Sudigali Sudheer Emotional Comments on Rashmi Gautam
Sudigali Sudheer : రష్మీ గౌతమ్.. సుడిగాలి సుధీర్.. ఈ బుల్లితెర జంటకు బీభత్సమైన ఫాలోయింగ్ ఉంది. జబర్దస్త్, ఢీ మాత్రమే కాదు అప్పుడప్పుడూ వచ్చే స్పెషల్ ఈవెంట్లలోనూ వీరిద్దరిదే సందడి ఉంటుంది. రష్మీ, సుధీర్ జోడి కోసమే చాలా మంది ఈ కార్యక్రమాలు చూస్తుంటారు. ఈ జోడి ఓ రేంజ్ లో ఎంటర్టైన్ చెస్తోంది మరి. కాగా వీరి లవ్ స్టోరీలో నిజమెంతో తెలియదు కానీ.. రష్మీ, సుధీర్ ఒకరిపై మరొకరు ఎన్నో సార్లు తమ ప్రేమను వ్యక్తం చేసుకున్నారు. వీరి లవ్ స్టోరికి మాత్రం తెలుగు ఆడియెన్స్ ఫిదా అయిపోయారు. ఢీ షోలో జంట చేసే సందడి అంతా ఇంత కాదు. యాంకర్ ప్రదీప్ వీరపై వేసే పంచులు అంతే అద్భుతంగా పేలుతాయి. జడ్జీలు సైతం రష్మీ, సుధీర్ లపై పంచులు విసురుతారు.
జబర్దస్త్ కామెడీ షోలో ఎంతో పాపులారిటీ ఉన్న జోడి ఎవరు అంటే ఏ మాత్రం ఆలోచించకుండా రష్మీ సుధీర్ జంట అని అంతా టక్కున చెప్పేస్తారు. బుల్లితెరపై ఎంతో పాపులారిటీ సంపాదించుకున్న రష్మీ సుధీర్ స్క్రీన్ పై కనిపించారంటే అభిమానులకు పూనకాలు వస్తాయి. అటు సోషల్ మీడియాలో కూడా వీళ్లకు మంచి ఫాలోయింగ్ ఉంది.మల్లెమాల ఏ ఈవెంట్ నిర్వహించిన అందులో రష్మీ సుధీర్ కనిపిస్తూ ప్రేక్షకులను సందడి చేస్తుంటారు.ఈ క్రమంలోనే ఈ కార్యక్రమంలో భాగంగా పలుసార్లు రష్మీ సుధీర్ కు పెళ్లి అంటూ వార్తలు అటు సోషల్ మీడియాలో వినిపిస్తూనే ఉన్నాయి. అయితే ప్రస్తుతం మల్లెమాల సైతం స్పెషల్ ఈవెంట్లకు సుధీర్‌ను దూర పెడుతున్నట్లు తెలుస్తోంది. ఇటీవల ఈటీవీలో మల్లెమాల చేస్తోన్న హోళీ ఈవెంట్ ప్రోమో వచ్చింది.
Sudigali Sudheer and Rashmi Gautam jump star maa holi thaggedele 2022 event
రంగ్ దే అంటూ వచ్చిన ఈ ఈవెంట్‌లో సుధీర్ కనిపించలేదు. సుధీర్ ఎక్కడా? అంటూ అతని ఫ్యాన్స్ కామెంట్లతో మల్లెమాల మీద ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు.అయితే ఇప్పుడు ఈ లాంటి ఈవెంటే స్టార్ కూడా అందిస్తోంది. ఈ హోళికి అందరికీ సర్ ప్రైజ్ ఇచ్చింది. సుధీర్ రష్మీ జోడిని స్టార్ మాకు తీసుకొచ్చేశారు. తగ్గేదేలే అంటూ యాంకర్ రవి, రష్మీ హోస్ట్ చేస్తోన్న ఈ షోలో సుధీర్ కనిపించాడు. సుధీర్, రష్మీ ఎమోషనల్ బాండింగ్‌ను బాగానే ఎలివేట్ చేశారు. రష్మీ కోసం సుధీర్ పాట పాడటం, రష్మీ దిష్టి చుక్క పెట్టేయడం అన్నీ కూడా బాగున్నాయి.ఈ దెబ్బతో మల్లెమాల చేస్తోన్న హోళీ పండుగ ఈవెంట్‌కు అంతగా క్రేజ్ ఉండకపోవచ్చునని టాక్ . మొదటి సారిగా స్టార్ మా ఈవెంట్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. కాగా సోషల్ మీడియాలో ఈ ఈవెంట్ రికార్డులు క్రియేట్ చేస్తుందని సుధీర్ ఫ్యాన్స్ కామెంట్లు పెడుతున్నారు.
Allu Business Park faces GHMC Notice : ప్రముఖ సినీ నిర్మాత, గీతా ఆర్ట్స్ అధినేత అల్లు అరవింద్‌కు…
Malla Reddy Key Comments on CBN : తెలంగాణ రాజకీయాల్లో ఎమ్మెల్యే మల్లారెడ్డి మరోసారి హాట్ టాపిక్‌గా మారారు.…
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత (Kavitha) హైదరాబాద్‌లో జరిగిన కాళోజీ జయంతి, చాకలి ఐలమ్మ వర్థంతి కార్యక్రమంలో ముఖ్య…
Nepal Crisis Deepens : నేపాల్‌లో జెన్-జెడ్ యువత ఆందోళనలు దేశ రాజకీయాలను కుదిపేశాయి. సోషల్ మీడియా నిషేధం, అవినీతి…
Apple Event | ఐఫోన్ అభిమానులు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న క్షణం ఆసన్నమైంది. ప్రపంచ టెక్ దిగ్గజం ఆపిల్ తన…
Group 1 | గ్రూప్–1 మెయిన్స్ పరీక్షలో జరిగిన అవకతవకలపై పలు అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించిన నేపథ్యంలో, తెలంగాణ హైకోర్టు…
Rains | తెలుగు రాష్ట్రాల ప్రజలకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం కీలక హెచ్చరికను జారీ చేసింది. బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనున్న…
Allu Family |సినీ నటుడు అల్లు అర్జున్ కుటుంబానికి చెందిన ప్రముఖ నిర్మాణం ‘అల్లు బిజినెస్ పార్క్’ ఇప్పుడు వివాదాస్పదంగా…
This website uses cookies.