Aloo 65 Recipe : ఈరోజు మనం రెస్టారెంట్ స్టైల్ లో ఆలు 65 చేసుకోబోతున్నాం.. ఈ 65 చాలా రుచిగా ఉంటాయి. చాలా సింపుల్ గా చేసుకోవచ్చు.. అచ్చు రెస్టారెంట్ స్టైల్ లో ఆలు 65 ఎలా ఉంటుందో అలాగే వస్తుంది. మనకు ఇంట్లో చేస్తే ఇలా రాదు అనుకుంటాం. ఈ విధంగా చేసి చూడండి.. చాలా బాగా వస్తుంది.. దీనికి కావాల్సిన పదార్థాలు: బంగాళదుంపలు, పచ్చిమిర్చి, జీడిపప్పు, ఉప్పు, పసుపు, కారం, గ్రీన్ చిల్లి సాస్, కాన్ ఫ్లోర్, సెనగపిండి, బియ్యప్పిండి, ఫుడ్ కలర్, గరం మసాలా, జీలకర్ర పౌడర్, ధనియా పౌడర్, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆయిల్ మొదలైనవి.. దీని తయారీ విధానం; ఆలు 65 కి మీడియం సైజు బంగాళాదుంపలు నాలుగు తీసుకున్నానండి. బంగాళదుంపల్ని బాగా కడిగి చెక్కు తీసి చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఆలు 65 కి కట్ చేసుకుంటే బాగుంటుంది. ముక్కలన్నీ కట్ చేసుకున్నాక నీళ్లలో వేసుకోవాలండి. నీళ్లలో వేయడం వల్ల నలుపు రాకుండా ఉంటాయి. ఇలా ముక్కలని నీళ్ళల్లో వేసుకొని ఒక్క రెండు మూడు సార్లు అయినా బాగా కడుక్కోవాలి. ఇలా బాగా కడుక్కున్నాక మరిగించిన నీళ్లలో వేసుకోవాలి. నీళ్లు బాగా మరగాలి. ఇలా మరిగిన నీళ్ల మాత్రమే వేసుకోవాలి. నీళ్ల మరిగిన తర్వాత ముక్కల్లో వేసుకొని ఒక్క రెండు మూడు నిమిషాలు అయినా అలా ఉంచేసేయాలండి.
వెంటనే తీయకూడదు. బంగాళదుంప ముక్కలు ఇలా మరిగించిన నీళ్లలో వేయడం వల్ల ముక్క మెత్తబడి బాగా వేగుతాయి. లోపల వరకు క్రిస్పీగా కూడా వస్తాయి. తర్వాత ఈ విధంగా ఉంటాయి. నీళ్లు రాకుండా ముక్కలు మాత్రం ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ఇవి కాస్త చల్లారాలి. ఇవి బాగా చల్లారనివ్వండి. తగినంత ఉప్పు, పావు స్పూన్ పసుపు, తగినంత కారం కూడా కాస్త ఎక్కువ పడుతుంది. అర స్పూన్ ధనియాలు జీలకర్ర కలిపినప్పుడు అర స్పూన్ గరం మసాలా ఒక స్పూన్ గ్రీన్ చిల్లీ సాస్, గ్రీన్ చిల్లీ సాస్ గాని రెడ్ చిల్లీ సాస్ కానీ వేసుకోవచ్చు బాగుంటుంది. ఇలా ఇవన్నీ వేసి బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకున్నాక రెండు స్పూన్ల కార్న్ ఫ్లోర్ వేసుకోవాలి. ఒకవేళ మీ దగ్గర కార్న్ ఫ్లోర్ లేదనుకోండి. మొత్తం బియ్యపిండి వేసుకోవచ్చు. కార్న్ ఫ్లోర్ కు బదులుగా రెండు స్పూన్ల శెనగపిండి వేసుకోవాలి. మైదాపిండి కంటే శనగపిండి వేస్తేనే బావుంటుంది. కొద్దిగా ఫుడ్ కలర్ కోసమే మీకు వద్దు అనుకుంటే మానేయొచ్చు. ఇలా ఇవన్నీ వేసి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక కొంచెం నీళ్లు పోసుకుని కలుపుకోవాలి. నీళ్లు ఎక్కువ పట్టవండి. చూసి వేసుకోవాలి. పిండి లూస్ అవ్వకూడదు. గట్టిగా ఉండకూడదు.. ఒకవేళ మీకు పిండి తక్కువయింది. అనిపిస్తే ఇంకొక స్పూన్స్ శెనగపిండి గాని బియ్యప్పిండి గాని వేసుకోవచ్చు. ఒక స్టవ్ పై కడాయిని పెట్టి దానిలో ఆయిల్ వేసుకోవాలి నూనె వేడి అవ్వాలి . వేడయ్యాక ఒకే చోట ముద్దగా వేసుకోకూడదు.
ఇలా విడివిడిగా వేసుకోవాలి. అన్ని వేసుకొని లో ఫ్లేమ్ కి మీడియం ఫ్లేమ్ కి మధ్యలో పెట్టి ఫ్రై చేసుకోవాలి. మంట మరీ ఎక్కువ ఉన్న త్వరగా వేగిపోయి ఇవి క్రిస్పీగా ఉండవు..మెత్తగా ఉంటాయి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. చూడండి వీళ్ళ బాగా వేగినాయి కదా. నూనె కూడా నురగ తగ్గింది. నూనెల నురగ తగ్గింది అంటే వేగినట్టే మనకి గరిటకి తెలుస్తాయి. క్రిస్పీగా ఇప్పుడు ఇది ప్లేట్లోకి తీసుకోవాలి. ఇదే విధంగా మిగతావన్నీ ఫ్రై చేసుకోవాలి. నూనె కూడా లాగదండి చాలా బాగా వస్తాయి ఇవి స్నాక్ లాగా సైడ్ డిష్ లాగా చాలా బాగుంటుంది. జీడపప్పును ను కూడా ప్లేట్లోకి తీసుకోవాలి. ఇవి కొద్దిగా వేగాక కరివేపాకు వేసుకుంటే సరిపోతుంది. చూడండి బాగా వేగినయి కదా ఇప్పుడు ఇది 65లో వేసుకోవాలి. ఇంతేనండి ఆలూ సిక్స్టీ ఫైవ్ తయారయింది. చూశారు కదా ఫ్రెండ్స్ చాలా సులభంగా తయారు చేసుకున్నాం…
Passports : పాస్పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్రాజ్లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.