Yadam Raju : జబరస్థ్ షోతో చాలా మంది వెలుగులోకి వచ్చారు. వారిలో కొందరికి మంచి పాపులారిటీ దక్కింది. ప్రముఖ జబర్దస్త్ కమెడియన్ యాదమ్మ రాజు జబర్ధస్త్ షోతో పాటు పలు షోలలో కనిపించి తెగ సందడి చేశాడు. ఆయనకి ఇప్పుడు విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అయితే యాదవ్ రాజ్ ఇప్పుడు షోస్‌లోనే కాదు సినిమాలలో కూడా చేస్తున్నాడు. ఆయన ప్రధాన పాత్రలలో కూడా పలు సినిమాలు రూపొందుతున్నాయి. అయితే తన తాజా చిత్రంకి సంబంధించి వెరైటీగా చేసిన ప్రమోషన్స్ అబాసుపాలయ్యేలా చేశాయి. ఇటీవల వారానికి నాలుగైదు సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. అయితే వాటిలో మంచి కంటెంట్ ఉన్న సినిమాలనే ఎక్కువ మంది ఆదరిస్తున్నారు. కంటెంట్ బాలేకపోతే మాత్రం తొక్కిపడేస్తారు. నిజాయితిగా సినిమా తీసినప్పుడు.. ప్రమోషన్స్ కోసం విచిత్ర ప్రయోగాలు చేయనక్కర్లేదు.
కంటెంట్ లేకుండా కక్కుర్తి పనులు చేస్తే లేని పోని ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తుంది. తాజాగా యాదమ్మ రాజు తన సినిమా ప్రమోషన్ కోసం చేసిన స్టంట్ అనేక ఇబ్బందులు తెచ్చిపెట్టింది. యాదమ్మ రాజుని మరియు అతని స్నేహితుడు హరిని పోలీసులు అరెస్ట్ చేసి 14 రోజుల కస్టడీకి తరలించారట. నన్ను పోలీసులు పట్టుకునిపోయారు స్టేషన్‌కి. ఏప్రిల్ ఫస్ట్‌కి ఒక ఇష్యూ అయ్యింది.. పోలీసులు అరెస్ట్ చేశారు. నిన్నటి నుంచి వార్తలు వచ్చాయి. నన్ను పోలీసులు ఎందుకు పట్టుకునిపోయారో ఏంటో.. కింద లింక్ క్లిక్ చేస్తే అర్ధం అవుతుంది’ అని వీడియోలో చెప్పుకొచ్చాడు యాదమ్మ రాజు.
అయితే వీడియో క్లిక్ చేస్తే అందులో తాను నటించిన ‘Who is My Daddy’ వెబ్ సిరీస్ ట్రైలర్ ఉంది. ఆయన చేసిన పని ‘Who is My Daddy’ వెబ్ సిరీస్ ప్రమోషన్ కోసం అని తెలిసి తెగ ట్రోల్ చేస్తున్నారు. కంటెంట్ ఉన్నవి తీస్తే ఇలాంటి చెత్త స్టంట్స్ చేయాల్సిన పనులు అక్కర్లేదు. నిజాయితీగా సినిమాలు లేదంటే వెబ్ సిరీస్‌లు తీయండి అంతే కాని జనాలని పిచ్చోళ్లని చేసే పనులు చేయకండని గట్టిగా వార్నింగ్ ఇస్తున్నారు. మరి దీనిపై యాదమ్మరాజు ఏం స్పందిస్తాడో చూడాల్సి ఉంది.
Passports : పాస్పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్రాజ్లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.