Curry leaves : ఈరోజు దేశీయ స్టైల్ కరివేపాకు చికెన్ టిక్క తయారు చేసుకోబోతున్నాం.. నార్త్ వారి స్టైల్ కాకుండా అదే ఇన్స్పిరేషన్తో దక్షిణాది వారికి అని గర్వంగా చెప్పుకునే కరివేపాకు తో చికెన్ టిక్కా తయారు చేయబోతున్నాము. దీని టేస్ట్ ఎంత బాగుంటుందంటే ఒక్కసారి తిన్నారంటే మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది… ఈ రెసిపీ ఎలా తయారు చేయాలో ఇప్పుడు మనం చూద్దాం…దీనికి కావలసిన పదార్థాలు: చికెన్, పచ్చిమిర్చి, కరివేపాకు, మిరియాలు, ఎల్లుల్లి, అల్లం, ఎండుమిర్చి, ధనియాలు,ఉప్పు జీలకర్ర, పెరుగు,పసుపు,ఆయిల్, మొదలైనవి…తయారీ విధానం: ముందుగా స్టవ్ పై ఒక కడాయి పెట్టి రెండు స్పూన్ల ఆయిల్ వేసుకొని దానిలో 10వెల్లుల్లి, ఒక స్పూన్ మిరియాలు, నాలుగైదు, ఎండుమిర్చి, కొంచెం అల్లం, రెండు స్పూన్ల ధనియాలు, ఒక స్పూన్ జీలకర్ర, నాలుగైదు పచ్చిమిర్చి వేసి బాగా వేయించుకోవాలి.
ఇది బాగా వేగిన తర్వాత ఒక పెద్ద కప్పు ముదురు కరివేపాకును తీసుకొని శుభ్రంగా కడిగి నీరు లేకుండా తుడుచుకొని ఆ కరివేపాకు దీనిలో వేసి బాగా వేయించుకోవాలి.. బాగా వేగిన తర్వాత ఈ మిశ్రమాన్ని మిక్సీ జార్ లో వేసుకొని ఒక రెండు చెక్కలు నిమ్మరసం పిండి మెత్తటి పేస్టులా పట్టుకోవాలి. తర్వాత ఒక కిలో చికెన్ పీసులు తీసుకుని వాటిని బౌల్లో వేసి ముందుగా మనం పట్టుకున్న కరివేపాకు మిశ్రమాన్ని దాంట్లో వేసి ఒక కప్పు పెరుగు వేసి కొంచెం పసుపు కొంచెం ఆయిల్ కూడా వేసి ఆ ముక్కలకి బాగా పట్టించాలి.. అలా పట్టించిన చికెన్ ని ఒక గంట పాటు నానబెట్టుకోవాలి. చికెన్ ముక్కల్ని తర్వాత చెక్క పుల్లలు తీసుకుని వాటిని కొంచం గ్యాప్ లో ఒక్కొక్క పీస్ ని గుచ్చుకోవాలి. అన్ని చెక్క పుల్లలకి చికెన్ పీసిని కుచ్చి తర్వాత స్టవ్ పై పెనం పెట్టి పెనంపై ఆయిల్ వేయాలి.
ఆయిల్ బాగా హీటెక్కిన తర్వాత చికెన్ స్క్వేర్ ని పెట్టి నూనె వేసుకుంటూ కాల్చుకోవాలి. నూనె వేసుకుంటూ కాల్చకపోతే మసాలాలు అడుగుపెట్టేస్థాయి. కాబట్టి ఆయిల్ వేస్తూ రెండువైపులా చక్కగా కాల్చుకోవాలి. చికెన్ పెట్టే పుల్లలను నీటిలో నానబెట్టుకోవాలి లేదంటే అవి విరిగిపోతాయి. ఇక మంట హై ఫ్లేమ్ లో పెట్టి నూనె వేసుకుంటూ కాలిస్తే మసాలా అంతా మాడిపోతుంది. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత వాటిని తీసి ఇప్పుడు గ్యాస్ ఫిలిం మీద అన్ని వైపులా తిప్పుకుంటూ కాల్చండి. కాల్చమన్నాను కదా అని మరి మాడ్చకండి. చేదుగా అయిపోతుంది. ఒక పది నిమిషాల పాటు కాల్చి తీసి వాటిని పై చాట్ మసాలా కొంచెం నిమ్మరసం వేసి తింటే సూపర్ గా ఉంటుంది. అంతే చికెన్ తిక్క రెడీ. ఇక వీటిని మీరు వేడి వేడిగా మైనేస్ లేదా గ్రీన్ చట్నీతో సర్వ్ చేయండి. మీరు ఎప్పుడు చేసినా సూపర్ హిట్ అయిపోతుంది. టేస్ట్ కూడా ది బెస్ట్ లెవెల్ లో ఉంటుంది..
Mechanic Rocky Movie Review : ఈ ఇయర్ ఆల్రెడీ గామీ, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమాలతో ప్రేక్షకుల ముందుకు…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ ఫినాలే ఎపిసోడ్‌కి దగ్గర పడింది. టాప్ 5కి ఎవరు వెళతారు,…
Google Sundar Pichai : అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ Donald Trump మరియు Google గూగుల్ సీఈఓ…
India : కొన్నేళ్లుగా భారత్- కెనడా దేశాల మధ్య ఉద్రిక్త వాతావరణం కొనసాగుతుండడం మనం చూస్తూనే ఉన్నాం. అయితే తాజాగా,…
Bank Account : ఒకప్పుడు ఒక వ్యక్తికి ఒక బ్యాంక్ ఖాతా మాత్రమే ఉండేది. కానీ ఇప్పుడు ఒక్కో వ్యక్తికి…
Periods : ప్రస్తుతం మన జీవనశైలి మరియు ఆహారపు అలవాట్లలో వచ్చిన మార్పుల కారణం చేత యువతను ఎన్నో రకాల…
Bobby : రచయితగా కెరియర్ స్టార్ట్ చేసిన బాబి తర్వాత ఆ అసిస్టెంట్ డైరెక్టర్‌గా మారాడు. పవర్ సినిమాకి బాబీ…
Sleep : మనం ఆరోగ్యంగా ఉండాలి అంటే మనం తీసుకునే ఆహారం అనేది ఎంత ముఖ్యమో నిద్ర కూడా అంతే ముఖ్యం…
This website uses cookies.