Priyamani : అల్లు అర్జున్ సరసన ప్రియమణికి అవకాశం..?

Authored By vamana sai | The Telugu News | Published on: April 13, 2022, 3:30 pm

Priyamani: ఇక ప్రియమణి బుల్లితెరకే పరిమితమా..? ప్రస్తుతం ఆమె అభిమానులు ఇదే మాట్లాడుకుంటున్నారట. ఫస్ట్ ఇన్నింగ్స్‌లో ప్రియమణి మంచి హిట్స్ సినిమాలు చేసింది. పరుత్తి వీరన్ సినిమాతో ఏకంగా నేషనల్ అవార్డ్ అందుకుంది. తన నేచురల్ పర్ఫార్మెన్స్‌తో మాత్రమే కాకుండా అందాల ఆరబోతతో బికిని సాంగ్స్‌తో ఒక ఊపు ఊపేసింది. తెలుగులో జగపతి బాబు, గోపీచంద్, తరుణ్, నితిన్, ఎన్.టి.ఆర్ లాంటి హీరోలతో సినిమాలు చేసి స్టార్ హీరోయిన్‌గా బాగానే వెలిగింది. ఆ తర్వాత పెళ్లి చేసుకున్న ఆమె కొంతకాలం సినిమాలకు దూరంగా ఉండి మళ్ళీ బుల్లితెర షోస్‌తో సందడి మొదలు పెట్టింది.

ఇక నారప్ప, విరాట పర్వం సినిమాలతో మళ్ళీ టాలీవుడ్‌లో హీరోయిన్‌గా రీ ఎంట్రీ ఇచ్చిన ప్రియమణి సత్తా చాటాలనుకుంది. నారప్ప సినిమాతో వెంకీ సరసన నటించి హిట్ అందుకుంది. ఇక రానా, సాయి పల్లవిలతో చేసిన విరాట పర్వం సినిమా రిలీజ్ కాకుండానే ఆగిపోయింది. దాంతో ప్రియమణి ఆశించినంతగా సెకండ్ ఇన్నింగ్స్ సాగడం లేదు. ఆమెకు సీనియర్ హీరోల సరసన నటించే అవకాశాలు వస్తే మాత్రం గ్యారెంటీగా కొన్నేళ్ళు వరుసగా సినిమాలు చేస్తూ క్రేజ్ తెచ్చుకుంటుందనడంలో సందేహం లేదు. గ్లామర్ పరంగా పర్ఫార్మెన్స్ పరంగా ప్రియ కొత్తగా ప్రూవ్ చేసుకోవాల్సింది కూడా ఏమీ లేదనే చెప్పాలి.

will priyamani-get chance with allu arjun

will priyamani-get chance with allu arjun

Priyamani: ఇక ప్రియమణి బుల్లితెరకే పరిమితమా..?

ఆమె అందం, గ్లామర్ యంగ్ హీరోలకు కూడా సూటవుతుంది. ఇక సీనియర్ హీరోల పక్కనైతే ఆలోచించాల్సిన పనే లేదు. ఆ మధ్య ఢీ షోలో అల్లు అర్జున్ సరసన నటించాలనే కోరిక కూడా బయటపెట్టిన ప్రియమణికి అందరి ముందు ఆయనతో ఛాన్స్ వస్తే తప్పకుండా చేద్దాం..పైగా ఇప్పుడు కాస్త సన్నబడి నాజూగ్గా, క్యూట్‌గా తయారయ్యావని కితాబిచ్చాడు. ఈ కామెంట్స్ చూసి అందరూ అల్లు అర్జున్ సరసన ప్రియమణికి అవకాశం దక్కడం గ్యారెంటీ అని కూడా చెప్పుకున్నారు. కానీ, ఇప్పుడు మాత్రం ఆ ఊపు కనిపించడం లేదు. ప్రస్తుతం చేస్తున్న బుల్లితెర షోలకే ఆమె పరిమితం అయ్యేలా కనిపిస్తోంది.

vamana sai

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp