Kodali Nani : ఈసారి వైసీపీ ప్ర‌భుత్వం వ‌స్తే నాకు మంత్రి ప‌ద‌వి వ‌ద్దు.. డ‌బ్బులు ఇస్తే చాలు.. కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు..!

Kodali Nani  : తెలుగు రాష్ట్రాలలో కొడాలి నానికి విపరీతమైన ఫాలోయింగ్ ఉంటుంది. అందుకు కారణం మాస్ లీడర్ కావడమే. ఒకటి కాదు రెండుసార్లు కాదు ఏకంగా నాలుగు సార్లు గెలిచారు. పార్టీలు వేరైనప్పటికీ వరుసగా నాలుగు సార్లు ఎన్నికల్లో గెలిచి గుడివాడను కొడాలి నాని తన అడ్డాగా మలచుకున్నారు. అయితే ఇక రాజకీయాలు చాలు ఓపిక వయసు లేదంటూ కొడాలి నాని చెబుతున్నారు. 2024 ఎన్నికలు ఫైనల్ అని, 2029 ఎన్నికల్లో పోటీ చేయనని తేల్చి చెప్పారు. దీంతో ఇలాంటి మాస్ లీడర్ లేకపోతే పరిస్థితి ఏంటని వైసీపీ హై కమాండ్ ఆలోచనలో పడింది. కొడాలి నాని ఏ పార్టీలో ఉన్న ఆ పార్టీ నేతకు వీర విధేయుడుగా ఉంటూ వస్తున్నారు. ఎన్టీఆర్ టీడీపీని స్థాపించిన తర్వాత రాజకీయాలలోకి వచ్చిన నాని కార్యకర్తగా కెరియర్ ను మొదలుపెట్టి ఎమ్మెల్యేగా, మంత్రిగా ఎదిగారు. టీడీపీకి గుడ్ బై చెప్పి వైయస్ జగన్మోహన్ రెడ్డి స్థాపించిన వైసీపీలో చేరి ఆయనకు అత్యంత ఆప్తుడిగా నమ్మిన బంటుగా మారారు.

ఆ తర్వాత వైయస్ జగన్ కొడాలి నానిని క్యాబినెట్ లోకి తీసుకున్నారు. దీంతో కొడాలి నాని రేంజ్ ఎక్కడికో వెళ్లిపోయింది. 2024 ఎన్నికల్లో పోటీ చేస్తాను 2029 ఎన్నికలకు రిటైర్మెంట్ తీసుకుంటానని, పోటీ చేయనని ఓపిక లేదని ఆయన చెబుతున్నారు. అంత సడన్గా నాని ఎందుకు ఇలాంటి నిర్ణయం తీసుకున్నారని చర్చ కూడా మొదలైంది. అయితే దీనిపై వివిధ రకాలుగా గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ 2024 ఎన్నికలు చివరివి, 2029 ఎన్నికల్లో పోటీ చేయనని కొడాలి నాని తేల్చి చెప్పారు. అంతేకాదు తన కుటుంబానికి రాజకీయాలపై ఎలాంటి ఆసక్తి లేదని కూడా తేల్చి చెప్పారు. అయితే తన సోదరుడి కుమారుడు రాజకీయాలలోకి రావచ్చని, ఆసక్తి చూపుతున్నాడని చిన్న హింట్ ఇచ్చేశారు. అయితే రాజకీయాలకు ఎందుకు గుడ్ బై చెప్పేయాలని అనుకుంటున్నారో దానికి కారణం చెప్పారు.

