Curry leaves : సూపర్ డూపర్ కరివేపాకు చికెన్ టిక్కా… ఒక్కసారి తిన్నారంటే మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది… | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Curry leaves : సూపర్ డూపర్ కరివేపాకు చికెన్ టిక్కా… ఒక్కసారి తిన్నారంటే మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది…

Curry leaves : ఈరోజు దేశీయ స్టైల్ కరివేపాకు చికెన్ టిక్క తయారు చేసుకోబోతున్నాం.. నార్త్ వారి స్టైల్ కాకుండా అదే ఇన్స్పిరేషన్తో దక్షిణాది వారికి అని గర్వంగా చెప్పుకునే కరివేపాకు తో చికెన్ టిక్కా తయారు చేయబోతున్నాము. దీని టేస్ట్ ఎంత బాగుంటుందంటే ఒక్కసారి తిన్నారంటే మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది… ఈ రెసిపీ ఎలా తయారు చేయాలో ఇప్పుడు మనం చూద్దాం…దీనికి కావలసిన పదార్థాలు: చికెన్, పచ్చిమిర్చి, కరివేపాకు, మిరియాలు, ఎల్లుల్లి, అల్లం, ఎండుమిర్చి, ధనియాలు,ఉప్పు […]

 Authored By aruna | The Telugu News | Updated on :28 December 2023,10:00 am

ప్రధానాంశాలు:

  •  Curry leaves : సూపర్ డూపర్ కరివేపాకు చికెన్ టిక్కా... ఒక్కసారి తిన్నారంటే మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది...

  •  కరివేపాకు చికెన్ టిక్క తయారీ విధానం

  •   కరివేపాకు చికెన్ టిక్కా ఒక్కసారి తిన్నారంటే మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది

Curry leaves : ఈరోజు దేశీయ స్టైల్ కరివేపాకు చికెన్ టిక్క తయారు చేసుకోబోతున్నాం.. నార్త్ వారి స్టైల్ కాకుండా అదే ఇన్స్పిరేషన్తో దక్షిణాది వారికి అని గర్వంగా చెప్పుకునే కరివేపాకు తో చికెన్ టిక్కా తయారు చేయబోతున్నాము. దీని టేస్ట్ ఎంత బాగుంటుందంటే ఒక్కసారి తిన్నారంటే మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది… ఈ రెసిపీ ఎలా తయారు చేయాలో ఇప్పుడు మనం చూద్దాం…దీనికి కావలసిన పదార్థాలు: చికెన్, పచ్చిమిర్చి, కరివేపాకు, మిరియాలు, ఎల్లుల్లి, అల్లం, ఎండుమిర్చి, ధనియాలు,ఉప్పు జీలకర్ర, పెరుగు,పసుపు,ఆయిల్, మొదలైనవి…తయారీ విధానం: ముందుగా స్టవ్ పై ఒక కడాయి పెట్టి రెండు స్పూన్ల ఆయిల్ వేసుకొని దానిలో 10వెల్లుల్లి, ఒక స్పూన్ మిరియాలు, నాలుగైదు, ఎండుమిర్చి, కొంచెం అల్లం, రెండు స్పూన్ల ధనియాలు, ఒక స్పూన్ జీలకర్ర, నాలుగైదు పచ్చిమిర్చి వేసి బాగా వేయించుకోవాలి.

ఇది బాగా వేగిన తర్వాత ఒక పెద్ద కప్పు ముదురు కరివేపాకును తీసుకొని శుభ్రంగా కడిగి నీరు లేకుండా తుడుచుకొని ఆ కరివేపాకు దీనిలో వేసి బాగా వేయించుకోవాలి.. బాగా వేగిన తర్వాత ఈ మిశ్రమాన్ని మిక్సీ జార్ లో వేసుకొని ఒక రెండు చెక్కలు నిమ్మరసం పిండి మెత్తటి పేస్టులా పట్టుకోవాలి. తర్వాత ఒక కిలో చికెన్ పీసులు తీసుకుని వాటిని బౌల్లో వేసి ముందుగా మనం పట్టుకున్న కరివేపాకు మిశ్రమాన్ని దాంట్లో వేసి ఒక కప్పు పెరుగు వేసి కొంచెం పసుపు కొంచెం ఆయిల్ కూడా వేసి ఆ ముక్కలకి బాగా పట్టించాలి.. అలా పట్టించిన చికెన్ ని ఒక గంట పాటు నానబెట్టుకోవాలి. చికెన్ ముక్కల్ని తర్వాత చెక్క పుల్లలు తీసుకుని వాటిని కొంచం గ్యాప్ లో ఒక్కొక్క పీస్ ని గుచ్చుకోవాలి. అన్ని చెక్క పుల్లలకి చికెన్ పీసిని కుచ్చి తర్వాత స్టవ్ పై పెనం పెట్టి పెనంపై ఆయిల్ వేయాలి.

ఆయిల్ బాగా హీటెక్కిన తర్వాత చికెన్ స్క్వేర్ ని పెట్టి నూనె వేసుకుంటూ కాల్చుకోవాలి. నూనె వేసుకుంటూ కాల్చకపోతే మసాలాలు అడుగుపెట్టేస్థాయి. కాబట్టి ఆయిల్ వేస్తూ రెండువైపులా చక్కగా కాల్చుకోవాలి. చికెన్ పెట్టే పుల్లలను నీటిలో నానబెట్టుకోవాలి లేదంటే అవి విరిగిపోతాయి. ఇక మంట హై ఫ్లేమ్ లో పెట్టి నూనె వేసుకుంటూ కాలిస్తే మసాలా అంతా మాడిపోతుంది. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత వాటిని తీసి ఇప్పుడు గ్యాస్ ఫిలిం మీద అన్ని వైపులా తిప్పుకుంటూ కాల్చండి. కాల్చమన్నాను కదా అని మరి మాడ్చకండి. చేదుగా అయిపోతుంది. ఒక పది నిమిషాల పాటు కాల్చి తీసి వాటిని పై చాట్ మసాలా కొంచెం నిమ్మరసం వేసి తింటే సూపర్ గా ఉంటుంది. అంతే చికెన్ తిక్క రెడీ. ఇక వీటిని మీరు వేడి వేడిగా మైనేస్ లేదా గ్రీన్ చట్నీతో సర్వ్ చేయండి. మీరు ఎప్పుడు చేసినా సూపర్ హిట్ అయిపోతుంది. టేస్ట్ కూడా ది బెస్ట్ లెవెల్ లో ఉంటుంది..

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది