
Egg Dum Biryani : స్పెషల్ ఎగ్ దమ్ బిర్యాని.. ఒక్కసారి తిన్నారంటే ఇక మర్చిపోరు..!!
Egg Dum Biryani : ఈరోజు ఎగ్ దమ్ బిర్యాని పర్ఫెక్ట్ గా ఎలా చేసుకోవచ్చు. తెలుసుకోబోతున్నాం.. చాలా టేస్టీగా ఉంటుంది.. చక్కగా మనకి చికెన్ బిర్యానీ తో పోటీపడి ఎగ్ దమ్ బిర్యాని రెడీ అయిపోతుంది. దీనికి కావాల్సిన పదార్థాలు: ఎగ్స్, బాస్మతి రైస్, కొత్తిమీర, పుదీనా, ఆనియన్స్, పెరుగు, ఉప్పు, కారం ,పసుపు, గరం మసాలా, ఓల్ గరం మసాలా, బట్టర్ ,ఆయిల్ ,నిమ్మరసం మొదలైనవి…
తయారీ విధానం: ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి దాల్చిన చెక్క నాలుగు, లవంగ మొగ్గలు నాలుగు, యాలుకలు ఒక రెండు,ఒకటి అనాసపువ్వు, ఒక జాపత్రి, హాఫ్ టీ స్పూన్ దాకా మిరియాలు, అర టీ స్పూన్ జీలకర్ర, ఒక టీ స్పూన్ దాకా గసగసాలు కొద్దిగా జీడిపప్పు పలుకులు ఒక టేబుల్ స్పూన్ దాకా ధనియాలు వీటన్నిటిని కూడా ఫైన్ పౌడర్ చేసుకుని మసాలా పౌడర్ ని రెడీ చేసుకుని పెట్టుకోండి.. మిక్సీ జార్ లో కారానికి తగ్గట్టుగా నాలుగు లేదా ఐదు పచ్చిమిర్చి కట్ చేసుకుని వేసుకోండి. పెద్ద ముక్కలుగా కట్ చేసుకుని టమాట ముక్కలు కూడా వేసి ఫైన్ పేస్టులా చేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక ఆఫ్ కప్పు పెరుగు దానిలో ఒక స్పూన్ కారం కొంచెం పసుపు కొంచెం ఉప్పు వేసి బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక పెద్ద గిన్నె పెట్టుకొని అందులోకి రెండు లీటర్ల దాకా నీళ్ళు పోసుకోండి. ఇందులోకి హోల్ బిర్యానీ మసాలా ఇంగ్రిడియంట్స్ కొద్దిగా వేయండి. తర్వాత ఒక టీ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ రుచికి సరిపడా ఉప్పు కొద్దిగా కొత్తిమీర కొద్దిగా పుదీనా వీటన్నిటిని కూడా వేసి మరిగించాలి. మరుగుతున్నప్పుడు ఇందులోకి 450 లేదా 500 గ్రాముల బాస్మతి రైస్ ని ఒక గంట పాటు నానబెట్టుకుని వాటర్ లేకుండా చేసుకొని ఇందులో వేసుకోండి.మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని నిదానంగా ఈ రైస్ ని ఉడికించండి.
పాన్ లో మూడు టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకోండి. దానిలో ఉడికించుకున్న కోడిగుడ్లను కొంచెం ఉప్పు పసుపు కారం వేసి వేయించి తీసి పక్కన పెట్టుకోవాలి. అదే పాన్ లో మళ్ళీ రెండు మూడు స్పూన్ల ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులోకి హోల్ బిర్యానీ ఇంగ్రిడియంట్స్ కొద్దిగా యాడ్ చేసుకోండి. వీటిని ఆయిల్లో కొద్దిసేపు ఫ్రై చేసిన తర్వాత ఇందులోకి ఒకటిన్నర టేబుల్ స్పూన్ల దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోండి.నెక్స్ట్ ఇందులోకి పచ్చిమిర్చి టమాటా పేస్టు ని కూడా వేసేసి ఆయిల్ లో బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఇందులోకి ఉప్పు, కారం పసుపు కలిపి పెట్టుకున్న పెరుగు మిక్స్ ని ఇందులో యాడ్ చేసుకోండి. నూనె సపరేట్ అయ్యేంతవరకు కూడా ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి ఒక పావు కప్పు దాకా బ్రౌన్ ఆనియన్స్ ని ఆడ్ చేసుకోండి. అన్నమాట వీటిని ఒక పావు కప్పు దాకా ఇందులో ఆడ్ చేసుకోండి. అలాగే సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర ఒక టేబుల్ స్పూన్ సన్నగా తరిగి పెట్టుకున్న పుదీనా కూడా ఒక టేబుల్ స్పూన్ దాక వేసుకోండి. ఇందులోనే మన గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పౌడర్ మొత్తాన్ని కూడా వేసేసేయండి. ఒక రెండు నిమిషాల పాటు ఆయిల్ లో వీటిని ఫ్రై చేయండి. ఇప్పుడు ఇందులోకి మనం ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకున్న ఎగ్స్ ని వేసేసి ఒకసారి అంతా కూడా కలుపుకోండి. ఇప్పుడు కొద్దిగా సాల్ట్ ని యాడ్ చేసి టేస్ట్ చేసుకోండి. అలాగే ఒక 100 ml దాకా వాటర్ ని కూడా యాడ్ చేసుకుని మిక్స్ చేసుకుని మూత పెట్టి లో ఫ్లేమ్ లో ఒక ఫైవ్ మినిట్స్ పాటు కుక్ చేయండి.
