Raymond Family Disputes : రేమండ్ అనగానే మనకు గుర్తొచ్చేది.. ప్యాంట్లు, షర్టులు. ఇప్పుడంటే జీన్స్, టీషర్టులు గట్రా వచ్చాయి కానీ.. ఒకప్పుడు ఫార్మల్ డ్రెస్సులు అంటేనే మనకు గుర్తొచ్చేది రేమండ్. అవును.. రేమండ్ క్లాత్ కు ఉన్న డిమాండే వేరు. ఇంత రెడీమెడ్ రంగం శాసిస్తున్న రోజుల్లోనూ రేమండ్ టెక్స్ టైల్ కంపెనీ ఇప్పటికీ టెక్స్ టైల్ రంగంలో నెంబర్ వన్ గానే ఉంది. సూట్స్ అంటేనే మనకు గుర్తొచ్చేది రేమండ్. ప్రపంచవ్యాప్తంగా 200 నగరాల్లో, 637 స్టోర్స్ లో, 4000 మల్టీ బ్రాండ్ ఔట్ లెట్స్, 55 దేశాల్లో ప్రొడక్షన్ యూనిట్స్.. ఇలా మొత్తంగా కొన్ని బిలియన్ డాలర్ల మార్కెట్ ను సొంతం చేసుకుంది రేమండ్ కంపెనీ. ఇప్పటికీ వేల కోట్ల లాభాలతో టెక్స్ టైల్ ఇండస్ట్రీని రూల్ చేస్తోంది రేమండ్.
అసలు రేమండ్ కంపెనీ స్థాపన వెనుక, కంపెనీ సక్సెస్ వెనుక ఉన్నది ఎవరో తెలుసా? విజయ్ పత్ సింఘానియా. ఆ తర్వాత రేమండ్ ను అంచెలంచెలుగా ఎదిగేలా చేసింది ఆయన కొడుకు గౌతమ్ సింఘానియా. అయితే.. విజయ్ పత్ సింఘానియా.. గౌతమ్ కు కోట్ల ఆస్తి ఇచ్చాడు. కంపెనీని కొడుకు చేతుల్లో పెట్టాడు. కంపెనీని అయితే కొడుకు వృద్ధిలోకి తీసుకొచ్చాడు కానీ.. తల్లిదండ్రులను మాత్రం పట్టించుకోలేదు. తల్లిదండ్రులను రోడ్డు మీద వదిలేశాడు. దీంతో తన కొడుకు మీద కేసు వేసిన విజయ్ పత్.. ప్రస్తుతం కోర్టులో పోరాడుతున్నాడు.
ఇదిలా ఉంటే.. గౌతమ్ భార్య కూడా కోర్టుకెక్కింది. తండ్రిని కొడుకు బయటికి నెట్టేయడంతో.. అది నచ్చని గౌతమ్ భార్య.. తనకు విడాకులు కావాలని కోర్టుకెక్కింది. అయితే.. విజయ్ పత్ కు మరో కొడుకు కూడా ఉన్నాడు. కానీ.. ఆస్తుల గొడవ వల్ల.. పెద్ద కొడుకు విదేశాలకు వెళ్లిపోవడంతో గౌతమ్ కే అన్నీ దక్కాయి. ఆ తర్వాత విజయ్ పత్ రిటైర్ అయ్యారు. ముంబైలో జేకే హౌస్ పేరుతో పెద్ద బిల్డింగ్ ను నిర్మించుకున్నాడు. అందులో ఒక ఫ్లాట్ లో విజయ్ పత్, మరో ఫ్లాట్ లో గౌతమ్, ఇంకో ఫ్లాట్ లో విజయ్ పత్ సోదరుడు, ఆయన పిల్లలు ఉండేవారు. అయితే.. ఆ ఇంట్లో ఉన్న మొత్తం నాలుగు డుప్లెక్స్ హౌసులు తనకు ఇచ్చేయాలని గౌతమ్ తన తండ్రిని అడిగాడు. దీంతో కుదరదని విజయ్ పత్ చెప్పడంతో తన తండ్రి మీదనే ఆరోపణలు చేసి తల్లిదండ్రులను బయటికి పంపించేశాడు. అందులో ఉండే బంధువులను కూడా ఖాళీ చేయించాడు. దీంతో విజయ్ పత్ వేరే ఇంట్లో రెంట్ కు ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. వేల కోట్లు సంపాదించి.. ఇప్పుడు ముంబైలో ఒక సాధారణ జీవితం గడుపుతున్నాడు.
Onion And Garlic : భారతదేశంలోని ప్రతి ఒక్కరి ఇంట్లో దాదాపుగా ఉల్లిపాయాలను వెల్లుల్లిని విరివిగా వినియోగిస్తూ ఉంటారు. అయితే…
Mechanic Rocky Movie Review : ఈ ఇయర్ ఆల్రెడీ గామీ, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమాలతో ప్రేక్షకుల ముందుకు…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ ఫినాలే ఎపిసోడ్కి దగ్గర పడింది. టాప్ 5కి ఎవరు వెళతారు,…
Google Sundar Pichai : అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ Donald Trump మరియు Google గూగుల్ సీఈఓ…
India : కొన్నేళ్లుగా భారత్- కెనడా దేశాల మధ్య ఉద్రిక్త వాతావరణం కొనసాగుతుండడం మనం చూస్తూనే ఉన్నాం. అయితే తాజాగా,…
Bank Account : ఒకప్పుడు ఒక వ్యక్తికి ఒక బ్యాంక్ ఖాతా మాత్రమే ఉండేది. కానీ ఇప్పుడు ఒక్కో వ్యక్తికి…
Periods : ప్రస్తుతం మన జీవనశైలి మరియు ఆహారపు అలవాట్లలో వచ్చిన మార్పుల కారణం చేత యువతను ఎన్నో రకాల…
Bobby : రచయితగా కెరియర్ స్టార్ట్ చేసిన బాబి తర్వాత ఆ అసిస్టెంట్ డైరెక్టర్గా మారాడు. పవర్ సినిమాకి బాబీ…
This website uses cookies.