Categories: Food RecipesNews

Mutton Fry  Recipe మటన్ ఫ్రై ఇలా చేస్తే ముక్క గట్టిగా లేకుండా నోట్లో వేస్తే ఫాస్ట్ గా కరిగిపోతుంది…

Advertisement
Advertisement

Mutton Fry  Recipe ఈరోజు సూపర్ మటన్ ఫ్రై ఎలా చేయాలో చూడబోతున్నాము.. మటన్ తో అస్సలు ట్రై చెయ్యరు.. చాలామందికి నచ్చదు.. కాబట్టి ఇలా చేసిన తర్వాత చికెన్ ఫ్రై కన్నా ఎక్కువ మీరు మటన్ ఫ్రై చేయాలనుకుంటారు అంతే. ఈ రెసిపీని మీరు ఇంట్లో చేసి పెడితే ఒక కప్పుకి బదులు రెండు కప్పులు వేసుకుని తినేస్తారండి.. అంత టేస్టీగా ఉంటుందన్నమాట.. మరి ఇంత నొక్కి చెప్తున్నా కూడా ఈ రెసిపీ టేస్టీ మీరు ఎందుకు మిస్ అవ్వాలి.. ఇంట్లో డెఫినెట్ గా ట్రై చేసేయండి. ఈ మటన్ ఫ్రై ఎలా చేయాలో ఇప్పుడు మనం చూద్దాం..దీనికి కావలసిన పదార్థాలు: మటన్, ఆయిల్, ఉప్పు, పసుపు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్ ,జీలకర్ర పొడి, ధనియా పౌడర్, గరం మసాలా, మటన్ మసాలా, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర ,పుదీనా, పెరుగు ,ఉల్లిపాయలు, వేల్లుల్లి, జీడిపప్పు మొదలైనవి…

Advertisement

తయారీ విధానం: స్టవ్ పై ప్రెజర్ కుక్కర్ పెట్టి అందులోకి ఒక టేబుల్ స్పూన్ దాకా నూనె వేసుకోండి. నూనె కొంచెం హీట్ అయ్యాక ఇందులోనే ఒక టేబుల్ స్పూన్ దాకా ఫ్రెష్ గా దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కొద్దిగా ఫ్రై చేయండి. ఆ తర్వాత శుభ్రంగా క్లీన్ చేసుకుని వాష్ చేసుకున్న మీడియం సైజ్ మటన్ ముక్కలు వేసుకోండి. కలుపుతూ ఫ్రై చేయండి. కొద్దిగా పచ్చివాసన పోయిన తర్వాత ఇందులోకి అర టీ స్పూన్ దాకా పసుపు ఒక టీ స్పూన్ దాకా ఉప్పు రెండు టీ స్పూన్ల దాకా కారం వేయండి. ఈ స్పైసెస్ కూడా వేసి రెండు మూడు నిమిషాల పాటు గరిటతో కలుపుతూ కొంచెం నూనెలో ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత మటన్ ఉడకడం కోసం ఒక కప్పు దాకా నీళ్లు వేసుకుని ఐదారు విజిల్స్ వచ్చేంతవరకు ఉడికించుకంటే సరిపోతుంది. మొత్తానికి మటన్ ముక్క అనేది మెత్తగా ఆవాలి. మెత్తగా ఉడికించుకున్న తర్వాత దీన్ని పక్కన పెట్టేసేయండి. ఇప్పుడు స్టవ్ మీద మందంగా ఉండే కడాయి పెట్టుకోనీ నాలుగు స్పూన్ల ఆయిల్ , ఒక టేబుల్ స్పూన్ దాకా నెయ్యి వేసుకోండి. ఇందులోకి రెండు మూడు టేబుల్ స్పూన్ల దాకా జీడిపప్పు పలుకులు వేసి మంచి గోల్డెన్ కలర్ వచ్చేంతవరకు బాగా ఫ్రై చేసుకుని ఒక పక్కన పెట్టుకోండి.ఇక దానిలో ఒక టేబుల్ స్పూన్ దాకా బాగా సన్నగా కట్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి తరుగు వేసి కొంచెం ఫ్రై చేయండి. ఆ తర్వాత ఒక కప్పు దాకా ఒక సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లి తరుగు కూడా వేసి ఉల్లిపాయ ముక్కలు గోల్డెన్ కలర్ వచ్చేంతవరకు బాగా ఫ్రై చేయాలి.

