Tomato Rasam Recipe : ఈరోజు రెసిపీ వచ్చేసి చెట్టినాడు స్పెషల్ ఘటైన నాటుకోడి టమాటో చారు.. ఘాటుగా ఎంతో అద్భుతంగా ఉంటుంది. ఈ చారు. ఇది తమిళనాడు వాళ్ళ స్పెషల్ ఐటెం. దీనిని అక్కడ చాలా బాగా వండుతూ ఉంటారు. ఇప్పుడు తమిళనాడు స్టైల్ లోనే మనం చేయబోతున్నాం. ఈ చెట్టు నాడి స్పెషల్ అయిన నాటుకోడి టమాటో చారు ఎలా చేయాలో ఇప్పుడు మనం చూద్దాం.. దీని కావాల్సిన పదార్థాలు : నాటుకోడి మాంసం, మిరియాలు, కారం, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, టమాటాలు, కొత్తిమీర, పసుపు, ఆయిల్, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, క్యారెట్లు, బిర్యానీ ఆకు మొదలైనవి.. దీని తయారీ విధానం : ముందుగా ఆఫ్ కేజీ నాటుకోడి చికెన్ తీసుకుని కుక్కర్లో వేసి దానిలో
రెండు స్పూన్ల మిరియాలు, కొన్ని క్యారెట్లు, ఒక బిర్యాని ఆకు,అలాగే కొన్ని రెండు లీటర్ల నీళ్లు పోసుకుని విజిల్స్ వచ్చేవరకు ఉడికించుకోవాలి. తర్వాత ఒక గిన్నెలో నాలుగు ఐదు పండు టమాటాలను వేసుకొని దానిలో కొత్తిమీర కొంచెం ఉప్పు వేసి బాగా పిండుకోవాలి. తర్వాత స్టౌ పై ఒక కడాయిని పెట్టి దానిలో ఆయిల్ వేసుకుని దానిలో ఐదు ఆరు ఎండుమిర్చి, కొంచెం జీలకర్ర, కొంచెం ఆవాలు, కొంచెం మెంతులు వేసి బాగా కలుపుకోవాలి. వెల్లుల్లి కచ్చాపచ్చాగా దంచి వేసుకోవాలి. తర్వాత కొంచెం కరివేపాకు కూడా వేసి కలుపుకోవాలి. తర్వాత ఒక కప్పు ఉల్లిపాయలు వేసి దానిలో కొంచెం ఉప్పు వేసి బాగా ఫ్రై అవ్వనివ్వాలి.
తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు వేసి బాగా కలుపుకోవాలి. తర్వాత చిదుముకున్న టమాట వేసి తర్వాత కొంచెం ఉప్పు వేసి ఒక లీటర్ నీళ్లు పోసుకోవాలి. లీటర్ నీళ్లు పోసుకున్న తర్వాత కొంచెం చింతపండు రసం వేసుకోవాలి. అలా వేసుకుని ఒక పొంగు వచ్చిన తర్వాత ముందుగా మనం కుక్కర్లో ఉడికించుకున్న చికెన్ వాటర్ తో సహా దాంట్లో వేసి కొంచెం కొత్తిమీర కూడా వేసి మూతపెట్టి 8 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. 8 నిమిషాల తర్వాత మిర్యాల పొడి వేసుకొని తర్వాత వేరే బౌల్ లోకి సర్వ్ చేసుకోవాలి. అంతే ఎంతో టేస్టీ అయిన నాటుకోడి టమాటా చారు దీన్ని ఒక్కసారి తిన్నారంటే ఇక అస్సలు వదలరు.
Passports : పాస్పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్రాజ్లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.