
Ariselu Recipe In Telugu on Sweet Shop Style
Ariselu Recipe : ఈరోజు రెసిపీ వచ్చేసి అరిసెలు. ఈ అరిసెలను అప్పటికప్పుడు ఎలా చేయాలో చూపించబోతున్నాను. ముందు ఎలాంటి ప్రిపరేషన్ లేకుండా ఇలా మనం అప్పటికప్పుడు పొడి బియ్యప్పిండితో చాలా ఈజీగా చేసుకోవచ్చు. మీరు కూడా చాలామంది చూసి ట్రై చేసి బాగా కుదిరిందని చెప్పండి. ఒకసారి చూడండి చాలా బాగా కుదురుతాయి. అలాగే ఈ అరిసెలు ఎలా చేయాలో ఇప్పుడు మనం చూద్దాం… దీనికి కావాల్సిన పదార్థాలు : పొడి బియ్యప్పిండి, బెల్లం పాలు నువ్వులు, యాలకుల పొడి, ఆయిల్, నెయ్యి మొదలైనవి… దీని తయారీ విధానం : ముందుగా పొడి బియ్యప్పిండిని ఒక కేజీ తీసుకొని ఆ పిండిని మంచిగా జల్లించుకోవాలి. ఆ విధంగా జల్లించుకున్న పిండిలో పాలు పోసి కలుపుకోవాలి.
ఒక పావు కప్పు పాలను పోసి బాగా అరచేతిలో వేసుకొని రప్ చేసుకోవాలి. మనం చేత్తో పట్టుకుంటే ముద్దులా వచ్చేలా ఉండాలి. మళ్లీ ఆ పిండిని జల్లెడలో వేసి జల్లించుకోవాలి. ఈ జల్లెడు పట్టిన పిండిని ఒక అరగంట సేపు పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టౌ పై ఒక కడాయి పెట్టి ఆ కడాయిలో ముప్పావు కప్పు బెల్లాన్ని వేసి కొన్ని వాటర్ పోసి బాగా కలుపుకోవాలి. బెల్లం కరిగిన తర్వాత దానిని వడకట్టుకోవాలి. తర్వాత బెల్లం నీళ్ల లో కొంచెం యాలకుల పొడిని వేసి మళ్లీ ఆ నీళ్ళని ఒక మూడు నిమిషాల పాటు బాగా మరిగించుకోవాలి. రెండు నిమిషాలు మరిగిన తర్వాత ఆ నీటిలో ముందుగా జల్లెడ పట్టుకున్న
Ariselu Recipe In Telugu on Sweet Shop Style
పిండిని వేసి బాగా కలుపుకోవాలి. తర్వాత కొంచెం నెయ్యిని కూడా వేసి బాగా కలుపుకోవాలి. తర్వాత కొద్దిసేపు చల్లారనిస్తే అది ముద్దవ్వడానికి చాలా ఈజీగా ఉంటుంది. తర్వాత స్టౌ పై ఒక కడాయిని పెట్టి దానిలో డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ పోసి బాగా కాగనివ్వాలి. తర్వాత ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న పిండిని తీసుకొని చిన్న అరిసెల్ల ఒత్తుకుని ఆయిల్ లో వేసి రెండు వైపులా కాల్చుకొని ఒత్తి తీసుకోవాలి. అలాగే కొన్ని నువ్వుల అరిసెల్ని కూడా నువ్వులు ఒత్తుకుని అరిసెలను కాల్చుకోవచ్చు.. ఎవరికి ఎలా కావాలంటే అలా చేసుకోవచ్చు… అంతే ఇనిస్టెంట్ గా అరిసెల్ని ఎంతో సింపుల్గా చేసుకోవచ్చు… అన్ని అరిసెల్ని ఇలాగే చేసుకోవచ్చు… ఈ ప్రాసెస్ తెలిపే చిన్నపిల్లలు కూడా అరిసెల్ని చేసేస్తారు..
Blue Berries | ఆకర్షణీయమైన నీలిరంగు, చక్కని రుచితో మనసును దోచుకునే బ్లూబెర్రీస్ కేవలం రుచికరమైనవి మాత్రమే కాదు, ఆరోగ్యానికి…
Remedies | శని గ్రహం జ్యోతిష్యశాస్త్రంలో అత్యంత శక్తివంతమైన గ్రహాల్లో ఒకటి. ప్రతి రెండున్నర సంవత్సరాలకు ఒకసారి శని గ్రహం…
Rukmini Vasanth | కన్నడ, తెలుగు, తమిళ భాషల్లో క్రేజ్ పెంచుకుంటున్న నటి రుక్మిణి వసంత్ తన పేరుతో జరుగుతున్న మోసాలపై…
Moringa Powder | తెలుగు వారి వంటింట్లో మునగ పేరు తెలియనివారు ఉండరంటే అతిశయోక్తి కాదు. మునగకాయలతో పులుసులు, కూరలు,…
Sesame Seeds | స్త్రీల ఆరోగ్యం పురుషులతో పోలిస్తే ఎక్కువ సవాళ్లను ఎదుర్కొంటుంది. హార్మోన్ల అసమతుల్యత, రక్తహీనత, ఎముకల బలహీనత,…
Heart Attacks | భారతదేశంలో గుండె సంబంధిత వ్యాధులు వేగంగా పెరుగుతున్నాయి. అధిక రక్తపోటు, కొలెస్ట్రాల్, ఒత్తిడి, అసమతుల్య ఆహారం, వ్యాయామం…
Triphala Powder | ఆయుర్వేదం ప్రకారం ప్రతి ఋతువుకి అనుకూలంగా ఆహార నియమాలు, మూలికా చిట్కాలు ఉంటాయి. అందులో త్రిఫల చూర్ణం…
Mole | జ్యోతిషశాస్త్రం మన శరీరంలోని చిన్నచిన్న లక్షణాలకూ ప్రత్యేక అర్థం ఇస్తుంది. అందులో ఒకటి పుట్టుమచ్చలు (Moles). పుట్టుమచ్చ…
This website uses cookies.