Advertisement

తర్వాత ఇందులోకి ఒక రెండు టేబుల్ స్పూన్ల దాకా సన్నగా తరిగి పెట్టుకున్న పుదీనా తరుగును కూడా వేసి కొంచెం ఫ్రై చేయండి. ఇలా అన్నీ కూడా బాగా వేగిపోయాక మనం ఉడికించుకుని పక్కన పెట్టుకున్న మటన్ ని వాటర్ తో సహా వేసేసేయండి. గ్రేవీతో సహా వేసేసుకోవాలి. ఇప్పుడు వెంటనే హై ఫ్లేమ్ లో పెట్టి ఈ వాటర్ అంతా కూడా గ్రేవీ అంతా దగ్గరికి ఉడికిపోయేంతవరకు మధ్య మధ్యలో గరిటతో కలుపుకుంటూ దగ్గరికి ఫ్రై చేయండి. గ్రేవీ అంతా దగ్గరికి విగరడానికి కనీసం ఒక ఐదు పది నిమిషాలు అయినా టైం పడుతుంది. హై ఫ్లేమ్ లో ఫ్రై చేసుకుంటే కొంచెం చిక్కబడిన తర్వాత ఇందులోనే ఒక రెండు టేబుల్ స్పూన్ల దాకా పెరుగు కూడా వేసుకోండి. ఆయిల్ అనేది సపరేట్ అవుతుంది కదా.. మనకి మటన్ ఫ్రై ఆల్మోస్ట్ రెడీ అయిపోయినట్లే నూనె వదులుతున్నప్పుడు మంటని ఇప్పుడు మీడియంలోకి టర్న్ చేసేసేయండి. మనం ఆల్రెడీ ప్రెషర్ కుక్కర్ లో కుక్ చేసాము అండ్ ఆయిల్ లో కూడా బాగా ఫ్రై చేసుకుంటూ ఆ గ్రేవీతో పాటు ఉడికించాం కాబట్టి మటన్ ముక్క ఎక్కడ కూడా మీకు అస్సలు గట్టిగా ఉండదు. చికెన్ ముక్క కన్నా చాలా సాఫ్ట్ గా టెండర్ గా అయిపోతుంది. ఇలా మటన్ ఫ్రై ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది.ఇప్పుడు అలాగే రెండు రెమ్మలు కరివేపాకును, పచ్చిమిర్చి చీలికలు కూడా వేసి మీడియం ఫ్లేమ్ లో ఒక టూ మినిట్స్ పాటు ఫ్రై చేయండి.. అలాగే ఇందులో ఇప్పుడు హాఫ్ టీ స్పూన్ దాకా మిరియాల పొడి, ఒక టీ స్పూన్ దాకా ధనియాల పొడి, అర టీ స్పూన్ దాకా జీలకర్ర పొడి, అలాగే ఒక టీ స్పూన్ దాకా స్పెషల్ మటన్ మసాలా పౌడర్ గనుక ఉంటే అదైనా యూస్ చేసుకోవచ్చు. లేదంటే గరం మసాలా పౌడర్ అయినా వాడుకోవచ్చు. ఈ మసాలాలు వేసిన తర్వాత ఒక్కసారి బాగా కిందికి పైకి కూడా మీడియం ఫ్లేమ్ లో కలపండి. ఫ్లేవర్స్ అన్నీ కూడా మటన్కి చక్కగా పట్టాక దించే ముందుగా మనం వేయించుకుని పక్కన పెట్టుకున్న జీడిపప్పు పలుకులు వేసేసేయండి. అలాగే ఒక టీ స్పూన్ దాకా క్రష్ చేసుకున్న కసూరి మేతి, రెండు టేబుల్ స్పూన్ల దాకా సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర కూడా చల్లేసేసి బాగా కలిపేసుకుని పక్కకు దించేసేయడమే.. అంతేనండి సూపర్ టేస్టీగా అరోమాటిక్గా గుమగుమలాడే మటన్ ఫ్రై జ్యూసీగా టెండర్ గా రెడీ అయిపోతుంది. ఎంత బాగుంటుంది అంటే అది నేను మాటల్లో చెప్పలేను అనమాట..

