Categories: Food RecipesNews

Chicken Roast : ఫుల్ గ్రేవీతో చికెన్ రోస్ట్.. ఇక అన్నం, బిర్యానీ, చపాతీలో కి ఏ కూరతో పనిలేదు…!

Chicken Roast : ఈరోజు చికెన్ రోస్ట్ ని ఎలా చేసుకోవచ్చో తెలుసుకోబోతున్నాం.. మనం రెగ్యులర్గా చేసుకునే చికెన్ ఫ్రై అనేది డ్రై గా ఉండి రైస్ తో కలుపుకోవడానికి గ్రేవీ లేకపోతే కనుక నేను చెప్పే ఈ చికెన్ రైస్ని ట్రై చేయండి. రైస్ తో అయినా బిర్యానితో అయినా చక్కగా కలుపుకొని తినేసేయచ్చు. ఈవెన్ చపాతీలోకి కూడా ఈ చికెన్ రైస్ చాలా బాగుంటుంది. రెస్టారెంట్ స్టైల్ లో గ్రేవీ గ్రేవీ గా ఉండే చికెన్ రోస్ట్ ని ఎలా చేసుకోవాలో చూసేద్దాం.  దీనికి కావలసిన పదార్థాలు: చికెన్, ఆయిల్, పసుపు, కారం, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, మసాలా ఇంగ్రిడియంట్స్, ఉల్లిపాయలు, కొత్తిమీర, పుదీనా, పచ్చిమిర్చి, జీడిపప్పు, బటర్ మొదలైనవి… తయారీ విధానం; ఫస్ట్ స్టవ్ మీద కడాయి పెట్టుకోండి. కడాయిలో మూడు నుంచి నాలుగు టేబుల్ స్పూన్ దాక ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక ఇందులోకి ఒక రెండు టేబుల్ స్పూన్ల దాకా జీడిపప్పులు వేసి దోరగా వేయించి ఇలా గోల్డెన్ సైడ్ వచ్చిన తర్వాత వీటిని పక్కకు తీసుకోండి. నెక్స్ట్ ఇందులోకి మరొక టేబుల్ స్పూన్ దాక ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయ్యాక ఇందులో ఒక టీ స్పూన్ దాకా జీలకర్ర వేయండి. అలాగే ఒక ఫుల్ కప్పు దాకా ఉల్లిపాయల్ని సన్నగా పొడుగ్గా స్లైసెస్ గా కట్ చేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఈ ఉల్లిపాయ ముక్కల్ని గోల్డెన్ బ్రౌన్ వచ్చేంతవరకు బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఇందులో ఒక ఫుల్ టేబుల్ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు వేయించండి.

తర్వాత ఉప్పు వేసేసి బాగా కలపండి. నెక్స్ట్ ఒక కేజీ దాకా బాగా శుభ్రంగా క్లీన్ చేసుకుని వాష్ చేసుకున్న చికెన్ ని మీడియం సైజ్ లో కట్ చేసుకుని ఆ చికెన్ ని వేసేసుకోవాలి. చికెన్ ముక్కల్లో నుంచి వాటర్ వచ్చి ఆ వాటర్ తోనే చికెన్ అంతా కుక్ అయ్యేంతవరకు మూత పెట్టుకుంటూ కుక్ చేసుకోవాలండి. చికెన్ అనేది కంప్లీట్ గా 100% కుక్ అయిపోవాలి. ఉడికిపోయిన తర్వాత ఇందులోకి మూడు లేదా నాలుగు పచ్చిమిర్చిని ఇలా చీల్చుకుని వేసుకోండి. అలాగే రెండు టేబుల్ స్పూన్ల దాకా బాగా సన్నగా కట్ చేసి పెట్టుకున్నా పుదీనా అలాగే బాగా సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర తరుగు కూడా ఒక రెండు టేబుల్ స్పూన్ల దాకా వేయండి. పచ్చిమిర్చి, కొత్తిమీర పుదీనా వీటిని వేసిన తర్వాత ఒక రెండు నిమిషాల పాటు మీడియం టు హై ఫ్లేమ్ లో పెట్టి బాగా టాస్ చేయండి. నెక్స్ట్ ఇందులోకి ఒక రెండు మీడియం సైజు టమాటాలని ఫైన్ పేస్ ల గ్రైండ్ చేసుకుని ఆ ప్యూరీ ని కూడా వేసేసేయండి. ఇందులోని ఒక రెండు టేబుల్ స్పూన్ల దాకా కారం వేసుకోవాలి. కారం వేసిన తర్వాత టమాటాలో ఉండే పచ్చి వాసన పోయేంత వరకు కలుపుతూ ఫ్రై చేసుకోండి. ఈలోపు మనం ఈ చికెన్ ఫ్రై లోకి కావాల్సిన అసలైన మసాలాని తయారు చేసుకుందాం.

