with out allu arjun and rashmika mandanna pushpa 2 pooja ceremony done
Pushpa 2 : అల్లు అర్జున్.. రష్మిక మందన్నా జంటగా సుకుమార్ దర్శకత్వంలో రూపొంది గత ఏడాది చివర్లో వచ్చిన పుష్ప సినిమా ఎంతటి విజయాన్ని సొంతం చేసుకుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆ సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకోవడం ఒక ఎత్తు అయితే.. హిందీలో ఏకంగా వంద కోట్ల వసూళ్లను దక్కించుకోవడం మరో ఎత్తు. హిందీ ప్రేక్షకులకు విపరీతంగా నచ్చిన పుష్ప ను మరింత చేరువ చేసేందుకు గాను పుష్ప 2 ని హిందీ ప్రేక్షకలు కోసం అన్నట్లుగా స్క్రిప్ట్ రెడీ చేస్తున్నారు. ఈ ఏడాది ఆరంభంలో ఫిబ్రవరి లేదా మార్చిలో ప్రారంభం అవ్వాల్సిన సినిమా ను కాస్త చాలా ఆలస్యం చేసి ఎట్టకేలకు ప్రారంభించేందుకు సిద్ధం అయ్యారు.
సినిమా పూజా కార్యక్రమాలు నేడు మైత్రి మూవీస్ వారి ఆఫీస్ లో భారీ ఎత్తున నిర్వహించారు. అందుకు సంబంధించిన పూజా కార్యక్రమాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. పూజా కార్యక్రమాల్లో హీరో అల్లు అర్జున్ మరియు హీరోయిన్ రష్మిక మందన్నాలు పాల్గొనక పోవడం చర్చనీయాంశంగా మారింది. అల్లు అర్జున్ మరియు రష్మిక మందన్నాలు రాకపోవడంకు కారణం ఏంటీ.. వారు లేనప్పుడు ఎందుకు షూటింగ్ కార్యక్రమాలు పూజా కార్యక్రమాలు మొదలు పెట్టడంకు కారణం ఏంటీ అంటూ ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాలతో పాటు మీడియా సర్కిల్స్ లో ఎవరికి ఇష్టం వచ్చినట్లుగా వారు చర్చించుకుంటున్నారు. అల్లు అర్జున్ ప్రస్తుతం అమెరికా లో ఉన్నాడు.
with out allu arjun and rashmika mandanna pushpa 2 pooja ceremony done
ఆయన అక్కడ ఇండియాకి చెందిన స్వాతంత్య్ర వేడుకలను నిర్వహించేందుకు గాను వెళ్లాడు. అక్కడ జరిగిన వేడుకల్లో పాల్గొన్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. మరి రష్మిక మందన్నా ఎందుకు ఈ కార్యక్రమంలో పాల్గొనలేదు అంటూ కొందరు ప్రశ్నిస్తున్నారు. అల్లు అర్జున్ లేడు కనుక ఆమె ను పెద్దగా ప్రాముఖ్యత లేదు అనుకున్నారని కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అల్లు అర్జున్ ఇప్పటికే పుష్ప 2 సినిమా షూటింగ్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. షూటింగ్ ప్రారంభోత్సవంకు సమయం పడుతుంది. ఈ లోపు పూజా కార్యక్రమాలను మంచి రోజులు ఉన్నప్పుడు చేస్తే బాగుంటుందనే ఉద్దేశ్యంతో హీరో హీరోయిన్ లేని సమయంలో ఆ కార్యక్రమాలను సుకుమార్ చేయించాడట.
Dil Raju : ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మించన తమ్ముడు జూలై 4న విడుదల కానుంది. ఈ మూవీ…
Jio Recharge : జియో వినియోగదారుల కోసం అద్భుతమైన ఐడియల్ రీఛార్జ్ ప్లాన్ల ను ప్రకటించింది. ప్రస్తుతం, చాలా మంది…
Komatireddy Venkat Reddy : హరీష్ రావు ఎవరో తెలియదంటూ మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు…
Chandrababu : తెలుగు రాష్ట్రాల్లో నది నీటి ప్రాజెక్టులపై తాజాగా జరుగుతున్న చర్చలో బనకచర్ల ప్రాజెక్ట్ కీలకంగా మారింది. తెలంగాణ…
Prices : కేంద్ర ప్రభుత్వం గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ (జీఎస్టీ) స్లాబ్‌లలో పెద్ద ఎత్తున మార్పులు చేయాలని యోచిస్తోంది.…
Fish Venkat : తెలుగు చిత్ర పరిశ్రమలో తనదైన హాస్య విలన్ పాత్రలతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటుడు ఫిష్…
Ys Jagan : అసెంబ్లీ ఎన్నికల్లో చిత్తూ చిత్తుగా ఓటమి చవిచూసిన జగన్..ఇప్పుడు పూర్తిస్థాయిలో ప్రజల్లోకి వెళ్లాలని డిసైడ్ అయ్యాడు. ఐదేళ్లలో…
Former MLCs : తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి నిత్యం సొంత పార్టీ నేతలను ఏదొక సమస్య ఎదురవుతూనే ఉంటుంది. ముఖ్యంగా…
This website uses cookies.