Advertisement

Recent Posts

Raviteja : విలన్ పాత్రలకు రెడీ అంటున్న మాస్ రాజా..!

Raviteja : మాస్ మహరాజ్ రవితేజ హీరోగా తన కెరీర్ ఎండ్ అయ్యిందని ఫిక్స్ అయ్యాడా.. అదేంటి ఆయన వరుస…

3 hours ago

Electric Vehicles : ఎలక్ట్రిక్ వాహనాల కోసం PM E-డ్రైవ్ పథకం ప్రారంభం..!

Electric Vehicles : భారత ప్రభుత్వం PM ఎలక్ట్రిక్ డ్రైవ్ రివల్యూషన్ ఇన్ ఇన్నోవేటివ్ వెహికల్ ఎన్‌హాన్స్‌మెంట్ (PM E-డ్రైవ్)…

4 hours ago

TGSRTC : జాబ్ నోటిఫికేషన్.. నెలకు 50 వేల జీతంతో ఉద్యోగాలు..!

TGSRTC : తెలంగాణా ఆర్టీసీ సంస్థ నుంచి నోటిఫికేషన్ వచ్చింది. TGSRTC నుంచి ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్, ట్యూటర్ పోస్టులకు…

5 hours ago

Jr NTR : ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుని ఎన్టీఆర్ కలుస్తున్నాడు..!

Jr NTR : సినిమాలు రాజకీయాలు వేరైనా కొందరు సినీ ప్రముఖులు నిత్యం రాజకీయాల్లో ప్రత్యేక టాపిక్ గా ఉంటారు.…

6 hours ago

Ganesh Nimajjanam : గణేష్ నిమజ్జనాలు.. పోలీసుల కీలక రూల్స్ ఇవీ.. పాటించకపోతే అంతే సంగతులు..!

Ganesh Nimajjanam : దేశవ్యాప్తంగా గణేష్ నవరాత్రోత్సవాలు అద్భుతంగా జరుగుతున్నాయి. వినాయకుడికి దేశవ్యాప్తంగా పూజలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. తెలంగాణాలో…

7 hours ago

Revanth Reddy : కేసీఆర్ లక్కీ నంబర్ నా దగ్గర ఉంది.. నన్నేం చేయలేరన్న రేవంత్ రెడ్డి..!

Revanth Reddy : పార్టీ మారిన తెలంగాణా బీ ఆర్ ఎస్ ఎమ్మెల్యేలపై అసెంబ్లీ స్పీకర్ నిర్ణయం కీకలం కానుంది.…

8 hours ago

Shekar Basha : బిగ్ బాస్ నుండి అనూహ్యంగా శేఖ‌ర్ భాషా బ‌య‌ట‌కు రావ‌డానికి కార‌ణం ఇదేనా?

Shekar Basha : బిగ్‌బాస్ తెలుగు 8 స‌క్సెస్ ఫుల్‌గా రెండు వారాలు పూర్తి చేసుకుంది. 14 మంది కంటెస్టెంట్స్…

9 hours ago

Liquor : మందు బాబుల‌కి కిక్కే కిక్కు.. ఇక రానున్న రోజుల‌లో ర‌చ్చ మాములుగా ఉండ‌దు..!

Liquor : ఏపీలో కొత్త మద్యం పాలసీపై కసరత్తు దాదాపు ముగిసింది అనే చెప్పాలి. 2019 కంటే ముందు రాష్ట్రంలో…

10 hours ago

This website uses cookies.