దాని కోసం మిక్సీ జార్ తీసుకొని అందులోకి ఒక టేబుల్ స్పూన్ దాకా ధనియాలు వేసుకోండి. తర్వాత అర టీ స్పూన్ దాక జీలకర్ర అర టీ స్పూన్ దాకా సోంపు వేయండి నెక్స్ట్ ఇందులో ఒక టీ స్పూన్ దాకా మిరియాలు వేసుకోవాలి. తర్వాత పావు టీ స్పూన్ దాకా మెంతులు కూడా వేయండి. ఇందులోని ఒక రెండు ఇంచుల దాకా దాల్చిన చెక్క ఆరేడు లవంగం మొక్కలు నాలుగు యాలుక్కాయలు ఒక అనాసపువ్వు వేసుకోండి. బిర్యాని ఆకు కూడా వేసేసిన తర్వాత ఇందులోని ఒక టీ స్పూన్ దాకా గసగసాలు అలాగే ఒక టేబుల్ స్పూన్ దాకా జీడిపప్పు పలుకులు ఆ తర్వాత కొంచెం నీళ్లు పోసి ఇలా పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకున్న ఈ మసాలా పేస్ట్ ని ఇప్పుడు మనం ఫ్రై లోకి ఆడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ స్టేజిలో మనం తయారు చేసుకున్న ఈ మసాలా పేస్ట్ మొత్తాన్ని కూడా వేసేసి ఒక ఐదు పది నిమిషాల పాటు నూనెలోనే చక్కగా వేయించాలన్నమాట.. పచ్చివాసన పోయేంత వరకు కూడా మంటని లోటు మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుంటూ బాగా తిప్పుకుంటూ ఫ్రై చేయండి. అంతా కూడా దగ్గరకు అయిపోయి ఆల్మోస్ట్ తయారయిపోయింది. అని అనుకున్న స్టేజ్లో ఫైనల్ గా ఇందులోకి ఒక రెండు టేబుల్ స్పూన్ల దాకా కరివేపాకు అలాగే వేయించుకున్న జీడిపప్పు పలుకులు కూడా వేసేసి హై ఫ్లేమ్ లో ఒక రెండు మూడు నిమిషాల పాటు బాగా టాస్ చేయండి. ఇక్కడ చికెన్ ఫ్రై అనేది బాగా డ్రైగా ఉండకూడదు.

కొంచెం గ్రేవీ ఉండగానే మనకి చికెన్ ఫ్రై అనేది రెడీ అయిపోయినట్లే. ఈ స్టేజ్ లోనే మీరు సాల్ట్ ని కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ చూపిస్తున్న విధంగా చికెన్ రోస్ట్ అయితే పర్ఫెక్ట్ గా రెడీ అయిపోయిందండి ఒక టేబుల్ స్పూన్ దాకా బటర్ని గాని లేదా నెయ్యిని గాని వేసుకొని ఒకసారి బాగా కలిపేచేసేయండి. చాలా యమ్మీ యమ్మీగా సూపర్ టేస్టీగా అండ్ వెరీ ఫ్లేవర్ ఫుల్ గా రెడీ అయిపోయిన ఈ చికెన్ రోస్ట్ ని రైస్ తో బిర్యానితో దీంతో తిన్న సూపర్ గా ఉంటుంది.

