
Will Tollywood step in for heroine Tabu remuneration
Tabu : సీనియర్ స్టార్ హీరోయిన్ టబు అంటే టాలీవుడ్ మేకర్స్ దడుసుకుంటున్నారా..? ఎందుకు అంటే ఆమె రెమ్యునరేషన్ అని టాక్ వినిపిస్తోంది. ఒకానొక దశలో టబు స్టార్ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగారు. తెలుగులో నాగార్జున సరసన నిన్నే పెళ్లాడతా, వెంకటేశ్ సరసన కూలీ నంబర్ 1 లాంటి బ్లాస్టర్స్‌లో నటించారు. అలాగే, ఆమె కెరీర్‌లో భారీ హిట్ సాధించింది..యువతకు కలరాణిగా మారిందీ అంటే వినీత్ – అబ్బాస్‌లతో కలిసి నటించిన ప్రేమ దేశం. ఈ సినిమాలు టబుకి సౌత్ సినిమా ఇండస్ట్రీలో అసాధారణమైన పాపులారిటీని తెచ్చాయి.
చిరంజీవి సరసన అందరివాడు, బాలకృష్ణ సరసన చెన్నకేశవ రెడ్డి లాంటి సినిమాలలో కూడా టబు మంచి పాత్రలు చేశారు. అయితే, టబుకి తెలుగులో కంటే ఎక్కువగా హిందీలో సినిమాలు చేసేందుకు ఆసక్తి చూపించారు. పక్కా హైదరాబాదీ అయిన కూడా బాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో ఉన్న పాపులారిటీ కారణంగా ఎక్కువగా ముంబైలోనే ఉంటున్నారు. చాలా లాంగ్ గ్యాప్ తర్వాత తెలుగులో అల వైకుంఠపురములో సినిమాలో నటించి ఆకట్టుకున్నారు. ఇప్పటికీ అదే అందం..అదే క్రేజ్. అందుకే, అల వైకుంఠపురములో సినిమా తర్వాత వరుసగా క్రేజీ చిత్రాలలో నటించే అవకాశాలు టబుకి వచ్చాయట.
Will Tollywood step in for heroine Tabu remuneration
కానీ, ఆమె తెలుగులో సినిమాలకు అంతగా ప్రాధాన్యత ఇవ్వడం లేదని తెలుస్తోంది. హిందీలోనే సినిమాలు చేస్తే వచ్చే మనిబులిటీ, క్రెడిబులిటీ వేరే లెవల్. ఆ రేమ్యునరేషన్ మన దగ్గర ఇవ్వడం లేదనేదే ఇన్‌సైడ్ టాక్. ఏదేమైనా మన ప్రేక్షకులు టబు తెలుగు సినిమాలు చేస్తే చూడాలని
ఆశపడుతున్నారు. కానీ, ఆమె ముంబై వదిలి రావడం లేదు. అంతేకాదు, హిందీలో కూడా టబు భారీగానే రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు. అయినా అక్కడ మార్కెట్ పెద్దది. భారీ రెమ్యునరేషన్ డిమాండ్ చేసిన ఇవ్వడానికి మేకర్స్ రెడీగా ఉన్నారు. అందుకే, హిందీలో కూడా ఆమె అడిగినంత రెమ్యునరేషన్ ఇస్తున్న వారికే డేట్స్ ఇస్తున్నారట. మరి మళ్లీ మన టాలీవుడ్ స్క్రీన్ మీద ఎప్పుడు కనిపిస్తారో చూడాలి.
Blue Berries | ఆకర్షణీయమైన నీలిరంగు, చక్కని రుచితో మనసును దోచుకునే బ్లూబెర్రీస్ కేవలం రుచికరమైనవి మాత్రమే కాదు, ఆరోగ్యానికి…
Remedies | శని గ్రహం జ్యోతిష్యశాస్త్రంలో అత్యంత శక్తివంతమైన గ్రహాల్లో ఒకటి. ప్రతి రెండున్నర సంవత్సరాలకు ఒకసారి శని గ్రహం…
Rukmini Vasanth | కన్నడ, తెలుగు, తమిళ భాషల్లో క్రేజ్ పెంచుకుంటున్న నటి రుక్మిణి వసంత్ తన పేరుతో జరుగుతున్న మోసాలపై…
Moringa Powder | తెలుగు వారి వంటింట్లో మునగ పేరు తెలియనివారు ఉండరంటే అతిశయోక్తి కాదు. మునగకాయలతో పులుసులు, కూరలు,…
Sesame Seeds | స్త్రీల ఆరోగ్యం పురుషులతో పోలిస్తే ఎక్కువ సవాళ్లను ఎదుర్కొంటుంది. హార్మోన్ల అసమతుల్యత, రక్తహీనత, ఎముకల బలహీనత,…
Heart Attacks | భారతదేశంలో గుండె సంబంధిత వ్యాధులు వేగంగా పెరుగుతున్నాయి. అధిక రక్తపోటు, కొలెస్ట్రాల్, ఒత్తిడి, అసమతుల్య ఆహారం, వ్యాయామం…
Triphala Powder | ఆయుర్వేదం ప్రకారం ప్రతి ఋతువుకి అనుకూలంగా ఆహార నియమాలు, మూలికా చిట్కాలు ఉంటాయి. అందులో త్రిఫల చూర్ణం…
Mole | జ్యోతిషశాస్త్రం మన శరీరంలోని చిన్నచిన్న లక్షణాలకూ ప్రత్యేక అర్థం ఇస్తుంది. అందులో ఒకటి పుట్టుమచ్చలు (Moles). పుట్టుమచ్చ…
This website uses cookies.