Janaki Kalaganaledu : మూడో రౌండ్ లో రామా గెలుస్తాడా? తన పాయసం అందరూ తాగుతారా? జ్ఞానాంబ ఏం చేస్తుంది?
Janaki Kalaganaledu : జానకి కలగనలేదు సీరియల్ ఈరోజు ప్రసారం కాదు. తిరిగి సోమవారం ప్రసారం అవుతుంది. జానకి కలగనలేదు సీరియల్ సోమవారం 13 జూన్ 2022 శనివారం ఎపిసోడ్ 321 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. జ్ఞానాంబ.. చెఫ్ పోటీలకు రావడంతో రామాకు చాలా సంతోషం వేస్తుంది. నువ్వు వచ్చావు కదా.. ఇక నాకు కంగారు ఏం లేదు. నువ్వు సరిగ్గా సమయానికి వచ్చావు. పోటీలలో ఇష్టమైన వంట చేయమని చెప్పారు. ఏం చేయాలో తేల్చుకోలేకపోయాను. ఏం చేయాలో నాకు చెప్పు అమ్మ అంటాడు. దీంతో మీకు చిన్నప్పుడు సిరిధాన్యాలతో వంట చేసేవాడిని. నీకు గుర్తుందా. అది నువ్వు కూడా ట్రై చేసేవాడివి. నువ్వు ఆ సిరిధాన్యాలతో వంట చేయి. ఆ సిరిధాన్యాలు పాత కాలపు జీవితాలలో ఒక జీవితం కాబట్టి.. అందరి దృష్టిని ఆకర్షిస్తుంది అని చెబుతుంది జ్ఞానాంబ. దీంతో అలాగే అమ్మ.. అంటాడు రామా.
మరోవైపు పోటీ ప్రారంభం అవుతుంది. రామా సిరిధాన్యాలతో పాయసం చేస్తాడు. అక్కడికి వచ్చే సందర్శకులు ఎవరి వంటలను అయితే ఎక్కువగా కొనుగోలు చేస్తారో.. ఎవరి దగ్గర ఎక్కువ డబ్బు ఉంటుందో వాళ్లే ఈ రౌండ్ లో విజేతలు అని యాంకర్ చెబుతుంది. మరోవైపు వంటలు పూర్తయ్యాక.. అందరూ స్టాల్స్ వద్ద తమ వంటలతో రెడీగా ఉంటారు. టూరిస్టు వాళ్ల కోసం ఎదురుచూస్తుంటారు. ఒక్కొక్కరుగా టూరిస్టులు అక్కడికి వస్తారు. కానీ.. ఎవ్వరూ రామచంద్ర దగ్గర ఉన్న పాయసాన్ని తాగరు. అతడు మొక్క జొన్న పాయసం తాగండి.. బాగుంటుంది అన్నా కూడా ఎవ్వరూ అతడిని పట్టించుకోరు. దీంతో రామచంద్రాకు ఏం చేయాలో అర్థం కాదు.
Janaki Kalaganaledu : ఉచితంగా ఇవ్వండి అని రామాకు సలహా ఇచ్చిన జానకి
దీంతో రామాకు ఉచితంగా పాయసం అని చెప్పండి అని జానకి సలహా ఇస్తుంది. చివరకు ఉచితం అని చెప్పినా కూడా ఒక్కరు కూడా రామా పాయసాన్ని తాగరు. దాని వాసన చూసి బాగోలేదు అని తాగకుండా వెళ్లిపోతుంటారు. దీంతో రామాకు టెన్షన్ స్టార్ట్ అవుతుంది.
చివరకు ఒక పిల్లాడు వచ్చి తాగుతాడు. తన తల్లికి కోపం వచ్చి దాన్ని విసిరికొడుతుంది. ఇది పిల్లలకు మంచిది అని చెబుతాడు. దీంతో అందులో ఏం వేశారో కొంచెం చెప్పండి అని అడుగుతుంది. దీంతో అందులో మొక్కజొన్న, సిరిధాన్యాలు, పాలు, బెల్లం.. బలమైనవి అన్నీ వేశాను అంటాడు రామా.
దీంతో ఆ మహిళతో పాటు తన భర్త కూడా ట్రై చేస్తాడు. ఇద్దరూ బాగుంది అంటారు. పిల్లాడు కూడా తాగుతాడు. అది రుచి చూసిన తర్వాత అతడికి 500 ఇస్తారు. దీంతో రామా సంతోషిస్తాడు. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.