will soundarya finds sourya in karthika deepam
Karthika Deepam : కార్తీక దీపం సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ ఈరోజు ప్రసారం కాదు. తిరిగి సోమవారం ప్రసారం అవుతుంది. 28 మార్చి 2022 సోమవారం ఎపిసోడ్ 1311 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఆనంద రావుకు హార్ట్ ఎటాక్ వచ్చిందని తెలిసి వెంటనే సత్యం హాస్పిటల్ కు వెళ్లేందుకు ప్రయత్నిస్తాడు. కారు ప్రేమ్ తీసుకెళ్లడంతో శౌర్య ఆటోలో ఆసుపత్రికి వస్తాడు. మరోవైపు నిరుపమ్.. ఆనంద రావుకు టెస్ట్ చేసి నీకే సమస్యా లేదు. నువ్వు ఎక్కువగా ఆలోచించకూడదు అని చెబుతాడు. ఇంతలో ప్రేమ్ ఏదేదో మాట్లాడుతాడు. దీంతో సౌందర్యకు చిరాకు వేస్తుంది.
will soundarya finds sourya in karthika deepam
మరోవైపు ఇంతలో సత్యం ఆసుపత్రికి వస్తాడు. అక్కడ మళ్లీ ప్రేమ్ తో గొడవ పెట్టుకుంటుంది శౌర్య. తన కాలర్ పట్టుకుంటే నెట్టేస్తాడు ప్రేమ్. దీంతో వెళ్లి నిరుపమ్ మీద పడుతుంది. ఆ తర్వాత ప్రేమ్ తో తనకు ఉన్న పరిచయం గురించి చెబుతుంది శౌర్య. ఆ తర్వాత శౌర్య.. నిరుపమ్ కు బాగా నచ్చుతుంది. అమ్మాయిలు ఇలాగే ఉండాలి అంటాడు. ఇంతలో హిమ కూడా వస్తుంది. హిమను చూసి.. హేయ్ తింగరి.. నువ్వేంటి ఇక్కడ అంటుంది శౌర్య.
తింగరి ఏంటి అంటూ ఆశ్చర్యపోతుంది హిమ. మరోవైపు అమ్మాయి అంటే హిమలా ఉండాలి కానీ.. ఇలా కాదని ప్రేమ్ అంటాడు. నిరుపమ్ మాత్రం.. అమ్మాయిలు వాళ్ల మనసులో ఏం దాచుకోకుండా ఇలాగే ఉండాలి అంటాడు నిరుపమ్. ఆ తర్వాత ఆనంద రావును చూడటానికి వెళ్తాడు సత్యం.
ఆయన వెళ్లగానే మళ్లీ కొట్లాటకు సిద్ధమవుతారు ప్రేమ్, శౌర్య. తర్వాత శౌర్య పార్కింగ్ దగ్గరికి వెళ్తుంది. అక్కడ ల్యాబ్ రిపోర్ట్స్ తేవడానికి వెళ్తుంది సౌందర్య. కానీ.. శౌర్య.. సౌందర్యను చూడదు. రిపోర్ట్స్ తీసుకొని సౌందర్య అక్కడి నుంచి వెళ్లిపోతుంది.
తర్వాత మంచినీళ్లు తాగేందుకు శౌర్య పైకి వస్తుంది. కట్ చేస్తే.. చనిపోయిన మా అమ్మానాన్నల పేర్ల మీద అన్నదానం చేయించండి అని గుడిలోకి వెళ్లి పూజారికి చెబుతుంది. దానికి కావాల్సిన డబ్బులను ఇస్తుంది. ఇంతలో కారులో సౌందర్య అదే గుడికి వస్తుంది.
అంతలోనే శౌర్య అక్కడి నుంచి బయటికి వెళ్తుంది. సౌందర్య వచ్చి.. కోవెలమూడి కార్తీక్, కోవెలమూడి దీప అనే మా కొడుకు కోడలు పేరు మీద అన్నదానం జరిపించాలి అని పంతులు గారికి చెబుతుంది. వాళ్ల మా కొడుకు, కోడలు అని చెబుతుంది సౌందర్య.
దీంతో అదేంటమ్మా.. ఇప్పుడే ఓ అమ్మాయి అవే పేర్ల మీద అన్నదానానికి రసీదు ఇచ్చి వెళ్లింది అని చెబుతాడు. దీంతో సౌందర్య షాక్ అవుతుంది. బోర్డు కూడా చూపిస్తాడు. అక్కడ కోవెలమూడి కార్తీక్, కోవెలమూడి దీప అని రాసి ఉంటుంది.
దీంతో షాక్ అవుతుంది సౌందర్య. అంటే.. శౌర్య ఇక్కడికి వచ్చిందా అని అనుకుంటుంది. శౌర్య కోసం వెతకడం ప్రారంభిస్తుంది. కానీ.. శౌర్య ఎక్కడా కనిపించదు. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.
Nithin : టాలీవుడ్‌లో ప్రస్తుతం ఓ ఆసక్తికరమైన చర్చ సాగుతోంది. నితిన్ నటించిన తాజా చిత్రం ‘తమ్ముడు’ బాక్సాఫీస్ వద్ద…
Healthy Street Food : రోడ్డు పక్కన ఫుట్పాత్ పైన కొందరు వ్యాపారులు లాభాల కోసం కక్కుర్తి పడి ప్రాణాలతో…
Lucky Bhaskar Sequel : మలయాళ స్టార్ దుల్కర్ సల్మాన్ హీరోగా, దర్శకుడు వెంకీ అట్లూరి తెరకెక్కించిన సూపర్ హిట్…
Jaggery Tea : వర్షా కాలం వచ్చిందంటేనే అనేక అంటూ వ్యాధులు ప్రభలుతాయి. మరి ఈ వర్షాకాలంలో వచ్చే ఈ…
Bonalu In Telangana : ప్రతి సంవత్సరం కూడా ఆషాడమాసం రాగానే తెలంగాణలో పండుగ వాతావరణం నెలకొంటుంది. తెలంగాణ నేల…
Poco M6 Plus : పోకో (Poco) సంస్థ ఈ సంవత్సరం అనేక స్మార్ట్‌ఫోన్లను మార్కెట్లోకి విడుదల చేస్తూ, వినియోగదారులను…
Atchannaidu : శ్రీకాకుళం జిల్లా 80 అడుగుల రోడ్డులో పౌర సరఫరాల సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సిఎన్‌జి గ్యాస్…
Ration : ఒకప్పుడు రేషన్ తీసుకోవాలంటే రేషన్ షాపుకెళ్లి, కార్డు చూపించి మ్యానువల్‌గా సంతకాలు పెట్టించి సరుకులు తీసుకోవాల్సి వచ్చేది.…
This website uses cookies.