
will prem back to his home will tulasi accept him
Intinti Gruhalakshmi : ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా ప్రసారం కాదు. తిరిగి సోమవారం ప్రసారం అవుతుంది. సోమవారం, 14 మార్చి 2022 ఎపిసోడ్ 578 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. దివ్య అస్సలు అన్నం తినకపోవడంతో దివ్య దగ్గరికి వెళ్లి మాట్లాడుతాడు నందు. కానీ.. తను మాత్రం ప్రేమ్ వచ్చేదాకా అన్నం తినను అని మారాం చేస్తుంది. దీంతో నందుకు ఏం చేయాలో అర్థం కాదు. లాస్య.. తులసి మీద దివ్యకు నెగెటివ్ గా చెప్పి తనను మార్చే ప్రయత్నం చేస్తుంటుంది. అమ్మ అస్సలు ప్రేమ్ అన్నయ్యను ఇంటికి తీసుకురావడం లేదు అని బాధపడుతుంది దివ్య. దీంతో కోపంతో నందు.. తులసి దగ్గరికి వెళ్లి ప్రేమ్ విషయంలో ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నావు అని ప్రశ్నిస్తాడు. ప్రేమ్ కు ఫోన్ చేసి ఇంటికి రమ్మనొచ్చు కదా అంటాడు.
will prem back to his home will tulasi accept him
దీంతో నేనే ఎందుకు చేయాలి.. నువ్వు చేయొచ్చు కదా అని తిరిగి నందునే ప్రశ్నిస్తుంది తులసి. దీంతో ప్రేమ్ ను ఇంట్లో నుంచి పంపించింది నువ్వు.. నువ్వే ఫోన్ చేసి రమ్మనాలి అని అడుగుతుంది లాస్య. దీంతో పిలుస్తాను.. తిరిగొచ్చాక వాడితో ఎప్పుడూ గొడవపడను అని మాటిస్తారా అని అడుగుతుంది తులసి. దీంతో మాటిస్తాను అని అంటాడు నందు. దీంతో వెంటనే ప్రేమ్ కు ఫోన్ చేసి రమ్మని చెప్పు అని నందుతో అంటుంది అనసూయ. కాకపోతే తిరిగొచ్చాక నందు ఇక గొడవ పడడని మాటిస్తావా అని అడుగుతాడు నందు. దీంతో నేనేలా మాటిస్తాను అంటుంది తులసి. నేను ఫోన్ చేస్తే నన్ను ప్రేమ్ అడిగే మొదటి మాట ఇదే అంటుంది తులసి.
అందుకే.. నువ్వే ఫోన్ చేసి రావాలని అడుగు. నేను అడ్డుపడను అంటుంది తులసి. దీంతో నేనెలా ఫోన్ చేస్తాను. వాడు నా షర్ట్ పట్టుకున్నాడు. నా మీద అరిచాడు. అందుకే నేను ఫోన్ చేయను. నువ్వే ఫోన్ చేయి అంటాడు నందు. దీంతో మీ మధ్య సఖ్యత కుదిరేవరకు నేను ఫోన్ చేయను అంటుంది తులసి.
మరోవైపు ప్రేమ్.. తన ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్తాడు. ఉద్యోగం కోసం వెతుక్కోవాలి అంటాడు. ఇప్పట్లో ఈవెంట్స్ కూడా లేవు కదా అంటారు ఫ్రెండ్స్. ఖర్చుల కోసం ఉంచమని తమ దగ్గర ఉన్న కొన్ని డబ్బులు ఇస్తారు ప్రేమ్ కు. వాళ్లే ప్రేమ్ ను ఆదుకుంటారు.
మరోవైపు దివ్య వెక్కి వెక్కి ఏడుస్తూ ఉంటుంది. జ్యూస్ పట్టుకొని తన దగ్గరికి వెళ్లిన లాస్య.. తనతో మాట్లాడటానికి ప్రయత్నిస్తుంది. కానీ.. దివ్య వద్దు ఆంటి.. నన్ను విసిగించకండి ప్లీజ్ అంటుంది దివ్య. నేను నీ కన్నతల్లిని కాకపోయినా తల్లి స్థానంలో ఉన్న వ్యక్తిగా నీ బాధ అర్థం చేసుకోగలను అంటుంది లాస్య.