Recent Posts

Peanuts Vs Almonds | బ‌రువు తగ్గాలంటే పల్లీనా? బాదమా? ఏది బెస్ట్ .. న్యూట్రిషన్ నిపుణుల విశ్లేషణ

Peanuts Vs Almonds | బరువు తగ్గాలనే లక్ష్యంతో ఉన్నవారు సాధారణంగా తక్కువ క్యాలరీల ఆహారాన్ని ఎంచుకుంటారు. అయితే, ఆరోగ్యకరమైన…

1 hour ago

Palm | మీ చేతిలో అర్ధ చంద్రం ఉంటే అదృష్టం మీదే..! మీ జీవిత భాగస్వామి ఎలా ఉంటుందో చెబుతున్న హస్తసాముద్రికం

Palm | గ్రహస్థితుల మాదిరిగానే, హస్తసాముద్రికం (Palmistry) కూడా ప్రపంచవ్యాప్తంగా విశేష ప్రాధాన్యత పొందింది. నిపుణుల అభిప్రాయం ప్రకారం, మన అరచేతిలోని…

4 hours ago

Green Chilli | పచ్చి మిరపకాయల అద్భుత గుణాలు .. కారంగా ఉన్నా ఆరోగ్యానికి వరంగా!

Green Chilli | మన భారతీయ వంటల్లో పచ్చి మిరపకాయలు తప్పనిసరి భాగం. ఎర్ర మిరపకాయల కంటే పచ్చి మిరపకాయలలో…

15 hours ago

Lemon | నిమ్మకాయ తొక్కతో చర్మ సంరక్షణ .. వ్యర్థం కాదు, విలువైన ఔషధం!

Lemon | మన ఇళ్లలో తరచుగా కనిపించే నిమ్మకాయ వంటింటికి మాత్రమే కాదు, చర్మ సంరక్షణకు కూడా అద్భుతమైన సహజ…

19 hours ago

Health Tips | భోజనం తర్వాత తమలపాకు తినడం కేవలం సంప్రదాయం కాదు.. ఆరోగ్యానికి అమృతం!

Health Tips | భారతీయ సంప్రదాయంలో తమలపాకు (Betel Leaf) ప్రత్యేక స్థానం కలిగి ఉంది. భోజనం తర్వాత నోటి శుభ్రత…

20 hours ago

Dried Chillies | ఎండు మిర‌ప‌తో ఎన్నో లాభాలు.. ఆరోగ్యంలో చేర్చుకుంటే చాలా ఉప‌యోగం..!

Dried Chillies | ఎండు మిర్చిని కేవలం వంటకు రుచి, సువాసన మాత్రమే కాకుండా ఆరోగ్యానికి కూడా ఎంతో ఉపయోగకరమని…

22 hours ago

Black In Color | న‌లుపుగా ఉండే ఈ ఫ్రూట్స్ వ‌ల‌న అన్ని ఉప‌యోగాలు ఉన్నాయా..!

Black In Color | ఆరోగ్యంగా, ఫిట్‌గా ఉండటానికి పండ్లు, కూరగాయలను మాత్రమే కాకుండా బ్లాక్ ఫుడ్స్‌ను కూడా ఆహారంలో…

1 day ago

Karthika Masam | కార్తీక మాసంలో 4 సోమవారాలు.. నాలుగు వారాలు ఈ ప్ర‌సాదాలు ట్రై చేయండి

Karthika Masam | కార్తీక మాసం ప్రారంభమైంది. ఈ మాసంలో ప్రతి సోమవారం భక్తులు పరమేశ్వరుడిని పూజిస్తూ, ఉపవాస దీక్షలు…

1 day ago