Methi Egg Recipe : ఈరోజు మన రెసిపీ వచ్చేసి అమేజింగ్ మెంతి గుడ్డు కూర. దీని టేస్ట్ చాలా అంటే చాలా బాగుంటుంది. వేడివేడి అన్నంలో దీని టేస్ట్ ఆమోగంగా ఉంటుంది. ఈ శీతాకాలంలో ఎక్కువగా మెంతికూర దొరుకుతూ ఉంటుంది. ఈ ఎగ్ కర్రీ చేసుకున్న రోజున ఒక చారు చేసుకుంటే ఇక ఆరోజు అద్భుతమైన మీల్స్ అని చెప్పవచ్చు.. ఈ మెంతి గుడ్డు కూర ఎలా తయారు చేయాలో ఇప్పుడు మనం చూద్దాం.. దీనికి కావలసిన పదార్థాలు : గుడ్లు, ఆయిల్ ,జీలకర్ర, ఉల్లిపాయలు, టమాటాలు, మెంతికూర ,పసుపు, కారం ,ఉప్పు, గరం మసాలా, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్టు, ధనియాల పొడి జీలకర్ర పొడి వాటర్, కసూరి మేతి మొదలైనవి..
దీని తయారీ విధానం : ముందుగా స్టవ్ పై ఒక కడాయి పెట్టుకుని దానిలో రెండు స్పూన్ల ఆయిల్ వేసి ఉడకబెట్టుకున్న నాలుగు గుడ్లకు ఘాట్లు పెట్టి ఆయిల్లో వేసి దానిలో కొంచెం పసుపు కూడా వేసి మంచిగా వేయించి తీసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత అదే ప్యాన్ లో కొంచెం ఆయిల్ వేసి కొంచెం జీలకర్ర వేసి జీలకర్ర చిటపటలాడిన తర్వాత ఒక కప్పు ఉల్లిపాయలు వేసి దానిలో కొంచెం ఉప్పు వేసి బాగా మగ్గనివ్వాలి. ఉల్లిపాయలు మగ్గిన తర్వాత పావు కప్పు పచ్చిమిర్చి వేసి వేయించాలి. తర్వాత ఒక స్పూను ధనియాల పౌడర్, ఒక స్పూను జీలకర్ర పొడి, ఒక స్పూన్ కారం, ఒక స్పూన్ ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. తర్వాత ఒక కప్పు వాటర్ ని పోసి ఆ వాటర్ అంత ఇంకిపోయే వరకు వేయించుకోవాలి. తర్వాత నాలుగైదు పండిన టమాటాలను జ్యూస్లా చేసి దానిలో వేసి ఆయిల్ సపరేట్ అయ్యేవరకు ఉడికించుకోవాలి.
Methi Egg Maslaa Recipe in Telugu
దాన్నుంచి ఆయిల్ సపరేట్ అయిన తర్వాత ముందుగా కడిగి శుభ్రం చేసుకున్న మెంతి ఆకులను కూడా వేసి ఆకు పసర వాసన పోయే వరకు బాగా ఉడికించుకోవాలి. తర్వాత దానిలో మళ్లీ ఒక కప్పు వాటర్ ని పోసి బాగా ఉడకనివ్వాలి. ఆ విధంగా ఉడికిన కూరలో ముందుగా వేయించి పెట్టుకున్న కోడిగుడ్లను వేసి కొంచెం కసూరి మేతి బాగా నలిపి వేయాలి. ఆ విధంగా వేసిన తర్వాత మూత పెట్టి 15 నిమిషాల పాటు బాగా ఆయిల్ సపరేట్ అయ్యేవరకు ఉడికించుకోవాలి.అంతే అలా పది పదిహేను నిమిషాల పాటు ఉడికిన తర్వాత కూర దగ్గరగా అయిన తర్వాత ఆ కూరని తీసి వేరే బౌల్లో సర్వ్ చేసుకోవాలి. అంతే ఎంతో సింపుల్గా బ్యాచిలర్,సు లేదా వంట రాని వాళ్లు కూడా ఈజీగా చేసుకోవచ్చు. ఈ కూర వేడివేడి అన్నంలోకి ఆమోగంగా ఉంటుంది.
Vivo | స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో గట్టి పోటీ నడుస్తున్న ఈ రోజుల్లో ప్రముఖ మొబైల్ బ్రాండ్ వివో (Vivo) తన…
Jupitar Price | దేశవ్యాప్తంగా జీఎస్టీ రేట్లలో మార్పులు సెప్టెంబర్ 22 నుంచి అమల్లోకి వచ్చిన నేపథ్యంలో, ప్రముఖ ద్విచక్ర…
Asia Cup 2025 | పాకిస్తాన్‌తో జరగబోయే ఫైనల్‌లో గెలిచి ఆసియా కప్ 2025 ట్రోఫీని కైవసం చేసుకోవాలని సూర్య…
Aghori | రాష్ట్రంలో సంచలనం సృష్టించిన అఘోరీ – వర్షిణి వ్యవహారం మళ్లీ వార్తల్లోకెక్కింది. అఘోరీని పోలీసులు అరెస్ట్ చేసి…
Raja Saab | రెబల్ స్టార్ ప్రభాస్ ఫ్యాన్స్ ఎంతో ఈగర్ వెయిట్ చేస్తున్న చిత్రాల్లో 'రాజాసాబ్' ఒకటి. చాలా…
Telangana | తెలంగాణ రాష్ట్రంలో వర్షాలు దంచికొడుతున్నాయి. రాష్ట్రంలో ఇప్పటికే పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తుండగా, వచ్చే రెండు…
Makhana | బరువు తగ్గాలనుకుంటున్నారా? డయాబెటిస్‌ను నియంత్రించాలనుకుంటున్నారా? ఎముకల బలహీనతతో బాధపడుతున్నారా? అయితే మీరు మఖానాను తప్పక మీ రోజువారీ…
Salt | ఉప్పు లేకుండా మన రోజువారీ ఆహారం అసంపూర్ణమే. వంటల్లో రుచి కోసం, ఆహారంలో ఫ్లేవర్ కోసం, చివరికి…
This website uses cookies.