Home » Exclusive » Nuvvula Laddu Recipe In Telugu
Exclusive

Nuvvula Laddu Recipe : సంక్రాంతి స్పెషల్ నువ్వుల లడ్డు ఇదొక్కటి కలిపి ఏ బెల్లంతో చేసిన సాఫ్ట్ గా వస్తాయి..!!

Authored By
Prahbas Gilakathula
The Telugu News | Updated on: January 6, 2023 11:37 pm
Advertisement

Nuvvula Laddu Recipe : ఈరోజు మన రెసిపీ వచ్చేసి సంక్రాంతి స్పెషల్ నువ్వుల లడ్డు. ఈ లడ్డు చాలా ఈజీగా బాగా కుదిరేలా ఎలా చేయాలో చూపించబోతున్నాం.. క్యాలిష్యం పుష్కలంగా ఉండే ఈ నువ్వుల లడ్డు రోజుకి ఒక్కటి తిన్న చాలు ఎముకలు దృఢంగా మారుతాయి. అదేవిధంగా మనం ఈ సంక్రాంతి పండక్కి నువ్వుల లడ్డు ప్రిపేర్ చేసుకుంటూ ఉంటాం కదా. ఓసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి ఎన్ని రోజులైనా ఎన్ని గంటలైనా లడ్డు గట్టిపడకుండా మృదువుగా సాఫ్ట్ గా ఉంటుంది. ఈ సాఫ్ట్ గా ఉండే లడ్డుని ఎలా తయారు చేయాలో ఇప్పుడు మనం చూద్దాం.. దీనికి కావాల్సిన పదార్థాలు : నువ్వులు, బెల్లం, పల్లీలు, నెయ్యి, సోడా ఉప్పు, మొదలైనవి…

Advertisement

దీని తయారీ విధానం : ముందుగా ఒక స్టవ్ పై ఒక కడాయి పెట్టుకుని ఒక కప్పు నువ్వులు వేసి లో ఫ్లేమ్ లో బాగా చిటపటలాడే వరకు వేయించుకోవాలి. ఆ నువ్వులు వేగిన తర్వాత వాటిని తీసి ఒక ప్లేట్లో పోసుకోవాలి. తర్వాత అదే కడాయిలో రెండు స్పూన్ల పల్లీలు కూడా వేసి వేయించి తీసి వేరే ప్లేట్లోకి పోసుకుని వాటి పొట్టంతా తీసేసి పలుకులు పలుకులుగా చేసుకోవాలి.. తర్వాత అదే కడాయిలో పావు కిలో నువ్వులకి పావుకిలో బెల్లం తీసుకొని తురుముకొని దాన్లో వేయాలి. తర్వాత ఒక పావుకప్పు నీళ్లను వేసి బాగా కరిగించాలి. తర్వాత బెల్లం కరిగిన తర్వాత దానిని ఫిల్టర్ చేసుకోవాలి. వడకట్టుకున్న బెల్లం నీళ్ళని మళ్లీ కడాయిలో పోసుకొని పాకాన్ని ప్రిపేర్ చేసుకోవాలి. పాకం ప్రిపేర్ అయిన తర్వాత కొంచెం వంట సోడా వేసుకోవాలి.

nuvvula laddu recipe in telugu

Advertisement

ఈ వంట సోడా ఈ పాకంలో వేయడం వలన పాకం మంచిగా నురగ నురగగా వస్తుంది. తర్వాత ఇది ముద్ద పాకం వచ్చేవరకు బాగా గరిటతో కలుపుతూ కాగనివ్వాలి. ముద్ద పాకం వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని ముందుగా వేయించి పెట్టుకున్న నువ్వులు, పల్లి పలుకులు వేసి బాగా కలుపుకోవాలి. తర్వాత ఈ పాన్ ని పక్కకు తీసుకొని స్పూన్ తో తీసుకుంటూ చేతికి కొంచెం నెయ్యిని రాసుకొని ఉండల్లా చుట్టుకోవాలి. ఇక అన్ని లడ్డూలను అలాగే చుట్టుకొని చల్లారిన తర్వాత ఒక డబ్బాలో స్టోర్ చేసుకుంటే ఎన్ని గంటలైనా ఎన్ని రోజులైనా కూడా ఎంతో సాఫ్ట్ గా ఉంటాయి. అలాగే ఎంతో రుచిగా కూడా వస్తాయి. ఈ సంక్రాంతికి తప్పకుండా ట్రై చేసి చూడండి..

Prahbas Gilakathula

Author Bio Info : Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com
Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి