Skin Benefits : మన చుట్టుపక్కలలో ఎన్నో మొక్కల్ని చూస్తూ ఉంటాం. కానీ వాటిని అస్సలు పట్టించుకోము. అలాంటి మొక్కలలోని మనకి ఉపయోగపడే ఎన్నో మొక్కలు దాగి ఉంటాయి. మనకి ప్రకృతి చాలా ప్రయోజనాలు ఉన్న మొక్కల్ని ప్రసాదించింది. కాకపోతే వాటిని తెలుసుకోవడం మనకి కొంచెం కష్టం. ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలిగిన మొక్కలు ఉంటాయి. అవి మన శరీరానికి కావలసిన ఎన్నో ఉపయోగాలని కలిగించడంలో ప్రకృతి ప్రధాన పాత్ర పోషిస్తూ ఉంటుంది. వాటిలలో సింగపూర్ పువ్వులు వీటిని శంఖంపూలు అని కూడా పిలుస్తూ ఉంటారు. ఈ పువ్వుల మొక్క యొక్క ఆకులు, పువ్వులు ,కాండం ప్రతి ఒక్కటి కూడా ఆయుర్వేదంలో ఎన్నో రకాల ఉపయోగాలు కలిగిస్తుంది. ఈ మొక్క ఎన్నో ఆరోగ్య ఉపయోగాలను అనేక రకాల గా సహాయపడుతుంది. ఇప్పుడు ముందుగా ఈ పువ్వులను వినియోగించి మొహం గ్లోగా అవ్వడం కోసం ఓ క్రీమ్ ని తయారు చేయబోతున్నాం..
దానికోసం ఈ పువ్వులను లేదా సింగపూరు పువ్వులను తీసుకొని ఒక గాజు సీసాలో వెయ్యాలి. దీనిలో ఒక గ్లాస్ వేడి నీటిని పోసుకోవాలి. నీళ్లు పోసుకుని మూత పెట్టాలి. కొద్దిసేపటికి పువ్వులు రంగులోకి నీళ్లు కూడా మారిపోతాయి. ఒక గంట తర్వాత పువ్వులు మరియు నీళ్లు మిక్సీ జార్లో వేసుకొని బాగా మెత్తని పేస్టులా పట్టుకోవాలి. దీనిని స్రైనర్ తో వాడ పోసుకోవాలి. నీళ్లను తీసుకొని పక్కన ఉంచుకోవాలి. ఆ తర్వాత ఒక బౌల్ తీసుకొని రెండు స్పూన్ల కార్న్ ఫ్లోర్ తీసుకోవాలి. దీనిలో ఆ ఫ్లవర్ వాటర్ ని కూడా వేసుకొని బాగా క్రీమ్ లా వచ్చేలా కలుపుకోవాలి. తర్వాత స్టవ్ మీద బౌల్ పెట్టి నీళ్లను వేసి బాగా మరగబెట్టుకోవాలి. ఈ నీటిని ముందుగా కలుపుకున్న కార్న్ ఫ్లోర్ మిశ్రమాన్ని పెట్టి మళ్ళీ మరగ పెట్టుకోవాలి. ఈ మిశ్రమం క్రీం లా అయ్యే వరకు బాగా తిప్పుతూ ఉండాలి. తర్వాత స్టౌ ఆపుకొని ఈ మిశ్రమం చల్లారే వరకు పక్కన ఉంచుకోవాలి.
తర్వాత మరొక బౌల్ ని తీసుకొని ఒక స్పూను అలోవెరా జెల్లి కూడా తీసుకోవాలి. దీనికోసం ప్లాంట్ బేస్ అలోవెరా జెల్లీ ఉపయోగించవచ్చు. తర్వాత దీనిలో ఒక విటమిన్ ఈ క్యాప్సిల్ కూడా వేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని మనం ముందుగా తయారుచేసి పెట్టుకున్న కార్న్ ఫ్లోర్ అలాగే శంఖం పువ్వుల నీళ్లతో చేసుకున్న మిశ్రమంలో మిక్స్ చేసుకోవాలి. ఈ క్రీమ్ హెయిర్ టైట్ కంటైనర్ లో పెట్టి ఫ్రిజ్లో స్టోర్ చేసుకోవాలి. ఫ్రిజ్లో రెండు నెలల వరకు ఈ మిశ్రమం నిల్వ ఉంటుంది. ఈ క్రీమ్ ప్రతిరోజు ముఖానికి పెట్టుకుని ఐదు నిమిషాల పాటు మృదువుగా మసాజ్ చేసుకున్నట్లయితే చాలా బాగా ఉపయోగపడుతుంది. దీనిని వాడడం వలన డార్క్ సర్కిల్స్ ,అలాగే ముడతలు, నల్లటి మచ్చలు సమస్యలు అన్ని తగ్గిపోయి ఫేస్ గ్లో గా మారుతుంది. దీని వలన ఇంకా ఎన్నో రకాల సమస్యలు కూడా తగ్గిపోతాయి.
Gajakesari Rajayoga : జ్యోతిష్య శాస్త్రం ప్రకారం నవంబర్ నెలలో గ్రహాల సంచలనం వలన కొన్ని అద్భుతమైన రాజయోగాలు ఏర్పడబోతున్నాయి. పవిత్రమైన…
Mustard Oil : వంటల్లోనే కాదు చర్మ సంరక్షణలో కూడా ఆవనూనె ప్రత్యేకమైన పాత్రను పోషిస్తుంది. అయితే చలికాలంలో ఆవనూనెతో…
Karthika Purnima : ఈ ఏడాది కార్తీక మాసంలో ఇప్పటికే రెండు సోమవారాలు ఏకాదశులు ముగిశాయి. ఇక్కడ నవంబర్ 15వ…
Celebrity Couple : ఇటీవలి కాలంలో చాలా మంది సెలబ్రిటీలు చిన్న చిన్న కారణాలకి విడాకులు తీసుకుంటున్నారు. ఇన్నేళ్ల సంసారంలో…
Bigg Boss Telugu 8 : ప్రస్తుతం బిగ్ బాస్ హౌజ్‌లో ఫ్యామిలీ వీక్ నడుస్తుంది. ఇవి చాలా ఎమోషనల్‌గా…
Brahmam Gari Kalagnanam : ప్రపంచంలో ఒకవైపు ప్రమాదాలు మరోవైపు భారీ నష్టం. ఎక్కడ చూసినా విధ్వంసమే. వరదలు భూకంపాలు అగోరీలు..…
Electric Cycle : మీరు ఉత్తమ శ్రేణి, పనితీరు మరియు ఫీచర్ల యొక్క ఖచ్చితమైన సమ్మేళనాన్ని అందించే విశ్వసనీయ మరియు…
Jamili Elections : కేంద్రం జమిలి దిశగా వేగంగా అడుగులు వేస్తుండడం మనం చూస్తూ ఉన్నాం. మహారాష్ట్ర, జార్ఖండ్ తో…
This website uses cookies.