Revanth reddy
Revanth Reddy : తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో రేవంత్ రెడ్డిది ప్రత్యేక స్థానం అనడంలో సందేహం లేదు. తెలుగు దేశం పార్టీలో ఉన్న సమయంలో ఒంటరిగా అధికార టీఆర్ఎస్ పార్టీపై సీఎం కేసీఆర్ పై తీవ్ర స్థాయిలో విరుచుకు పడ్డ రేవంత్ రెడ్డి రాజకీయ బలం కోసం కాంగ్రెస్ లో జాయిన్ అయ్యాడు. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ లో జాయిన్ అవ్వడంతో ఆ పార్టీ బలం మరింతగా పెరిగి 2018 ఎన్నికల్లో కలిసి వస్తుందని అనుకుంటే కేసీఆర్ ప్రభంజనం ముందు మరోసారి కాంగ్రెస్ దాంతో పాటు రేవంత్ రెడ్డి కూడా కొట్టుకు పోయాడు. అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ ఉన్న సమయంలో రేవంత్ రెడ్డి ని పీసీసీ ప్రెసిడెంట్ గా ఎంపిక చేయడం వల్ల ఖచ్చితంగా పార్టీ బలం పెరుగుతుందని కొందరు అన్నారు. కాని సీనియర్లు పార్టీ అధినాయకత్వం వద్ద రేవంత్ రెడ్డిని పల్చన చేసేందుకు తీవ్రంగా ప్రయత్నాలు చేసి సక్సెస్ అయ్యారు. రేవంత్ రెడ్డికి పదవి ఇవ్వకుండా చేయగలిగారు.
రేవంత్ రెడ్డికి టీపీసీసీ పదవి వస్తుంది దాంతో ఆయన పార్టీకి మళ్లీ పునరుత్తేజం తీసుకు వస్తాడని ఇన్నాళ్లు ఆయన వెంట తెలుగు దేశం పార్టీ నుండి వచ్చిన వారు అనుకున్నారు. కాని పరిస్థితులు అందుకు అనుకూలంగా లేవు. కాంగ్రెస్ అధినాయకత్వం అలసత్వం మరియు రాష్ట్ర సీనియర్ నాయకుల ఈగోలతో అధికార టీఆర్‌ఎస్ పార్టీకి పోటీ ఇవ్వలేక పోగా బీజేపీ వచ్చి చేరడంతో మూడవ స్థానంకు పడిపోయే పరిస్థితి వచ్చింది. ఈ నేపథ్యంలో రేవంత్ రెడ్డి వెనుక ఉన్న చాలా మంది నాయకులు మెల్ల మెల్లగా బీజేపీ లో జాయిన్ అవుతున్నారు. వారిని బీజేపీలో జాయిన్ అవ్వమని చెప్పిందే రేవంత్ రెడ్డి అంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి. త్వరలో జరుగబోతున్న నాగార్జున సాగర్ ఎన్నిక తర్వాత పీసీసీ చీప్ ను నియమించే అవకాశం ఉంది. అప్పుడు తనకు ప్రాముఖ్యత ఇవ్వకుంటే రేవంత్ రెడ్డి తప్పుకునేందుకు సిద్దం అవుతున్నాడట.
Revanth reddy
బీజేపీలో జాయిన్ అయ్యేందుకు రేవంత్ రెడ్డి ఆసక్తిగా ఉన్నాడనే పుకార్లు షికార్లు చేస్తున్నాయి. రేవంత్ రెడ్డికి సన్నిహితుడిగా ఇన్నాళ్లు మెలిగిన కొండ విశ్వేశ్వర్ రెడ్డి ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశాడు. త్వరలోనే ఆయన బీజేపీలో జాయిన్ అవుతాడు అంటూ రాజకీయ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది. ఆయన్ను ఆపాలంటే రేవంత్ రెడ్డి వల్ల అవుతుంది. కాని ఆయన బీజేపీలో చేరితేనే అన్ని విధాలుగా బెటర్ అనే ఉద్దేశ్యంతో రేవంత్ రెడ్డి ఉన్నాడట. ఇంకా పలువురు కాంగ్రెస్ నాయకులు కూడా బీజేపీలో జాయిన్ అయ్యారు.. మరి కొందరు బీజేపీ వైపు చూస్తున్నారు. ఈ పరిణామాలు అన్ని చూస్తుంటే వారందరు వెళ్లిన తర్వాత వారి దారిలో రేవంత్ రెడ్డి కూడా కాషాయం ధరించే అవకాశం ఉందని అంటున్నారు. ఏం జరుగుతుందో చూడాలి.
Chanakyaniti : చానిక్యుడు తన నీతి కథలలో మనవాలి జీవితాన్ని గురించి అనేక విషయాలను అందించాడు, కౌటిల్యు నీ పేరుతో…
Today Gold Price : ఈ రోజు తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. పెళ్లిళ్ల సీజన్కు ఇది…
Congress Grass : చుట్టూ ఎక్కడపడితే అక్కడ పిచ్చి మొక్కల మొలిచే ఈ మొక్క, చూడటానికి ఎంతో అందంగా ఆకర్షణీయంగా…
Vijayasai Reddy : వైసీపీ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్టీలో కీలక నాయకులైన కొందరు వ్యక్తుల…
AkshayaTritiya 2025 : రోజున లక్ష్మీదేవికి ఇష్టమైన రోజుగా పరిగణించడం జరిగింది. ఈరోజు ఎన్నో శుభయోగాలు కూడా కొన్ని రాశుల…
Self-Driving Scooters : టెక్నలాజి లో మరో అడుగు ముందుకు వేసింది చైనా. ఇప్పటికే ఎన్నో అద్భుతాలు సృష్టించిన చైనా..తాజాగా…
Viral Video : పెళ్లంటే రెండు కుటుంబాల సంయుక్త ఆనందం, సాంప్రదాయాల వేడుక. పెళ్లి అనగానే కాలు తొక్కటం, ఉంగరం…
Anasuya : ఈ రోజుల్లో ఇంటి పనులతో రోజంతా బిజీగా గడిపే గృహిణులు తమ ఆరోగ్యం గురించి పెద్దగా ఆలోచించలేరు.…
This website uses cookies.