
Maha Shivaratri : శివరాత్రి రోజు ఇంట్లోని పూజా మందిరంలోకి వెళ్లి శివ ధ్యానం చేసిన పిచ్చుక.. వైరల్ వీడియో..!
Maha Shivaratri : మహాశివరాత్రి అసలు దేవుడు ఉన్నాడా లేడా అనే ప్రశ్నకు ఇప్పటివరకు సరైన సమాధానం ఎవరు ఇవ్వలేరు.కానీ మనిషి మాత్రం దైవభక్తితో ఎన్నో రకాల దేవుళ్లకు పూజలు చేస్తూ ఉంటారు.దేవుడు అంటే భక్తి, భయం. అందుకే ప్రపంచంలో ఎన్నో దేవాలయాలు వెలిశాయి. ప్రపంచంలో ఎన్నో మతాలు ఉన్నాయి. ఆయా మతస్తులు దైవాన్ని తమ పద్ధతుల్లో పూజిస్తుంటారు. ఇక భారత్ లో భక్తికి ఎంతో ప్రాధాన్యత ఇస్తుంటారు. అందుకే ఇక్కడ అన్ని రకాల దేవుళ్లకు దేవాలయాలు ఉన్నాయి. ఇక్కడ భక్తులు దేవుళ్ళపై ఎంతో నమ్మకాన్ని ప్రదర్శిస్తుంటారు అప్పుడప్పుడు దేవుడు కొన్ని లీలలు చూపిస్తున్నారని గట్టిగా నమ్ముతుంటారు. ఇది ముమ్మాటికి దైవసంకల్పమే అని అంటారు.
అయితే మహాశివరాత్రి సందర్భంగా ఓ పిచ్చుక ఓ ఇంట్లోకి వెళ్లి పూజా మందిరంలో కూర్చుంది. అది అలా కదలకుండా చాలాసేపు కూర్చోవడంతో శివ ధ్యానం చేసిందని భక్తులను నమ్ముతున్నారు. అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇప్పుడు ఇది రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఈ ఘటన జగిత్యాల లోని ధర్మపురిలో జరిగినట్లుగా తెలుస్తుంది. ఈ వీడియోలో ఓ పిచ్చుక ప్రధాన ద్వారం నుండి నేరుగా ఇంట్లోకి చేరి పూజా మందిరంలోకి వెళ్లి కూర్చుంది. చాలా సమయం వరకు కదలకుండా శివ ధ్యానంలో ఉన్నట్లు ఆ పిచ్చుక కూర్చోవడం గమనార్హం.
దీంతో శివరాత్రి సందర్భంగా ఆ పిచ్చుక శివ ధ్యానం చేసేందుకు పూజా మందిరంలోకి వెళ్లిందని భక్తులు నమ్ముతున్నారు. ఇక ఇంట్లోని వాళ్ళు పిచ్చుక ఇంట్లోకి రావటానికి పూజా మందిరంలోకి వెళ్లడాన్ని మొత్తం వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టారు. దీంతో ఈ వీడియో తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా మారింది. దేవుడు పక్షులు, జంతువులు రూపంలో ఇంటికి వస్తాడని అంటారు. శివరాత్రి సందర్భంగా పరమ శివుడే పిచ్చుక రూపంలో ఆ ఇంటికి వచ్చాడని కొందరు భక్తులు కామెంట్స్ చేస్తున్నారు. మరికొందరు నాస్తికులు దీనిని కొట్టిపారేస్తున్నారు. ఆ పిచ్చుక రోజు ఆ ఇంటికి రావడం అలవాటై ఉంటుందని, పూజ మందిరంలో ఉండే ఫలహారాలను తినేందుకు అది అలా అలవాటై ఉంటుందని, ఆ ఇంట్లోనే వాళ్ళు దానిని అలవాటు చేసుకుని ఉంటారని, శివరాత్రి రోజు వీడియో తీసి ఉంటారని అంటున్నారు.
Montha Effect | ఆంధ్రప్రదేశ్ తీరంపై మొంథా తుఫాను (Cyclone Montha) బీభత్సం సృష్టిస్తోంది. ఇవాళ (అక్టోబర్ 28) సాయంత్రం లేదా…
Harish Rao | హైదరాబాద్‌లో బీఆర్‌ఎస్ పార్టీలో తీవ్ర విషాదం నెలకొంది. సిద్దిపేట బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి తన్నీరు…
Brown Rice |బియ్యం తింటే లావు అవుతారనే భావన చాలా మందిలో ఉంది. అందుకే చాలామంది తెల్ల బియ్యానికి బదులుగా…
Health Tips | అక్టోబర్ నెలాఖరులో వాతావరణం క్రమంగా చల్లబడుతోంది. ఈ సీజన్ మార్పు సమయంలో చాలామంది దగ్గు, జలుబు,…
Chanakya Niti | ఆచార్య చాణక్యుడు ..కేవలం రాజకీయ చతురుడు మాత్రమే కాదు, ఆర్థిక జ్ఞానానికి ప్రతీక. వేల సంవత్సరాల…
Phone | కొత్త స్మార్ట్‌ఫోన్ కొనాలనుకునే వారికి మోటరోలా నుంచి మరో గుడ్ న్యూస్ వచ్చింది. రూ.15,000 బడ్జెట్‌లో పవర్‌ఫుల్…
Cancer Tips | నేటి వేగవంతమైన జీవనశైలి, ఆహారపు అలవాట్లు, ఒత్తిడి వంటి కారణాల వల్ల క్యాన్సర్, గుండెపోటు, స్ట్రోక్…
Montha Cyclone Effect | ఏపీలో ‘మొంథా’ తుఫాన్ ప్రభావం తీవ్రంగా కనిపిస్తోంది. వాతావరణ శాఖ హెచ్చరికలతో రాష్ట్రవ్యాప్తంగా టెన్షన్…
This website uses cookies.