Today Telugu Breaking News : రైతుబంధు(Rythu Bandhu Scheme) పంపిణీకి ఈసీ బ్రేక్ వేసింది. ఎన్నికల కోడ్ ఉల్లంఘించారంటూ వచ్చిన ఫిర్యాదులతో అనుమతి ఉపసంహరించుకుంటున్నట్టు ఈసీ తెలిపింది. నిధులు విడుదల చేయొద్దని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈనెల 28 లోపు రైతు బంధు పంపిణీ చేసుకోవచ్చని ఎన్నికల సంఘం 2 రోజుల క్రితమే అనుమతి ఇచ్చిన విషయం తెలిసిందే.
ఈవారం ఓటీటీలో(OTT Release movies this week) వచ్చే సినిమాల లిస్టు ఇదే. డిస్నీ హాట్ స్టార్ లో చిన్నా నవంబర్ 28న, ఇండియానా జోన్స్ ది డయల్ ఆఫ్ డెస్టినీ డిసెంబర్ 1న, సోనీలివ్ లో మార్టిన్ లూథర్ కింగ్ నవంబర్ 29న, జియోలో 800 డిసెంబర్ 2న, అమెజాన్ ప్రైమ్ లో దూత డిసెంబర్ 1న వెబ్ సిరీస్, నెట్ ఫ్లిక్స్ బుజ్జిగాడు, ఖుషీ, ఈరోజుల్లో, బంగారు బుల్లోడు, ఐతే నవంబర్ 30న, మిషన్ రాణిగంజ్ డిసెంబర్ 1న రిలీజ్ కానున్నాయి.
కాంగ్రెస్ నేతలే రైతు బంధు సాయం(Rythu Bandhu scheme) పంపిణీకి అనుమతిని ఈసీ ఉపసంహరించుకోవాలని వెంట పడి మరీ ఆపించారని కవిత(Kalvakuntla Kavitha) ఆరోపించారు. వారి ఫిర్యాదుతోనే ఈసీ ఈ నిర్ణయం తీసుకుందని.. రైతు వ్యతిరేకతను కాంగ్రెస్ నేతలు మరోసారి చాటుకున్నారని.. ముందు అనుమతి ఇచ్చిన ఈసీ కాంగ్రెస్ నేతల ఫిర్యాదుతోనే బ్రేక్ వేసిందన్నారు.
ఎన్నికల ప్రచారం రేపు ముగుస్తుండటంతో బీజేపీ భారీ ర్యాలీకి ఏర్పాట్లు చేసింది. హైదరాబాద్ లో సాయంత్రం 4 గంటలకు ఆర్టీసీ క్రాస్ రోడ్ నుంచి కాచిగూడ వీర్ సావర్కర్ విగ్రహం వరకు ప్రధాని మోదీ రోడ్(PM Modi Road Show) షో జరగనుంది. కాషాయ శ్రేణులు భారీగా జనసమీకరణ చేస్తున్నారు. అనంతరం ఎన్టీఆర్ స్టేడియంలో జరుగుతున్న కోటి దీపోత్సవంలో మోదీ పాల్గొంటారు.
రైతుబంధుకు ఈసీ బ్రేక్ వేయడంపై రేవంత్ రెడ్డి(Revanth Reddy) స్పందించారు. రైతుబంధుతో ఓట్లు దండుకోవాలన్న దురాశ, అహంకారం తప్పితే రైతులకు మేలు జరగాలన్న ఉద్దేశం కేసీఆర్, హరీశ్ రావు(Harish Rao)కు లేదన్నారు. హరీశ్ చేసిన వ్యాఖ్యల వల్లనే రైతుబంధుకు ఇచ్చిన అనుమతిని ఈసీ ఉపసంహరించుకుంటున్నట్టు ఆదేశాలు ఇచ్చిందని.. రైతులు ఆందోళన చెందవద్దని.. పది రోజుల్లో కాంగ్రెస్ అధికారంలోకి రాగానే రూ.15 వేలు రైతు భరోసా మీ ఖాతాల్లో వేస్తామన్నారు.
మీరు చాయ్ తాగే లోపు ఫోన్లు టింగ్ టింగ్ మని మోగుతాయని రైతుబంధును ఉద్దేశించి మంత్రి హరీశ్ రావు(Minister harish Rao) చేసిన వ్యాఖ్యల వల్లనే రైతుబంధు నిర్ణయాన్ని ఈసీ ఉపసంహరించుకుందని తెలంగాణ వ్యాప్తంగా ప్రచారం సాగుతోంది.
టీడీపీ యువనేత నారా లోకేష్(Nara Lokesh) యువగళం(Yuvagalam) పాదయాత్ర ఈరోజు నుంచి పున:ప్రారంభం కానుంది. అంబేడ్కర్ కోనసీమ జిల్లా రాజోలు మండలం పొదలాడ నుంచి ప్రారంభం కానుంది.
ఈరోజు కార్తీక పౌర్ణమి(Karthika Pournami) సందర్భంగా ఉదయం నుంచే నదులు, సముద్రాల్లో పుణ్యస్నానాలు ఆచరించేందుకు భక్తులు పోటెత్తారు. భద్రాచలం, శ్రీశైలంలో నది స్నానాలకు భారీగా తరలివచ్చారు. ఏపీలోనూ సముద్ర తీర ప్రాంత ప్రజలు పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు.
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.