Oats Idli Recipe : ఓట్స్ తో ఇడ్లీ ఇలా చేసుకోండి.. రుచితో పాటు ఆరోగ్యం కూడా..!
Oats Idli Recipe : రోజు రోజుకీ మనిషికి ఆరోగ్యం పట్ల అవగాహన పెరుగుతుండడంతో, తినే తిండి విషయంలో కూడా తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. కొవ్వు, చేరని ఆహారపదార్ధాలు ఇంపార్టెంట్ ఇస్తున్నారు. గత కొన్నేళ్లుగా ఆదరణ సొంతం చేసుకుంది ఓట్స్. ప్రస్తుతం ఓట్స్ భారతీయులు తినే ఆహారపదార్ధాల్లో ఒకటిగా చేరిపోయింది. ఈరోజు ఇన్స్టెంట్ ఓట్స్ ఇడ్లీ రెసిపీ తెలుసుకుందాం.
Oats Idli Recipe : ఇలా చేయండి..
ఇన్‌స్టెంట్ ఓట్స్ తో ఆరోగ్యకరంగా, రుచిగా ఇడ్లీ తయారు చేసుకోండి. కావలసిన పదార్థాలు.. రోల్డ్ ఓట్స్ / ఇన్‌స్టంట్ ఓట్స్ – 1 కప్పు, చిలికిన పెరుగు – అవసరమైనంత , నూనె – 1 టేబుల్ స్పూన్, శనగపప్పు – 1 టీ స్పూన్, మినప్పప్పు – 1 టీ స్పూన్, జీలకర్ర – 1 టీ స్పూన్, ఆవాలు – ½ టీ స్పూన్, తరిగిన ఉల్లిపాయ – 1, తరిగిన పచ్చిమిరపకాయలు – 2, తరిగిన అల్లం ముక్క – 1, తురిమిన క్యారెట్ – 1, కరివేపాకులు – కొద్దిగా, తరిగిన కొత్తిమీర – కొద్దిగా, ఉప్పు – రుచికి తగినంత, నీరు – అవసరమైనంత ముందుగా ఓట్స్‌ను మిక్సీ లో వేసి లైట్‌గా బరకగా పొడి చేసుకోవాలి.

Oats Idli Recipe : ఓట్స్ తో ఇడ్లీ ఇలా చేసుకోండి.. రుచితో పాటు ఆరోగ్యం కూడా..!
మిక్స్ చేసిన పొడిలో కొద్దిగా రోల్డ్ ఓట్స్ కూడా కలిపితే ఇడ్లీలకు టెక్స్చర్ బాగా వస్తుంది, రుచిగా కూడా ఉంటాయి. ఆ తర్వాత నూనె వేసి ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, శనగపప్పు వేసి వేయించాలి. తర్వాత అందులో ఉల్లిపాయ, పచ్చిమిర్చి, అల్లం, కరివేపాకు వేసి బాగా వేయించాలి. ఈ మిశ్రమాన్ని స్టౌ నుంచి దించి చల్లారనివ్వాలి.ఓట్స్ పొడిలో తాలింపు మిశ్రమాన్ని కలపాలి. దానిలో తురిమిన క్యారెట్, కొత్తిమీర, ఉప్పు వేసి కలిపిన తరువాత పెరుగు వేసి సాఫ్ట్‌గా ఉండేలా పిండిని కలుపుకోవాలి. ఐదు నిమిషాల పాటు పక్కన పెట్టాలి.ఇడ్లీ స్టాండ్‌లో నూనె రాసిన ప్లేట్లలో ఈ పిండిని వేసి, స్టీమర్‌లో లేదా కుక్కర్‌లో (విజిల్ లేకుండా) 15 నిమిషాల పాటు ఆవిరితో ఉడికించాలి. మీకు కావల్సిన ఇడ్లీ రెడి.