Naga Babu Tattoo On Kirak RP Heart Reveals in Party cheddham Pushpa
Naga Babu : జబర్దస్త్ షోలో చేసిన వారందరికీ నాగబాబు అంటే ప్రత్యేకమైన అభిమానం ఉండేది. మొదట్లో అయితే జబర్దస్త్ షో అంటే అంతా నాగబాబే అని అనుకునేవారు. ఆయనకు తెలియకుండా అక్కడేమీ జరగదు.. ఆయన అనుమతి లేనిదే ఎవ్వరూ అక్కడ అడుగుపెట్టరని అనుకునేవారు.అలా అందరికీ నాగబాబు అండగా ఉండేవాడు. రోజా ఉన్నా కూడా మొదట్లో అంత ఫేమస్ కాదు. అంత ఆధిపత్యాన్ని చాటే చోటు కూడా దొరకలేదు. అందుకు జబర్దస్త్ ఆర్టిస్టులంతా కూడా నాగబాబు విధేయులుగా ఉండేవారు. ఇక నాగబాబుతో సుధీర్, ఆది, గెటప్ శ్రీను, రాం ప్రసాద్ వంటి వారు మరింత క్లోజ్‌గా ఉండేవారు.
సుధీర్ అయితే డాడీ అంటూ తెగ సందడి చేసేవాడు. చమ్మక్ చంద్ర, కిరాక్ ఆర్పీ, అప్పారావు వంటి వారు ఎక్కువగా తమ ప్రేమను చూపించకపోయినా కూడా విధేయులుగా ఉండేవారు. అలా నాగబాబు కోసం ఏమైనా చేసేందుకు రెడీ అని చెప్పేవారు. కానీ తీరా నాగబాబు జబర్దస్త్ నుంచి బయటకు వెళ్లి.. అదిరింది అనే కొత్త షోను పెడితే.. సుధీర్, ఆది వంటి వారు హ్యాండ్ ఇచ్చారు. వారంతా అగ్రిమెంట్ల వల్ల రాలేకపోయారని టాక్ వచ్చింది. కానా నాగబాబు వెంట మాత్రం చమ్మక్ చంద్ర, కిరాక్ ఆర్పీ వంటి వారు వచ్చేశారు. మరీ ముఖ్యంగా కిరాక్ ఆర్పీకి నాగబాబు అంటే మరీ పిచ్చి. తన కొత్త సినిమా ప్రారంభోత్సవానికి కూడా నాగబాబునే పిలిచాడు.
Naga Babu Tattoo On Kirak RP Heart Reveals in Party cheddham Pushpa
నాగబాబుకు చెప్పకుండా ఏ పని కూడా చేయడు. కానీ నాగబాబుకి తెలియకుండా కిరాక్ ఆర్పీ ఓ పని చేశాడు. అది తాజాగా బయటకు వచ్చింది. ఆ విషయాన్ని సుధీర్ స్టేజ్ మీద బయటపెట్టేశాడు. కిరాక్ ఆర్పీకి కొంచెం పిచ్చి అందుకే ఆ పేరు పెట్టుకున్నాడు అని సుధీర్ చెబుతాడు. ఎంత ప్రేమ అంటే.. ప్రేమిస్తే కూడా అదే రేంజ్‌లో ప్రేమిస్తాడు.. మీ పేరుని గుండెల మీద పచ్చబొట్టు పొడిపించుకున్నాడు.. అని కిరాక్ ఆర్పీ గురించి సుధీర్ చెప్పేశాడు. అలా చెప్పడంతో నాగబాబు ఆశ్చర్యపోయాడు. నాకు ఇంత వరకు చెప్పలేదు కదరా? అని అనేశాడు. కిరాక్ ఆర్పీ గుండెల మీద తన పేరు చూసుకుని ఎమోషనల్ అయ్యాడు నాగబాబు.
PM Kisan : పీఎం కిసాన్ రైతుల కోసం ఆగస్టు 2న 20వ విడత విడుదల అయింది. యూపీలోని వారణాసి…
Dharmasthala : కర్ణాటకలోని ధర్మస్థల మృతదేహాల మిస్టరీని ఛేదించేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) రంగంలోకి దిగింది. నేత్రావతి నది…
Gudivada Amarnath : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మాటల యుద్ధం కొనసాగుతోంది. తాజాగా వైసీపీ మాజీ మంత్రి గుడివాడ అమర్‌నాథ్ ముఖ్యమంత్రి…
Annadata Sukhibhava : ఆంధ్రప్రదేశ్‌లో రైతన్నలకు శుభవార్త! ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లా దర్శి మండలం వీరాయపాలెంలో 'అన్నదాత…
Eyebrows Risk : ఈరోజుల్లో ప్రతి ఒక్కరు అందం కోసం బ్యూటీ పార్లర్ చుట్టూ అమ్మాయిలు తెగ తిరిగేస్తూ ఉంటారు.…
Monsoon Season : సాధారణంగా వర్షాకాలం వచ్చిందంటే చాలా మంది వేడి నీళ్లతో స్నానం చేయాలని హిటర్ వాడుతుంటారు. చలికాలంలో…
Samudrik Shastra : ప్రస్తుత కాలంలో అమ్మాయిలు కొంతమంది కడుపు మీద వెంట్రుకలు ఉంటే చాలా బాధపడిపోతుంటారు. పొట్ట మీద…
WDCW Jobs : తెలంగాణ మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ (WDCW) నుండి నిరుద్యోగులకు శుభవార్త అందింది. చైల్డ్…
This website uses cookies.