
Vegetable Dum Biryani Recipe in Telugu on Video
Veg Biryani Recipe : ఈరోజు రెసిపీ వచ్చేసి వెజిటేబుల్ దమ్ బిర్యాని.. ఈ వెజిటేబుల్ బిర్యాని 100% రెస్టారెంట్ స్టైల్ లో అంత టేస్టీగా వస్తుంది. నేను చెప్పిన విధంగా మీరు పక్క కొలతలతో ఈ విధంగా ట్రై చేయండి. మీ ఇంట్లో వాళ్లు మళ్లీ మళ్లీ చేయమని అడుగుతారు. అంత బాగా కుదురుతుంది.. ఈ వెజిటేబుల్ దమ్ బిర్యాని చేయాలో ఇప్పుడు మనం చూద్దాం.. దీనికి కావాల్సిన పదార్థాలు : బిర్యానీ రైస్, కారం, ఉప్పు, పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా, అల్లం వెల్లుల్లి పేస్ట్, బిర్యానీ మసాలా, పెరుగు,5 రకాలు వెజిటేబుల్స్, ఆయిల్, నెయ్యి కుంకుమపువ్వు, ఆనియన్స్, సాజీర, బిర్యానీ ఆకు, జాపత్రి, అనాసపువ్వు మొదలైనవి… దీని తయారీ విధానం : ముందుగా ఆఫ్ కిలో బాస్మతి రైస్ ని తీసుకొని శుభ్రంగా కడిగి ఒక రెండు గంటల పాటు నానబెట్టుకోవాలి. తర్వాత ఒక బౌల్ తీసుకొని దానిలో హాఫ్ కప్ పెరుగు వేసుకొని బాగా కలుపుకోవాలి. తర్వాత దానిలో రెండు పచ్చిమిరపకాయలు కట్ చేసేసుకోవాలి.
తర్వాత ఒకటి వేసుకొని కారం ఒక టేబుల్ స్పూన్ ఉప్పు, కొంచెం పసుపు, కొంచెం ధనియాల పౌడర్ తర్వాత హాఫ్ టీ స్పూన్ ధనియాల పౌడర్ తర్వాత ఒక స్పూన్ బిర్యాని మసాలా తర్వాత కొంచెం గరం మసాలా తర్వాత ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేయాలి. తర్వాత కొంచెం కొత్తిమీర, పుదీనా కొంచెం వేసి బాగా కలుపుకోవాలి. తర్వాత దానిలో కొంచెం నిమ్మరసం కూడా వేసుకోవాలి. తర్వాత ఇవన్నీ కలిపిన తర్వాత దీనిలో వెజిటేబుల్స్ వేసుకోవాలి. కొన్ని క్యారెట్లు, కొన్ని బీన్స్ చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. తర్వాత క్యాలీఫ్లవర్ ముక్కలు కూడా వేయాలి. తర్వాత పచ్చి బఠాణి ఒక కప్పు వేసుకోవాలి. తర్వాత ఆలు ముక్కలు కూడా వేసుకోవాలి. తర్వాత వీటన్నిటిని బాగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న దాంట్లో ఒక హాఫ్ కప్పు ఫ్రైడ్ ఆనియన్ కూడా వేసి కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని ఒక అర్థగంట పాటు నానబెట్టుకోవాలి.
