Ragi Sangati Recipe : మన పూర్వీకులు లాంటి బలం కావాలంటే ఇలాంటి పాతకాలం వంటల్ని కనీసం వారంలో ఒక్కసారైనా తినడానికి ట్రై చేయండి. రాగి సంగటి అలాగే దీనికి కాంబినేషన్ గా పల్లి చారు అంటారు. ఈ రెండిటి కాంబినేషన్ అయితే చాలా చాలా బాగుంటుందండి. పిల్లలు కూడా ఇష్టంగా తినేస్తారు. మార్నింగ్ బ్రేక్ ఫాస్ట్ గా కాని మధ్యాహ్నం తినొచ్చు .చాలా ఈజీగా కూడా చేసుకోవచ్చు.. దీనికి కావాల్సిన పదార్థాలు : రాగి పిండి, ఉప్పు, వెన్న, పచ్చిమిర్చి, పల్లీలు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, ఎల్లిపాయలు, ఉల్లిపాయలు, చింతపండు,కొత్తిమీర, మొదలైనవి… ముందుగా రాగి సంగటి కోసం అడుగు మందంగా తీసుకోవాలి. దానిలో రెండు కప్పులు ఇందులో పోసేయకుండా ఇందులో నుంచి ఒక్క పావు కప్పునీలు పక్కన పెట్టేసుకోండి. అంటే మనం ఒకటి నీళ్లు పోసి పక్కన పెట్టేసుకోవాలి.. రెండు కప్పుల నీళ్లు తీసుకున్నాం కదా ఒక కప్పు రాగి పిండి తీసుకోవాలి. ఈ రాగి పిండిలో నుంచి రెండు టేబుల్ స్పూన్ల ఆగిపోయిన ఈ పావు కప్పు నీళ్లలో వేసి కలుపుకోవాలి.
ఈ పిండిని పక్కన పెట్టేసుకోండి. ఇది రాగి పిండి నీళ్లలో బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఉండలేమి లేకుండా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకొని పక్కన పెట్టేసుకోండి. దీంట్లో హాఫ్ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి. అలాగే మనం కలిపి పెట్టుకున్న రాగి పిండి మిశ్రమాన్ని ఒకసారి కలుపుకొని పోసుకోవాలి. రాగి పిండి ఉడికి ఇది కొంచెం చిక్కబడే జావలాగా ఉంటుంది. ఇలా ఉడుకుతున్నప్పుడు మిగిలిన రాగి పిండిని వేసేసుకోవాలి. ఇలా జావలాగా చేసుకున్న తర్వాత రాగి పిండి వేసి కలుపుకుంటే సంగటి ఉండలు కట్టకుండా చక్కగా వస్తుంది. దీన్ని ఈ విధంగా మధ్యలోకి ఇలా కలుపుతూ ఉంటే పిండంతా కూడా చక్కగా కలుస్తుంది. ఇక్కడి నుంచి ప్రాసెస్ అంతా కూడా లో ఫ్లేమ్ లోనే చేసుకోవాలి. బాగా కలిసిన తర్వాత ఈ విధంగా బాగా దగ్గరగా అయిన తర్వాత అంత ఈవెన్గా స్ప్రెడ్ చేసేసుకుని మూత పెట్టేసి చాలా లో ఫ్లేమ్ మీద ఐదు నిమిషాల పాటు ఉడికించుకోవాలి. అన్నిటికంటే తక్కువ మంటున్న దాని మీద పెట్టేసి ఐదు నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఐదు నిమిషాల తర్వాత చూస్తే రాగిసంకటి రెడీ అయితుంది.
ఇక దీనిలోకి చట్నీ కోసం పాన్ లో హాఫ్ టీ స్పూన్ నూనె వేసుకుని దానిలో పచ్చిమిర్చి వేసి వేయించి పక్కన పెట్టుకోవాలి. తర్వాత అదే పాన్ లో ఇంకొంచెం ఆయిల్ వేసి ఒక స్పూన్ ఆవాలు, ఒక స్పూన్ జీలకర్ర వేసి తర్వాత నాలుగైదు ఎండుమిర్చి తర్వాత ఉల్లిపాయ ముక్కలు, ఎల్లిపాయలు కూడా వేసి ఎర్రగా వేయించుకొని తర్వాత దానిలో కొద్దిగా కొత్తిమీర కూడా వేసి వేయించి తీసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఈ మిశ్రమం పచ్చిమిర్చి మిశ్రమం అలాగే ఒక పావు కప్పు వేయించిన పల్లీలను వేసి కొంచెం ఉప్పు, కొంచెం కరివేపాకు ఒక పావు కప్పు పచ్చి కొబ్బరి ముక్కలు, కొంచెం చింతపండు కూడా వేసి పల్లి చట్నీ లాగా పట్టి దాంట్లో పోపు వేసి పక్కన ఉంచుకోవడమే.. ఇక మనం ముందుగా చేసి పెట్టుకున్న రాగిసంకటిని బయటికి తీసి ఉండలా చేసి ఈ పల్లి చట్నీ ఒక గిన్నెలో వేసి ఈ ఉండల్ని దానిలో వేసి ఈ కాంబినేషన్తో తీసుకోవచ్చు. చాలా రుచిగా ఉంటుంది.
Maharashtra : మహారాష్ట్ర చరిత్రలో ప్రతిపక్ష నాయకుడు లేకపోవడం ఇదే తొలిసారి అని శివసేన నాయకురాలు షైన ఎన్‌సి అన్నారు.…
Ajit Pawar : మహారాష్ట్ర ఎన్నికల్లో బీజేపీ, శివసేన, ఎన్సీపీల మహాయుతి కూటమి ఘనవిజయం సాధించిన సంగతి తెలిసిందే. అయితే…
Hyderabad Air Quality : ఇన్నాళ్లు ఢిల్లీలో వాయి కాలుష్యం ఎక్కువ అని వినేవాళ్లం. కాని ఇప్పుడు హైదరాబాద్‌లో కూడా…
Devi Sri Prasad : పుష్ప2 మ్యూజిక్ విషయంలో దేవి శ్రీ ప్రసాద్‌కి నిర్మాతలకి గొడవలు జరిగినట్టు అనేక వార్తలు…
Groom Chase : అచ్చం సినిమాలో జరిగిన చేజ్ సీన్ విధంగా బయట ఓ సంఘటన జరిగింది. విలన్ పారిపోతుంటే…
Allu Arjun Pushpa 2 Kissik Song : ఇప్పుడు దేశ వ్యాప్తంగా ప్రతి ఒక్కరు ఎంతో ఆసక్తిగా పుష్న2…
Kangana Ranaut : మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో మహా వికాస్ అఘాడి ఘోర పరాజయం తర్వాత, బాలీవుడ్ నటి, బిజెపి…
Bigg Boss Telugu 8 : బుల్లితెర బిగ్ రియాలిటీ షో బిగ్ బాస్ కార్యక్రమం మరి కొద్ది రోజులలో…
This website uses cookies.