కొడాలి నాని మాట్లాడుతూ గుడివాడకు పర్మినెంట్గా రోడ్లు వేసి స్ట్రక్చర్ చేయాల్సి ఉందని, దీంతోపాటు 500 నుంచి 600 కోట్ల రూపాయల బడ్జెట్తో రోడ్లు కాలువలు వాల్స్ వేయాలని అన్నారు. ఈ ఎన్నికల్లో వైయస్ జగన్ మళ్లీ గెలిచిన తర్వాత మంత్రి పదవి ఇవ్వకపోయినా సరే అభివృద్ధికి డబ్బులు ఇస్తే చాలు అని అన్నారు. అన్ని అయ్యాక 2029 ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లో పోటీ చేయనని కొడాలి నాని చెప్పారు. అప్పటికి గుడివాడ సీటు ఎవరికి ఇచ్చుకున్న ఏ కొత్త కుర్రాడికి ఇచ్చిన అభ్యంతరం లేనట్లుగా చెప్పేశారు. ప్రస్తుతం 52 ఏళ్ళ వయసు ఉన్న నాకు ఎన్నికల్లో పోటీ చేసే ఓపిక లేదని అన్నారు 2029 ఎన్నికలకు రిటైర్మెంట్ తీసుకుంటానని చెప్పారు ఇన్నాళ్లు గుడివాడను పాలించాను. నా తర్వాత కొత్త కుర్రాళ్లకు కూడా అవకాశం ఇవ్వాలి అని అన్నారు. 2024 ఎన్నికలు దగ్గరికి రానున్నాయి. అయితే ఈసారి వైయస్ జగన్ గుడివాడకు కొడాలి నాని కాకుండా మండవ హనుమంతరావుకు టికెట్ ఇవ్వబోతున్నారని జోరుగా ప్రచారం జరుగుతుంది. అక్కడి వైసీపీ కార్యకర్తలు, క్యాడర్ మండల హనుమంతరావు ఎమ్మెల్యే అభ్యర్థి అంటూ ఫ్లెక్సీలు కూడా ఏర్పాటు చేశారు. మరి ఈసారి గుడివాడకు కొడాలి నాని పోటీ చేస్తారా లేదా అనేది తెలియాలి.

Recent Posts

iPhone 16 : ఐఫోన్ ప్రియులకు గుడ్ న్యూస్.. ఐఫోన్ 16 కేవలం రూ.33,400కే..!

iPhone 16 : యాపిల్ ఐఫోన్‌కు ప్రపంచవ్యాప్తంగా ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రీమియం స్మార్ట్‌ఫోన్ విభాగంలో…

7 hours ago

Tamannaah : నా ఐటెం సాంగ్స్ చూడకుండా చిన్న పిల్లలు అన్నం కూడా తినరు : తమన్నా

Tamannaah : స్టార్ హీరోయిన్ తమన్నా ఈ మధ్య తన ప్రత్యేక స్టైల్‌తో తెలుగు సినీ ప్రేక్షకుల మనసులను గెలుచుకుంటోంది.…

8 hours ago

Jagadish Reddy : కవిత వ్యాఖ్యలపై జగదీష్ రెడ్డి కౌంటర్..

Jagadish Reddy : తెలంగాణ రాజకీయాల్లో ఎమ్మెల్సీ కవిత, మాజీ మంత్రి జగదీష్ రెడ్డి మధ్య మాటల యుద్ధం తీవ్రమవుతోంది.…

9 hours ago

Devara 2 Movie : దేవ‌ర 2 సినిమా సెట్స్‌పైకి వెళ్లేదెప్పుడు అంటే… జోరుగా ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు

Devara 2 Movie : యంగ్‌ టైగర్‌ జూ ఎన్టీఆర్ న‌టించిన చిత్రం దేవ‌ర ఎంత పెద్ద హిట్ అయిందో…

10 hours ago

Little Hearts Movie : సెప్టెంబర్ 12న రిలీజ్‌కు సిద్ద‌మ‌వుతున్న‌ “లిటిల్ హార్ట్స్..!

"90s మిడిల్ క్లాస్ బయోపిక్" ఫేమ్ మౌళి తనుజ్, "అంబాజీపేట మ్యారేజి బ్యాండు" మూవీతో గుర్తింపు తెచ్చుకున్న యంగ్ హీరోయిన్…

12 hours ago

Viral Video : ఇదెక్క‌డి వింత ఆచారం.. వధువుగా అబ్బాయి, వరుడిగా అమ్మాయి.. వైర‌ల్ వీడియో !

Viral Video : ప్రకాశం జిల్లా మార్కాపురం మండలంలోని దరిమడుగు గ్రామంలో ఇటీవల జరిగిన ఒక వివాహం స్థానికులను మాత్రమే…

13 hours ago

Satyadev : ‘కింగ్‌డమ్’ సినిమాకి వచ్చినంత పేరు నాకు ఎప్పుడూ రాలేదు : సత్యదేవ్

Satyadev  : విజయ్ దేవరకొండ కథానాయకుడిగా నటించిన చిత్రం ‘కింగ్‌డమ్’. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సత్యదేవ్,…

13 hours ago

Ponnam Prabhakar : బనకచర్ల పేరుతో నారా లోకేష్ ప్రాంతీయతత్వం రెచ్చగొడుతున్నారు : పొన్నం ప్రభాకర్

Ponnam Prabhakar : ఏపీ మంత్రి నారా లోకేశ్‌పై తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం…

14 hours ago