యాచ్ అప్ అవ్వబోతున్నారని తెలుస్తోంది. నిజానికి వాళ్ల విడాకుల తర్వాత ఇద్దరూ తమ సినిమాల్లో బిజీ అయిపోయారు.
కానీ.. ఇప్పుడు మళ్లీ ఈ జంట కలిసేందుకు ట్రై చేస్తోందట. ఎందుకంటే విడాకుల తర్వాత ఎక్కడ చూసినా.. సమంత చాలా భావోద్వేగంగా కనిపించారు. చైతన్య కూడా తామిద్దరం ఎవరికి వాళ్లం బాగానే ఉన్నామని చెప్పాడు. అయితే.. ఇటీవల సమంత సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టింది. అది ఒక ఫోటో. టీషర్ట్ మీద యూ విల్ నెవర్ వాక్ ఎలోన్ అని రాసి ఉంది. అంటే.. నువ్వు ఎప్పుడూ ఒంటరిగా ఉండవు.. అని దాని అర్థం. అంటే.. సమంత తిరిగి నాగ చైతన్యతో కలిసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందా?
will naga chaitanya and samantha patch up again
తన టీషర్ట్ మీద ఉన్న కోట్స్ మాత్రమే హైలెట్ చేస్తూ సమంత ఎందుకు ఆ ఫోటోను సోషల్ మీడియాలో పెట్టింది అంటూ నెటిజన్లు కోడిగుడ్డు మీద ఈకలు పీకుతున్నారు. అంటే.. ఇద్దరూ తిరిగి కలిసే చాన్స్ ఉందంటూ టాలీవుడ్ కోడై కూస్తోంది. ఇక.. ప్రస్తుతం సమంత యశోద, శాకుంతలం సినిమాలో నటిస్తోంది. మరో హాలీవుడ్ సినిమాలోనూ నటిస్తోంది. ఫుల్ బిజీగా సినిమాల్లో ఉన్నప్పటికీ తిరిగి నాగ చైతన్యతో కలవాలని సమంతకు ఉందనే వార్తలు ప్రస్తుతం ఫిలింనగర్ లో చక్కర్లు కొడుతున్నాయి. చూద్దాం మరి నిజంగానే ఇద్దరూ మళ్లీ కలుస్తారా? అనేది.
Dhurandar-2 : ధురంధర్ ది రివేంజ్ చిత్రం విడుదలైన నాలుగు వారాలు పూర్తవుతున్నా కూడా బాక్సాఫీస్ వద్ద అదే జోష్…
Ys Jagan Modi : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఎప్పుడూ ఏదో ఒక సంచలనం జరుగుతూనే ఉంటుంది. ముఖ్యంగా కేంద్రంలో ఉన్న…
El Nino Summer : ప్రస్తుతం ఎండలు మండిపోతున్నాయి. సాధారణంగా వచ్చే వేసవి కాలం వేరు, కానీ ఇప్పుడు మనం…
Chanikiya Niti : హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియం వేదికగా ఈరోజు రాత్రి జరగబోయే సన్‌రైజర్స్ హైదరాబాద్ మరియు రాజస్థాన్ రాయల్స్…
Getup Srinu : తెలుగు ప్రేక్షకులకు నవ్వులు పంచిన ప్రముఖ కామెడీ షో “జబర్దస్త్” ద్వారా గెటప్ శ్రీను అపారమైన…
IPL 2026 : ఐపీఎల్ 2026 టోర్నీలో భాగంగా హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియంలో జరిగిన ఉత్కంఠభరిత మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్…
Farming Tips : వ్యవసాయం అంటే కేవలం శ్రమతో కూడిన పని మాత్రమే కాకుండా సరైన ప్రణాళికతో లాభాలను అందించే…
Cardamom : మన రోజువారీ జీవితంలో చిన్న చిన్న అలవాట్లు పెద్ద ఆరోగ్య మార్పులకు దారి తీస్తాయి. అలాంటి ఒక…
Mobile : నేటి డిజిటల్ ప్రపంచంలో ఫోన్ నోటిఫికేషన్లు మన రోజువారీ జీవితంలో భాగమైపోయాయి. ఒక్క నిమిషం కూడా రింగ్‌టోన్…
Bullet Coffee : ప్రస్తుతం సోషల్ మీడియాలో హెల్త్ ట్రెండ్స్ గురించి వెతికే వారికి ఎక్కువగా వినిపిస్తున్న పేరు ‘బుల్లెట్…
YS Suneetha : వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. దాదాపు ఏడేళ్లుగా సిబిఐ…
Donald Trump : అమెరికా రాజకీయాల్లో ఎప్పుడూ ఏదో ఒక సంచలనానికి తెరలేపే డొనాల్డ్ ట్రంప్, ఈసారి ఏకంగా దైవదూత…
This website uses cookies.