Healthy Liquor Tea : ఈరోజు రెసిపీ వచ్చేసి లిక్కర్ టీ చాలా బాగుంటుంది. ఈ టీ అరకప్పు తాగితే ఇక మత్తు వదిలిపోతుంది. చాలా బాగా రిఫ్రెష్ అవుతారు. ఇది బెంగాలీ స్పెషల్ “టీ”వాతావరణం చల్లగా ఉన్నప్పుడు ఈ టీ బొట్టు బొట్టుగా గొంతులోకి దిగుతుంటే ఆహాహా అని అనాల్సిందే.. దీని మజా మాటల్లో చెప్పడం కన్నా తాగి చూస్తే ఆ కిక్కే వేరు ఉంటుంది. ఇక ఈ లిక్కర్ టీ ని ఏ విధంగా తయారు చేయాలో ఇప్పుడు మనం చూద్దాం : ఈ టీ కి కావలసిన పదార్థాలు : అల్లం, మిరియాలు, నీళ్లు, పంచదార, బిర్యానీ ఆకు, టీ పౌడర్, మొదలైనవి… దీని తయారీ విధానం : ముందుగా ఈ లిక్కర్ టీ కోసం ఒక ఇంచ్ అల్లం దంచి పక్కన పెట్టుకోవాలి.
తర్వాత ఒక పది మిరియాలను వేసి కచ్చాపచ్చాగా దంచి ఉంచుకోవాలి. ఇక టీ కోసం స్టౌ పై ఒక గిన్నెను పెట్టి ఒక రెండు కప్పుల నీళ్లను పోసి వాటిని మరగబెట్టాలి. ఆ మరుగుతున్న నీటిలో ఒక స్పూన్ పంచదార వేసి కొద్దిసేపు మరిగించుకోవాలి. మళ్లీ అలా మరుగుతున్న నీటిలో ఒక బిర్యానీ ఆకు నీ ముక్కలుగా చేసుకొని వేసుకోవాలి. తర్వాత ముందుగా దంచి పెట్టుకున్న అల్లం, మిరియాల పౌడర్ కూడా వేసి గంటతో తిప్పుతూ బాగా ముసల పెట్టుకోవాలి. అలా ఒక నిమిషం పాటు మరిగిన తర్వాత మీరు వాడే టీ పౌడర్ ఏదైనా సరే ఒక స్పూన్ అంటే ఒక స్పూన్ మాత్రమే వేయాలి. మీరు వాడే టీ పౌడర్ ఏదైనా కావచ్చు.
అయితే మసాలా టీ పౌడర్ లాంటివి మాత్రం వాడుకోవద్దు. ఆ విధంగా ఒక స్పూన్ టీ పౌడర్ వేసిన తర్వాత ఒక్క నిమిషం పాటు గరిటెతో తిప్పుకుంటూ మరిగించుకోవాలి. ఆ విధంగా ఒక నిమిషం పాటు మరిగించుకున్న టీ ని వెంటనే స్టవ్ ఆపి గ్లాసులోకి గరిటతో ఎత్తి వడకట్టాలి. ఆ విధంగా ఎత్తిపోయడం వలన మంచి చిక్కదనం వస్తుంది. అంతే ఎంతో సింపుల్ గా లిక్కర్ టీ రెడీ. ఇది వేడి వేడి గానే తాగితే ఆ మజానే వేరు ఉంటుంది. ఈ “టీ” ని చలికాలంలో చల్లగా ఉన్నప్పుడు తాగితే ఎంతో రిఫ్రెష్ అవుతారు. జలుబు, దగ్గు లాంటి సమస్యలు కూడా తగ్గిపోతాయి.
Winter Season : చలికాలం వచ్చేసింది. అయితే ఈ కాలంలో చాలామంది ఎదుర్కొంటున్న సమస్యలలో నిద్రమత్తు కూడా ఒకటి. ఈ…
Hair Care : ప్రస్తుత కాలంలో మనం ఎదుర్కొంటున్న సమస్యలలో తెల్ల జుట్టు కూడా ఒకటి. అయితే జుట్టు తెల్లబడడం అనేది…
Good News for Farmers : దేశానికి వెన్నెముక గా నిలుస్తున్న వ్యవసాయ రంగానికి అండగా ఉంటుంది. రైతులు వారి…
Skin Care : ప్రస్తుత కాలంలో మార్కెట్లో చర్మ సంరక్షణ కోసం ఎన్నో రకాల ఉత్పత్తులు అందుబాటులో ఉంటున్నాయి. అదే టైంలో…
Aadhar Update : ఆధార్ కార్ ను అప్డేట్ చేయడానికి కొన్ని నియమ నిబంధనలు ఇంకా షరతులు ఉంటాయి. ఐతే…
Cooling Water : ప్రస్తుతం కూలింగ్ వాటర్ తాగే అలవాటు చాలామందికి ఉంది. వీళ్లు వర్షాకాలం మరియు చలికాలం లో…
Shani : జ్యోతిషశాస్త్రం ప్రకారం 2025 వ సంవత్సరంలో శనీశ్వరుడు మీనరాశిలో సంచరించబోతున్నాడు. ఇలా మీనరాశిలో సంచరించడం వలన కొన్ని…
Nayanthara : లేడీ సూపర్ స్టార్ నయనతార సినిమాలతో తన సత్తా చాటుతుంది. సౌత్ లోనే కాదు జవాన్ సినిమాతో…
This website uses cookies.