Home » Entertainment » Youngster Says I Love You Anchor Suma In Cash Program
Entertainment

Anchor Suma : అందరి ముందే సుమకు ప్రపోజ్ చేసిన కుర్రాడు… మామూలోడు కాదుగా…!

Authored By
Prahbas Gilakathula
The Telugu News | Published on: November 30, 2022, 3:40 pm
Advertisement

Anchor Suma : బుల్లితెర టాప్ యాంకర్ సుమ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తెలుగు అమ్మాయి కాకపోయినా , తెలుగు భాషను అవలీలగా మాట్లాడేస్తూ, ప్రోగ్రామ్స్ చేస్తూ తెలుగు సిని ఫంక్షన్లకు యాంకరింగ్ చేస్తూ అందరి తలలో నాలికలా మారింది. ఇక ఈమె లేకుండా ఏ సినీ ఫంక్షన్ జరగదు అనే చెప్పాలి. అలాగే ఆమె ఎప్పటినుండో చేస్తున్న క్యాష్ ప్రోగ్రామ్ కూడా సూపర్ హిట్ గా నిలిచింది. ఇక ఈ షో ద్వారా సినీ సెలబ్రిటీలను, సీరియల్ సెలబ్రెటీలను తీసుకువచ్చి వారితో ఆటలాడించి ప్రేక్షకులకు ఎంటర్టైన్మెంట్ ను అందిస్తుంది. ఇంకా సినీ ప్రమోషన్ లో భాగంగా చాలామంది స్టార్స్ ఈ షోలో పాల్గొనడం కూడా జరిగింది.

Advertisement

అయితే తాజాగా డిసెంబర్ 3న ప్రచారం కాబోతున్న క్యాష్ ప్రోగ్రామ్ కు సంబంధించినన ప్రోమో ఇటీవల విడుదలైంది. ఇక ఈ ప్రోగ్రామ్ కు గెస్ట్ లు గా ప్రభాస్ శీను,కమెడియన్ ప్రవీణ్,నటి హరితేజ, నటి హేమ ,పాల్గొనబోతున్నట్లు ప్రోమో ద్వారా క్లారిటీ వచ్చింది. ఇక ఈ కార్యక్రమంలో భాగంగా అనేక ఆటలను నిర్వహించిన సుమ తర్వాత క్యాష్ ఫిల్మ్ స్కూల్ అనే ప్రోగ్రామ్ నిర్వహిస్తున్నట్లుగా ప్రోమోలో చూపించడం జరిగింది. దీనిలో భాగంగా కమెడియన్ ప్రవీణ్ ను పిలిచి ఈయన లవ్ గురించి ఓ ఫిలిం, క్లాస్ తీయబోతున్నారంటూ ప్రోగ్రామ్ వీక్షించడానికి వచ్చిన ఓ స్టూడెంట్ ను స్టేట్ మీదకు పిలిచారు.

Youngster Says I Love You Anchor Suma in Cash Program

Advertisement

సరే పార్క్ లో ఒక అమ్మాయి వెయిట్ చేస్తుందంటూ సుమ తానే అమ్మాయిల వెళ్లి అక్కడ, నిలబడింది. ఇంతలో ప్రవీణ్ అమ్మాయి అన్నారు కదా ఆంటీ ఉందేంటి అంటూ కౌంటర్ వేశాడు. దీంతో ఒక్కసారి అందరూ పొట్ట చెక్కలు అయ్యేలా నవ్వుకున్నారు. ఆ తర్వాత స్టేట్ మీదకు వచ్చిన స్టూడెంట్ ను ప్రవీణ్ అమ్మాయి అక్కడ ఆటో కోసం చూస్తుంది ఆటో వచ్చేలోపు వెళ్లి ఐ లవ్ యు చెప్పు అని పంపిస్తాడు. వెంటనే ఆ కుర్రాడు వెళ్లి సుమ ఎదురుగా నిలుచుని మిమ్మల్ని ఎప్పటినుంచో ఫాలో అవుతున్నాను సుమ గారు మీరంటే నాకు చాలా ఇష్టం అని చెప్పడంతో, దానికి సుమ నువ్వు మా అబ్బాయి క్లాస్మేట్ కదు అంటూ కౌంటర్ వేసింది. దీంతో మరోసారి వేదిక నవ్వులతో నిండిపోయింది.

Prahbas Gilakathula

Author Bio Info : Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com
Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి