Mutton Biryani Recipe : ఇప్పటివరకు మీకు ఎవ్వరూ చెప్పని టిప్స్ తో మటన్ బిర్యానీ.. పిల్లలు కూడా సింపుల్ గా చేస్తారు…!

Mutton Biryani Recipe : ఈరోజు నేను మీకు మటన్ పులావ్ కుక్కర్లో చేసి చూపిస్తున్నాను. మీకు పర్ఫెక్ట్ గా రావాలి అంటే ఎలా చేసుకోవాలో చేసి చూపిస్తాను. ఒక్కసారి చేసి చూడండి చాలా బాగుంటుంది. ఫస్ట్ టైం చేసుకునే వాళ్ళు కూడా చాలా ఈజీగా అర్థమయ్యేటట్లు సింపుల్ గా చేసుకునే విధంగా చెప్తాను. మరి ఈ మటన్ పులావ్ ని ఎలా తయారు చేయాలో చూపిస్తాను చూడండి. దీనికి కావాల్సిన పదార్థాలు : మటన్, బాస్మతి రైస్, ఓల్ గరం మసాలా, పసుపు, కారం, ఉప్పు, కొత్తిమీర, పుదీనా, పెరుగు, ఉల్లిపాయలు, జీలకర్ర పొడి, ధనియాల పౌడర్, గరం మసాలా మొదలైనవి… దీని తయారీ విధానం : ఫస్ట్ ఇక్కడ శుభ్రంగా కడిగిన మటన్ ని ఆఫ్ కేజీ తీసుకున్నానండి దాన్లో ఆఫ్ టీస్పూన్ జీలకర్ర పొడి వేసుకోండి. అలాగే ఒక టీ స్పూన్ గరం మసాలా పౌడర్ దీంట్లోనే ఒక టీ స్పూన్ దాకా బిర్యానీ మసాలా పౌడర్ వేసుకోండి. అలాగే ఒక టేబుల్ స్పూన్ దాకా వేయించి పొడి చేసి పెట్టుకున్న ధనియాల పొడి వేసుకోండి.

ఒక టేబుల్ స్పూన్ కారము, ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా పుదీనాను తీసుకొని వేసుకోండి. ఆ ఫ్లేవర్ కూడా మటన్ ముక్కలకి బాగా పడుతుంది. కారం తక్కువ ఉన్న పచ్చిమిరపకాయలు మీరు ఇంకొకరు ఉన్న ఎక్స్ట్రా వేసుకోవచ్చు. దీంట్లోనే ఒక హాఫ్ టీ స్పూన్ దాకా మిరియాల పొడి వేయండి. ఒకటి లేదా రెండు టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకోండి. అలాగే లాస్ట్ గా ఒక కప్పు దాక పెరుగు కూడా వేసుకొని వీటిలో మొత్తాన్ని బాగా కలపండి. ఇలా బాగా కలిపేసి మొత్తం బాగా కలిసేటట్టు కలుపుకున్న తర్వాత ఈ బౌల్ కి మూత పెట్టేసి ఒక గంట బాగా నాననివ్వండి. ఈ బౌల్ ని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు మళ్లీ ఇంకొక బౌల్ తీసుకొని దీంట్లో రెండు గ్లాసులు బాస్మతి రైస్ వేసుకోండి. ఇప్పుడు రైస్ కడిగిన తర్వాత దీంట్లో రైస్ మునిగేంత వరకు నీళ్లు పోసేసి బౌల్ కి మూత పెట్టి ఈ రైస్ ని కూడా ఒక గంట పాటు నానబెట్టండి. ఇప్పుడు ఒక గంట తర్వాత కుక్కర్లో ఒక నాలుగు టేబుల్ స్పూన్ దాక ఆయిల్ వేసుకోండి.

Mutton Biryani Recipe in Telugu

మీకు కావాలంటే చెక్క వేసుకోండి. దీంట్లోనే జాపత్రి కొద్దిగా ఎక్కువ వేసుకోవచ్చు. యాలకులు, నాలుగు లవంగాలు, బ్లాక్ స్టోన్ ఫ్లవర్ కొద్దిగా వేసుకోండి .దీంతోనే మీకు ఆ బిర్యాని ఫ్లవర్ చాలా బాగుంటుందండి. కంపల్సరీ వేసుకోండి. అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ దాకా సాజీరా కూడా వేసుకొని ఈ మసాలా దినుసులు అన్ని ఏవి మాడకుండా దోరగా వేయించండి. ఇప్పుడు ఈ మసాలా దినుసులు ఇలా వేగిన తర్వాత దీంట్లో పెద్ద సైజు రెండు ఉల్లిపాయలు తీసుకొని ఈ ఉల్లిపాయ ముక్కలు మాడకుండా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు వేయించండి. ఈ ఉల్లిపాయల్లోంచి కొంచెం తీసి పక్కన పెట్టుకోండి. తర్వాత మటన్ ముక్కలు వేసి బాగా అలా వేగనివ్వండి. ఈ మటన్ లో నుంచి మీకు కొద్దిగా నీళ్లు ఊరి ఆ నీళ్లు పూర్తిగా ఇంకిపోయి కొంచెం ఆయిల్ సపరేట్ అయ్యి మటన్ అనేది బాగా వేగింది కదా బాగా వేగాలండి. ఈ మటన్ ముక్కలన్నింటినీ ఒక బౌల్ లోకి తీసి పెట్టుకోండి.

ఈ జ్యూస్ ఉంటుంది కదా మటన్ జ్యూస్ అనేది ఒక గ్లాస్ తో కొల్చుకున్నారు. కొలత అనేది మీకు ఈజీగా అర్థమవుతుంది. మీకు ఇలా ముక్కలు అన్నిటిని సపరేట్ చేసి పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఈ మటన్ సూప్ ని మీరు ఏ గ్లాస్ తో అయితే బాస్మతి రైస్ తీసుకుంటారో అదే గ్లాస్ తోటి కోల్చుకోండి ఎన్ని గ్లాసులు వచ్చాయి అని అర్థమవుతుంది. మీకు నాకు ఇక్కడ ఒక గ్లాసు వచ్చేసింది. అలాగే కొద్దిగా మిగిలిందండి. అంటే ఇంకొక పావు గ్లాస్ దాకా ఉంటుంది. అంటే ఇలా కొలుచుకున్న తర్వాత ఈ మటన్ సూప్ ని ఇప్పుడు అదే కుక్కర్ లో వేసేసి దీంట్లోనే ఆల్రెడీ మనం పక్కన తీసి పెట్టుకుని మటన్ ముక్కల్ని కూడా వేయండి. మటన్ వేసిన తర్వాత మళ్ళీ స్టవ్ ఆన్ చేసేసి ఆల్రెడీ మనం నానబెట్టి పక్కన పెట్టుకున్నాం కదా ఈ బాస్మతి రైస్ మొత్తం వేసుకోండి. తర్వాత అదే గ్లాస్ తోటి కొలుచుకొని రెండు గ్లాసులు నీళ్లు పోసుకోండి కదా..

ఇంకొక రెండు గ్లాసులు అంటే మొత్తం మూడు గ్లాసులు నీళ్లు పోసాను. అంటే ఒక గ్లాస్ బాస్మతి రైస్ కి 1 1/2 గ్లాస్ నీళ్లు పోసుకోవాలి. కరెక్ట్ గా సరిపోతుంది మీకు. ఇలా మొత్తం కలిపేసిన తర్వాత ఒకసారి సూప్ ని టేస్ట్ చూసుకొని ఉప్పు, కారం సరిపోలేదు అనిపిస్తే మీ టేస్ట్ కి తగ్గట్టు ఉప్పు కారం వేసుకొని కలుపుకోండి. దీంట్లోనే కొద్దిగా కొత్తిమీర ,పుదీనాను కూడా తుంచుకొని వేసుకోండి. అలాగే ఒక టేబుల్ స్పూన్ దాకా నెయ్యి వేసుకోండి. నెయ్యి ఫ్లేవర్ బాగుంటుంది. ఇప్పుడు ఇవన్నీ వేసుకున్న తర్వాత ఈ రైస్ అనేది విరిగిపోకుండా నిదానంగా కలిపేసి కుక్కర్ కి మూత పెట్టేసి ఫ్లేమ్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టి ఒకే ఒక విజిల్ రానివ్వండి. అంతకంటే ఎక్కువ రానివ్వదు ఒక్క విజిల్ వచ్చిన తర్వాత ప్రెషర్ మొత్తం పోయి ఒక పది నిమిషాలు ఆగి అప్పుడు మూత ఓపెన్ చేస్తే పర్ఫెక్ట్ గా పులావ్ రెడీ అయిపోయింది. దీన్ని మీరు రైతాతో తినొచ్చు..