నీతో బలవంతంగా జ్యూస్ తాగించడం కోసం నేను రాలేదు.. నీ ఆవేదన పంచుకోవడం కోసం వచ్చా. నీకు నా సపోర్ట్ ఉందని చెప్పడం కోసం వచ్చా. నిజం దివ్య.. నన్ను నమ్ము అంటుంది లాస్య. దివ్యను ఓదార్చినట్టు నటించి తన బుట్టలో వేసుకుంటుంది.
నువ్వు పస్తులు ఉండటం వల్ల ఉపయోగం లేదు. నా కోసం కాకపోయినా నువ్వు ఇష్టపడే ప్రేమ్ అన్నయ్య కోసం అయినా ఈ జ్యూస్ తాగు అంటుంది లాస్య. దీంతో మీ మీద నమ్మకంతో జ్యూస్ తాగుతాను ఆంటి అని జ్యూస్ తాగుతుంది దివ్య. తను జ్యూస్ తాగడం చూసి సంతోషిస్తుంది తులసి.
వెళ్లి ఈ విషయాన్ని రాములమ్మకు చెబుతుంది తులసి. దివ్య జ్యూస్ తాగింది అని సంతోషపడుతుంది. ఆ పని చేయిస్తూ లాస్య.. దివ్యమ్మ మనసులో ఎంత విషం నాటిందో మీరు పట్టించుకోరా తులసమ్మ అంటుంది రాములమ్మ. దీంతో తను చిన్నపిల్ల.. ఇప్పుడే తనకు ఏం తెలుసు అంటుంది తులసి.
మరోవైపు డబ్బులు తీసుకొని ఇంటికి వస్తాడు ప్రేమ్. ఫ్రెండ్స్ ఆదుకున్నారని చెబుతాడు ప్రేమ్. ఇద్దరూ కాసేపు సరదాగా గడుపుతారు. నీ సంతోషం కోసం ఏమైనా చేస్తాను అని దివ్యకు ప్రామిస్ చేస్తుంది లాస్య. దీంతో థాంక్యూ సోమచ్ ఆంటి.. లవ్యూ ఆంటి అంటుంది దివ్య.
నువ్వు ఎప్పుడూ ఇలాగే నవ్వుతూ ఉండాలి దివ్య అంటుంది లాస్య. మీరు నాకు తోడుగా ఉంటే నేను ఎప్పుడూ నవ్వుతూనే ఉంటాను అంటుంది దివ్య. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.
Montha Cyclone Effect | ఏపీలో ‘మొంథా’ తుఫాన్ ప్రభావం తీవ్రంగా కనిపిస్తోంది. వాతావరణ శాఖ హెచ్చరికలతో రాష్ట్రవ్యాప్తంగా టెన్షన్…
Dry Eyes | ఈ రోజుల్లో “కళ్ళు పొడిబారడం” (Dry Eyes) సమస్య ఎంతో సాధారణమైపోయింది. మొబైల్, ల్యాప్టాప్ లేదా…
Lemon Seeds | నిమ్మరసం తీసిన తర్వాత గింజలు చేదుగా ఉంటాయని చాలా మంది వాటిని పారేస్తారు. కానీ ఆరోగ్య…
Lemons | మూడు బాటల దగ్గర నడవకూడదు, రోడ్డుపై వేసిన నిమ్మకాయలు, మిరపకాయలు తొక్కకూడదు, పసుపు–కుంకుమ కలిపిన వస్తువులపై దాటకూడదు—ఇలాంటి…
Dog | నిజామాబాద్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. బాల్కొండ మండలానికి చెందిన గడ్డం లక్ష్మణ (10) అనే బాలిక కుక్క…
Brinjal | వంకాయ... మన వంటింట్లో తరచూ కనిపించే రుచికరమైన కూరగాయ. సాంబార్, కూరలు, వేపుడు ఏ వంటకంలో వేసినా…
Health Tips | చిన్న పిల్లల నుంచి పెద్దవారికి సీతాఫలం అనేది ప్రత్యేకమైనది. ఎండాకాలంలో మామిడి పళ్ల కోసం ప్రజలు…
Peanuts Vs Almonds | బరువు తగ్గాలనే లక్ష్యంతో ఉన్నవారు సాధారణంగా తక్కువ క్యాలరీల ఆహారాన్ని ఎంచుకుంటారు. అయితే, ఆరోగ్యకరమైన…
This website uses cookies.