Vegetable Dum Biryani Recipe in Telugu on Video
తరవాత జాపత్రి, స్టార్, అనాసపువ్వు ఒక మూడు ఒక స్ట్రైనర్ లో వేసి లాక్ చేసుకుని రైస్ ఉడికే వాటర్ లో వేసుకోవాలి. ఒక పెద్ద గిన్నెలో మూడు లీటర్ల వాటర్ ని పోసి దానిలో కొంచెం షాజీరా, ఒక బిర్యానీ ఆకు, రెండు పచ్చిమిరపకాయలు తర్వాత స్టైనర్ లో మసాలాలన్నీ వేసుకున్నాం కదా ఆ స్టైనర్ని ఈ నీటిలో వేసి కొంచెం ఉప్పు కూడా వేసి బాగా కలుపుకోవాలి. తర్వాత కొంచెం నిమ్మరసం కూడా పిండుకోవాలి. తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా వేసి కలుపుకోవాలి. తర్వాత కొంచెం బిర్యానీ మసాలా కూడా వేసి కలుపుకోవాలి. తర్వాత ఒక మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ కూడా వేసుకోవాలి. వాటర్ మరిగిన తర్వాత ముందుగా నానబెట్టుకున్న బియ్యంని దానిలో వేసి 90% ఉడికించుకోండి. ఆ విధంగా ఉడికించుకున్న రైస్ని వేరే స్ట్రైనర్ లోకి తీసుకోవాలి. తర్వాత వెళ్లి తీసుకొని దాన్లో ఆయిల్ వేసుకొని దాంట్లో కొంచెం
సాజీర కొంచెం బిర్యానీ ఆకు వేసి వేయించిన తర్వాత ముందుగా నానబెట్టుకున్న వెజిటేబుల్స్ వేసి కొద్దిసేపు ఉడికించుకోవాలి. ఆ విధంగా ఉడికిన తర్వాత ముందుగా 90% ఉడికించుకున్న రైస్ ని కూడా మంచిగా పరుచుకోవాలి.పైన మళ్ళీ ఇంకొక లేయర్ రైస్ ని వేసుకోవాలి. అలా రెండు లేయర్లుగా పరుచుకున్న తర్వాత దానిపైన ఒక కాటన్ క్లాత్ తడిపి దానిపైన వేసి దానిపైన మూత పెట్టి మూత పై ఏదైనా బరువు పెట్టుకొని ఫ్లేమ్ని మీడియంలో ఉంచుకొని 8 మినిట్స్ ఉడికించుకున్న తర్వాత ఫ్లేమ్ని మ్యూట్ చేసుకొని ఒక 15 నిమిషాల పాటు ఉడికించుకుంటే సరిపోద్ది. 15 నిమిషాల తర్వాత స్టవ్ ఆపి 10 నిమిషాల వరకు ఉంచి తర్వాత నెమ్మదిగా ఓపెన్ చూస్తే వెజిటేబుల్ దమ్ బిర్యాని రెడీ అయిపోద్ది. అంతే ఎంతో సింపుల్ గా వెజిటేబుల్ దమ్ బిర్యాని రెడీ.
Onion Black Streaks : ఏ కూర వండినా ఉల్లిగడ్డ అనేది కీలకం. ఉల్లిగడ్డ లేకుండా ఏ కూర వండలేం.…
Jaggery Vs Sugar : మనిషి నాలుకకు టేస్ట్ దొరికితే చాలు.. అది ఆరోగ్యానికి మంచిదా? చెడ్డదా? అనే ఆలోచనే…
Benefits of Eating Fish : చాలామందికి ఫిష్ అంటే పడదు. చికెన్, మటన్ అంటే లొట్టలేసుకుంటూ లాగించేస్తారు కానీ..…
Egg vs Paneer : ఎగ్ అంటే ఇష్టం లేని వాళ్లు ఉండరు. కానీ నాన్ వెజిటేరియన్లు మాత్రమే ఎగ్…
Snoring Health Issues : చాలామంది నిద్రపోయేటప్పుడు గురక పెడుతూ ఉంటారు. గురక పెట్టేవాళ్లకు వాళ్లు గురక పెడుతున్నట్టు తెలియదు.…
Ghee Coffee or Bullet Coffee : కాఫీ అంటే అందరికీ తెలుసు కానీ ఈ బుల్లెట్ కాఫీ ఏంటి…
Swallow Bubble Gum : టైమ్ పాస్ కోసం చాలామంది నోట్లో ఎప్పుడూ బబుల్ గమ్ ను నములుతూ ఉంటారు.…
Garlic Health Benefits : వెల్లుల్లి అనగానే చాలామందికి నచ్చదు. ఎందుకంటే అది చాలా ఘాటుగా ఉంటుంది. కూరల్లో వేసినా…
This website uses cookies.