Recent Posts

ISRO-ICRB Recruitment : ఇంజినీరింగ్ గ్రాడ్యూయేట్ల‌కు శుభ‌వార్త‌.. ఇస్త్రోలో సైంటిస్ట్/ఇంజినీర్ రిక్రూట్‌మెంట్‌కు ద‌ర‌ఖాస్తులు

ISRO-ICRB Recruitment : ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్- ఇస్రో సెంట్రలైజ్డ్ రిక్రూట్‌మెంట్ బోర్డ్ (ISRO-ICRB) సైంటిస్ట్/ఇంజనీర్ పోస్టుల కోసం…

49 minutes ago

Jeera Water : మీ ఆరోగ్యాన్ని కాపాడే దివ్య ఔషధం మీ ఇంట్లోనే ఉంది… ఏమిటో తెలుసా… ఆ వ్యాధులకు చెక్…?

Jeera Water : మన వంటింట్లోనే నిక్షిప్తమై ఉన్నానా వస్తువులతోనే మన ఆరోగ్యాన్ని ఈజీగా కాపాడుకోవచ్చు. కానీ వీటిని చాలామంది…

2 hours ago

Zodiac Signs : కేతువు, సూర్యుడు కలయికతో ఈ రాశుల వారికి… కూర్చొని తిన్న తరగని ఆస్తి వరించబోతుంది…?

Zodiac Signs : ఈ 2025వ సంవత్సరములో ఈ రాశుల వారికి ఎంతో అదృష్టం కలగబోతుంది. పేద జ్యోతిష్య శాస్త్రాలలో…

3 hours ago

Chandrababu : మహానాడు వేదికపై రైతులకు గొప్ప శుభవార్త తెలిపిన సీఎం చంద్రబాబు

Chandrababu  : ఆంధ్రప్రదేశ్ Andhra pradesh CM ముఖ్యమంత్రి Nara Chandrababu Naidu నారా చంద్రబాబు నాయుడు మహానాడు సభలో…

12 hours ago

Chandrababu Naidu : మహానాడు వేదికపై మహిళలకు శుభవార్త తెలిపిన చంద్రబాబు

Chandrababu Naidu : 2025 మహానాడు సభలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మహిళల సంక్షేమంపై పలు కీలక ప్రకటనలు…

13 hours ago

TDP Mahanadu : మహానాడు వేదిక పై పార్టీలో కొందరు కోవర్టులు ఉన్నారంటూ సంచలన వ్యాఖ్యలు చేసిన చంద్రబాబు

TDP Mahanadu : 2025 మహానాడు వేదికపై ఆంధ్రప్రదేశ్ Andhra pradesh CM Chandrababu ముఖ్యమంత్రి, టీడీపీ TDP అధినేత…

14 hours ago

Jr NTR : తాత జయంతి సందర్బంగా జూనియర్ ఎన్టీఆర్ సంచ‌ల‌న‌ పోస్ట్..!

Jr NTR : ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు నందమూరి తారక రామారావు (ఎన్టీఆర్) గారి…

15 hours ago

Rajiv Yuva Vikasam Scheme : రాజీవ్ యువ వికాసం స్కీమ్‌కి అప్లై చేసుకున్న వారికి గుడ్ న్యూస్..!

Rajiv Yuva Vikasam Scheme : తెలంగాణ రాష్ట్రంలో ప్రజల సంక్షేమం, అభివృద్ధి లక్ష్యంగా ప్రభుత్వం అనేక నిర్ణ‌యాలు తీసుకుంటుండ‌డంపై…

16 hours ago