will tulasi attend client meeting in intinti gruhalakshmi
Intinti Gruhalakshmi : ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ ఈరోజు ప్రసారం కాదు. తిరిగి సోమవారం ప్రసారం అవుతుంది. సోమవారం, 22 ఆగస్టు 2022, ఎపిసోడ్ 717 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. నందు, సామ్రాట్ ఇద్దరూ ఫుల్లుగా తాగి రచ్చ రచ్చ చేస్తారు. హోటల్ లో డ్యాన్స్ చేసి రచ్చ చేస్తారు. దీంతో వీళ్లను తీసుకొని హోటల్ రూమ్ కు వస్తారు లాస్య, తులసి. అయినా కూడా హోటల్ లో రూమ్ కు వెళ్లకుండా డ్యాన్సులు చేస్తూ తెగ ఇబ్బంది పెడతారు. దీంతో తులసికి చాలా విసుగు వస్తుంది. వీళ్లకు పెరుగు తాగించాలని తీసుకురావడానికి లాస్య, తులసి వెళ్లినప్పుడు తులసి నా భార్య అని సామ్రాట్ కు చెబుతాడు నందు. తనంటే నీకు ఇష్టమా అని అడుగుతాడు. దీంతో అవును.. తులసి గారు అంటే నాకు చాలా ఇష్టం అని అంటాడు సామ్రాట్. కానీ.. వద్దు.. తనను పెళ్లి చేసుకోకు అంటాడు. నేను తనతో వేగలేకపోయాను. తనంటే నాకు అస్సలు ప్రేమ రాలేదు అని అంటాడు నందు. అవునా అంటాడు సామ్రాట్.
will tulasi attend client meeting in intinti gruhalakshmi
కట్ చేస్తే పరందామయ్యకు రాత్రిపూట గుండెలో నొప్పి వస్తుంది. దీంతో అనసూయ లేచి ఏమైంది అని అడుగుతుంది. చాతిలో నొప్పి వస్తోంది అంటాడు. అనసూయ టాబ్లెట్ ఇవ్వగానే వేసుకుంటాడు. కాస్త ఉపశమనం పొందుతాడు పరందామయ్య. మరోవైపు నందును లాస్య రూమ్ లోపలికి తీసుకెళ్లి పెరుగు తాగిస్తుంది. తులసి కూడా సామ్రాట్ ను అతి కష్టం మీద తన రూమ్ కు తీసుకెళ్లి పడుకోబెడుతుంది. ఇద్దరూ ఏమాత్రం సోయి లేకుండా నిద్రపోతారు. లాస్య కూడా అలాగే నిద్రపోతుంది. చివరకు ఉదయం లేచి తులసి క్లయింట్ మీటింగ్ కోసం వాళ్లను లేపినా కూడా ఎవ్వరూ లేవరు. దీంతో తులసికి ఏం చేయాలో తెలియక.. క్లయింట్ మీటింగ్ కు తను ఒక్కతే అటెండ్ అవుతుంది.
మరోవైపు ఉదయం 11.30 కు సామ్రాట్ నిద్ర లేస్తాడు.. టైమ్ చూసి షాక్ అవుతాడు. తులసి ఎటు వెళ్లింది అని అనుకుంటాడు. వెంటనే నందు రూమ్ కు వెళ్లి డోర్ కొడతాడు. లాస్య వచ్చి డోర్ తీస్తుంది. టైమ్ ఎంత అవుతుందో తెలుసా? క్లయింట్ మీటింగ్ ఉదయం 10 కే అంటాడు సామ్రాట్.
దీంతో అలాగే నిద్రపోయాం అంటారు నందు, లాస్య. మరి తులసి ఎక్కడికెళ్లింది అని అందరూ అనుకుంటుండగా.. అప్పుడే ఫైల్ పట్టుకొని అక్కడికి వస్తుంది తులసి. తనను చూసి షాక్ అవుతారు అందరూ. ఎక్కడికి వెళ్లావని అడుగుతారు. దీంతో క్లయింట్ మీటింగ్ వెళ్లి వస్తున్నా అని చెబుతుంది తులసి.
అసలు నువ్వెందుకు క్లయింట్ మీటింగ్ కు వెళ్లావంటూ నందు, లాస్య సీరియస్ అవుతారు. మిమ్మల్ని లేపితే ఎవ్వరూ లేవలేదు. దీంతో మీటింగ్ కు లేట్ అవుతోందని నేనే మీటింగ్ కు వెళ్లి మన ప్రపోజల్ చెప్పి వచ్చాను అంటుంది తులసి. ఇంతలో సామ్రాట్ కు క్లయింట్ ఫోన్ చేస్తాడు.
క్లయింట్ ఫోన్ చేయడంతో ప్రాజెక్ట్ డీల్ క్యాన్సిల్ చేయడానికి క్లయింట్ ఫోన్ చేస్తున్నాడేమో అని సామ్రాట్ అనుకుంటాడు. మరోవైపు పరందామయ్యకు మళ్లీ చాతిలో నొప్పి వస్తుంది. దీంతో తులసికి ఫోన్ చేసి చెబుతారు. దీంతో సామ్రాట్ కు అసలు విషయం చెబుతుంది తులసి. దీంతో నందు షాక్ అవుతాడు. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.
INDVs ENG : క్రీడా మైదానంలో అంకితభావం అంటే ఏమిటో మరోసారి చూపించారు ఇద్దరు ధీరులు. తమ వ్యక్తిగత ఆరోగ్యాన్ని…
Father : ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్ నగరంలో ఓ తండ్రి వినూత్నంగా నిరసన తెలుపుతూ దేశవ్యాప్తంగా దృష్టిని ఆకర్షించారు. ఆనంద్ సౌత్…
Niharika Konidela : మెగా ఫ్యామిలీకి చెందిన ముద్దుగుమ్మ నిహారిక కొణిదెల సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. నటిగా…
Galla Jayadev : మాజీ లోక్‌సభ సభ్యుడు, ప్రముఖ పారిశ్రామికవేత్త గల్లా జయదేవ్ తన రాజకీయ రీ ఎంట్రీపై కీలక…
India Vs England : లండన్‌లోని కెన్నింగ్టన్ ఓవల్ వేదికగా ఇంగ్లాండ్‌తో జరిగిన ఐదో టెస్టు మ్యాచ్‌లో భారత్ విజయం…
Atukulu Health Benefits : సాయంత్రం స్నాక్స్ లాగా అటుకులని తినడం కొందరికి అలవాటుగా ఉంటుంది. కానీ ఇందులో అనేక…
KAntara 3 : సెన్సేషనల్ హిట్‌గా నిలిచిన ‘కాంతార’ సినిమాతో దర్శకుడిగా, నటుడిగా తనదైన ముద్ర వేసిన రిషబ్ శెట్టి,…
Women : భారత జీవిత బీమా సంస్థ (LIC) మహిళల ఆర్థిక సాధికారతను లక్ష్యంగా చేసుకుని కొత్తగా ప్రవేశపెట్టిన ‘బీమా…
This website uses cookies.