ఐదు నిమిషాల తర్వాత ఇలా నూనె అనేది పైకి తేలుతుందండి. సో మనకి గ్రేవీ కన్సిస్టెన్సీ అనేది ఇలా చిక్కగా ఉండాలన్నమాట. సో ఇలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని పక్కకు దించుకుని ఇందులో నుంచి హాఫ్ గ్రేవీ నీ ఒక ప్లేట్ లోకి తీసుకొని పెట్టుకోండి. మిగిలిన హాఫ్ పార్ట్ ని ఇందులోనే ఉంచేసేయండి. ఈలోపు మనకి రైస్ అనేది చక్కగా ఉడికిపోతుంది. అండి మనకి ఆల్మోస్ట్ 90% దాకా రైస్ అనేది ఉడికిపోవాలి. అలా ఉడికిపోయిన తర్వాత వాటర్ మొత్తం కూడా డ్రాయింగ్ చేసేసుకోండి. చేసేసుకున్న రైస్ ని బిర్యాని పాయింట్ లోకి మొత్తం వేసేసుకోవాలి.వేసుకునే ముందు కొద్దిగా కొత్తిమీర కొద్దిగా పుదీనా అలాగే బ్రౌన్ ఆనియన్స్ ని కూడా యాడ్ చేసుకుని దానిపైన లేయర్ కింద రైస్ ని వేసేసేయండి. రైస్ మొత్తం వేసేసి పైన మిగిలిన గ్రేవి మన పక్కకు తీసుకున్న అడ్జస్ట్ చేసేయండి. ఇప్పుడు దీనిపైన లేయర్ కింద కొద్దిగా బ్రౌన్ ఆనియన్స్ అలాగే సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర పుదీనా రెండు టీ స్పూన్ల దాకా నెయ్యి వేసియండి. కొద్దిగా కలర్ ఫుల్ గా కనిపించడం కోసం పైన స్ప్రెడ్ చేసుకోండి ఇలా అరేంజ్ చేసుకున్న తర్వాత దీనిపైన టిష్యూ పేపర్స్ కానీ లేదంటే అల్యూమినియం ఫైల్ గాని లేదంటే దాన్ని ఆవిరి పైకి పోకుండా అడ్జస్ట్ చేయండి.మనం స్టవ్ మీద పెట్టేస్తే కింద అడుగు భాగంలో మాడిపోయే ఛాన్స్ ఉంటుందండి. అందుకని ఒక పాత పెనాన్ని ఫస్ట్ స్టవ్ మీద పెట్టి దానిపైన ఈ బిర్యాని పాయింట్ని పెట్టేసి ఫస్ట్ మీడియం ఫ్లేమ్ లో ఒక ఫైవ్ మినిట్స్ పాటు కుక్ చేయండి. ఆ తర్వాత మంటని లో ఫ్లేమ్ లోకి టర్న్ చేసుకుని ఇంకొక 10 మినిట్స్ పాటు కుక్ చేయండి. ఇలా 15 మినిట్స్ పాటు కుక్ అయిన తర్వాత తీసి సర్వ్ చేసుకోవడమే.. గ్రేవీ కూడా అవసరం లేదు. కొంచెం రైతాని పక్కన పెట్టేసుకొని ఈ బిర్యానీని సర్వ్ చేసేసుకోవచ్చు. మరి ఈ యమ్మి యమ్మి గా ఉండే ఎగ్జామ్ బిర్యాని మీరు తప్పకుండా ఇంట్లో ట్రై చేయండి…
హైదరాబాద్ ప్రజలకు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (GHMC) మరో గుడ్ న్యూస్ చెప్పింది. ఇకపై చిన్న చిన్న మున్సిపల్…
Husbands Wife : ప్రేమ అంటే కేవలం కలిసి జీవించడం మాత్రమే కాదు.. మరణం తర్వాత కూడా ఆ బంధాన్ని…
Revanth Reddy : తెలంగాణ రాజకీయాల్లో మరోసారి ఆసక్తికర చర్చ మొదలైంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భవిష్యత్తుపై బీజేపీ ఎంపీ…
MS Dhoni Retirement : ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) చరిత్రలో చెన్నై సూపర్ కింగ్స్ (CSK) అంటే గుర్తుకు…
తమిళనాడు రాజకీయాల్లో మరోసారి భారీ రాజకీయ హీట్ మొదలైంది. అధికారంలోకి వచ్చిన కొద్ది రోజులకే ముఖ్యమంత్రి విజయ్ నేతృత్వంలోని తమిళగా…
Egg : గుడ్లు ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే పోషకాహారంగా భావిస్తారు. ముఖ్యంగా ప్రోటీన్ కోసం గుడ్లను చాలా మంది…
No Sugar : ప్రస్తుతం చాలామంది ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టడం ప్రారంభించారు. ముఖ్యంగా చక్కెర అధికంగా తీసుకోవడం వల్ల…
SRH vs CSK : ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)లో ప్రతి మ్యాచ్ ఉత్కంఠభరితంగా సాగుతుండగా, నిన్న జరిగిన చెన్నై…
Sunrisers Hyderabad : ఐపీఎల్ 2026 సీజన్ చివరి దశకు చేరుకుంటుండగా ప్లేఆఫ్స్ రేస్ మరింత ఉత్కంఠగా మారింది. ఈ…
Grapes Vs Bananas : డయాబెటిస్ ఉన్నవారు ఆహార విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా పండ్లు తినేటప్పుడు…
Peddi Movie Trailer : మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ Ram Charan నటిస్తున్న భారీ Pan India…
LPG Hormuz : ప్రపంచవ్యాప్తంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న హోర్ముజ్ జలసంధి ( Strait of Hormuz ) మార్గం…
This website uses cookies.